గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2024 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్..!

కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను గౌరవించి 1964 లో నంది అవార్డులు ఇవ్వాలని ఆనాడు నిర్ణయం తీసుకుంది. ఆ అనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత ఇవాళ గద్దర్ పేరుతో అవార్డులు అందిస్తున్నాం

భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా అది మీ అభివృద్ధి కోసమే మీకు ఏం కావాలో నాకు చెప్పండి… రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.

మరో 22 ఏండ్లు క్రియాశీల రాజకీయాల్లో నేనుంటా ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తా.

ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం. 2047 విజన్ డాక్యుమెంట్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం ఉంటుంది. 2047 నాటికి రాష్ట్ర ఏకానమీని 3 మిలియన్ డాలర్లకు చేరుస్తాం

గద్దరన్న అంటే ఒక విప్లవం.. ఒక వేగుచుక్క గద్దరన్న మాకు ఒక స్ఫూర్తి… ఆ స్ఫూర్తితోనే మేం పోరాటాలు చేశాం. తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నా.. తెలంగాణఅభివృద్ధిలో గద్దరన్న స్ఫూర్తి ఉంటుంది.