ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ రివేంజ్ పాలిటిక్స్..!

బిఆర్ఏస్ ఎమ్మెల్యేలకు దక్కాల్సిన గౌరవం దక్కడంలేదా..? అధికారం తమదైనప్పుడు అంతా తామేనంటూ హడావుడి చెసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు సైలేంట్ అయ్యారా..? నియోజకవర్గ ఒటర్లు ఆ నలుగురికి ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టినా ప్రోటోకాల్ దక్కక ఫీల్ అవుతున్నారా? కాంగ్రేస్ రివేంజ్ పాలిటిక్స్ తో తల్లడిల్లుతున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఏవరు ?లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్

ఉమ్మడి మెదక్ జిల్లాలో గట్టి పట్టున్న బిఆర్ఏస్ కు అడుగడుగున అవమానమే జరుగుతుంది .పదింటిలో ఏడుగురు బిఆర్ఏస్ ఎమ్మెల్యేలు ఉన్నా కాంగ్రేస్ నాయకులదే హవా నడుస్తోంది. జహీరాబాద్ నుండి నర్సాపూర్ వరకు ఉన్న బిఆర్ఏస్ ఎమ్మెల్యేల పలుకుబడి పనిచేయ్యలేదంట.అధికారంలో ఉన్నప్పుడు వంగి వంగి దండాలు పెట్టిన వారు కనీసం పలకరించడంలేదట. ఎమ్మెల్యేగా గేలిచిన విలువలేదంటూ సదరు బిఆర్ఏస్ ఎమ్మెల్యేలు తమవారి వద్ద వాపోతున్నారంట. సింగిల్ పోన్ కాల్ తో తమ పనులన్ని చక్కపెట్టుకునే వారిని ఏ అధికారి పట్టించుకోవడంలేదట.

బిఆర్ఏస్ ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ కోసం పోరాడుతున్నారు. జహీరాబాద్ కు రెండు సార్లు ఎమ్మెల్యేగా గేలుపును సోంతం చెసుకున్న మాణిక్ రావు ప్రభుత్వ ప్రోటాకాల్ లేక సతమతమవుతున్నారట. ప్రభుత్వ పథకాలు వాటి ప్రారంభోత్సవాలకు పిలవడంలేదని తన వారి దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కళ్యాణలక్ష్మి,షాదీముబారక్ తో పాటు సీఎం రిలిఫ్ పండ్ వంటి చెక్కుల పంపిని సైతం అక్కడి మాజీ కాంగ్రేస్ సీనియర్ నాయకుడు చంద్రశేర్ చెతులమిదుగా జరగడమే ఇందుకు నిదర్శనం . ఒకవైపు చంద్రశేఖర్ వర్గం మరోవైపు మాజీ మంత్రి గీతారెడ్డి వర్గం ఎమ్మెల్యే మాణిక్ రావు కు ప్రోటోకాల్ లెకుండానే పోటాపోటిగా పలు కార్యక్రమాలను చెస్తుండటం మాణిక్ రావుకు మింగుడుపడటంలేదట. కాంగ్రేస్ రివేంజ్ పాలిటిక్స్ తో చెసేదేమి లేక సరిపెట్టుకుంటున్నారంట ఆ నేత.

సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి , జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అన్నట్టుగా ఉన్న గత ఏన్నికల్లో.. సంగారెడ్డి ఒటర్లు జగ్గారెడ్డిని ఒడించి బిఆర్ఏస్ కు పట్టంకట్టారు. మాజీ మంత్రి హరీష్ రావు కు అత్యంత సన్నిహితులైన చింత ప్రభాకర్ ను గెలిపించారు.ప్రభుత్వం మారడంతో జగ్గారెడ్డికి చింత ప్రభాకర్ కు మద్య రివేంజ్ పాలిటిక్స్ ఒక రెంజులో నడుస్తున్నాయి. బిఆర్ఏస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు కనీస ప్రోటోకాల్ పాటించలేదన్న అక్కసు ను ఆయన తమ ప్రభుత్వం లో తీర్చుకుంటున్నారంట. టిజిఐఏస్సీ చైర్మన్ పదవిని జగ్గారెడ్డి తన భార్య నిర్మలకు కట్టపెట్టి ప్రోటాకాల్ మొత్తం ఆయన గుపెట్లో పెట్టుకున్నారట . ఏ చిన్న ప్రోగ్రాం అయినా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు అధికారులు సమాచారం ఇవ్వడంలేదంట.

పటాన్చేరు లో కాంగ్రేస్ పాలిటిక్స్ రంజుగా ఉన్నాయి . ఇక్కడ కూడా ముచ్చటగా మూడోసారి బిఆర్ఏస్ ఎమ్మెల్యే గా గేలుపు సోంతం చెసుకున్నారు గూడెం మహిపాల్ రెడ్డి.అయితే రాష్ట్రంలో బిఆర్ఏస్ అధికారం కోల్పోవడంతో చతికిల పడ్డారట. కొంత కాలం కాంగ్రేస్ పాలిటిక్స్ ను తట్టుకున్నా ఎక్కవ కాలం నిలవలేకపోయారట. దీంతో సీఎం రేవంత్ రెడ్డి చెతుల మీదుగా కాంగ్రెస్ కండువాను కప్పుకోని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా ప్రోటోకాల్ సమస్య తీరలేదంట . పటాన్చేరు నియోజకవర్గంలో కాట శ్రీనివాస్ గౌడ్ తో పాటు నీలం మదు ముదిరాజ్ లు గూడెం ఎమ్మెల్యే ప్రోటోకాల్ కు అడ్డు తగులుతున్నారంట .కాంగ్రెస్ ప్రభుత్వ తీసుకు వచ్చిన పథకాల్లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గోంటున్నారు. అధికారులు సైతం గూడెం మాటను పెడచెవిన పెడుతున్నారన్న టాక్ నియోజకవర్గంలో వినిపిస్తుంది.

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రోటాకాల్ పై పోరాటమే చెస్తుంది. కాంగ్రేస్ పార్టీలో మాజీ మంత్రిగా పనిచెసిన సునీత లక్ష్మారెడ్డి గత ఏన్నికల్లో బిఆర్ఏస్ ఎమ్మెల్యేగా విజయం సాధించినా పూర్వ వైభవం దక్కలేదన్న టాక్ నియోజకవర్గంలో నడుస్తుంది. సునీత లక్ష్మారెడ్డికి దక్కల్సిన ప్రోటోకాల్ దక్కకుండా తన శిష్యుడు రాజిరెడ్డి అన్ని కార్యక్రమాలు చెస్తున్నారని ఎమ్మెల్యే తెగ బాధపడిపోతున్నారంట. నర్సాపూర్,హత్నూరా , కౌడిపల్లి ప్రాంతాల్లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలు, పలు అబివృద్ది కార్యక్రమాల్లో కనీస మర్యాద ఇవ్వలేదని అమె బాహటంగా కాంగ్రేస్ ప్రభుత్వన్ని విమర్శించారు. మంత్రి కోండ సురేఖ పాల్గోన్నా కార్యక్రమంలో సైతం ప్రోటోకాల్ పాటించడంలేదంటూ సునీత లక్ష్మారెడ్డి అసహనాన్ని ప్రదర్శించిన సందర్బాలు ఉన్నాయి.

గత ప్రభుత్వంలో కాంగ్రేస్ క్యాడర్ కు జరిగిన అవమానాలను ఎవ్వరు మరచిపోలేదని నియోదకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రె స్ రివెంజ్ పాలిటిక్స్ లో సునితలక్ష్మా రెడ్డి సైతం అవమానాలకు గురవుతున్నారని టాక్ ప్రజల్లో వినిపిస్తుంది. ఎమ్మెల్యేగా రాజిరెడ్డి ఒడిపోయినా ప్రభుత్వం వారది కావడంతో సునిత లక్ష్మారెడ్డి ఏమి చెయ్యలేకపోతున్నారట. దీంతో రాజకీయ ఏత్తుగడలో ప్రోటోకాల్ రగడ ఉమ్మడి మెదక్ లో రచ్చరచ్చచెస్తుంది.