
బిఆర్ఏస్ లో కవిత ఎపిసోడ్ పార్టీ క్యాడర్ ను అయోమయంలో పడేసిందా..? కవిత కామెంట్స్ బిఆర్ఏస్ లో వర్గా విబేదాలకు ఉతమిస్తుందా..?
మేము కేటీఆర్ వర్గం మేము హరీష్ రావు వర్గమంటూ కార్యకర్తలు వారిని ఒన్ చెసుకునే పనిలో పడ్డారా..? అన్న కేటిఆర్ ను టార్గేట్ చెసిన కవిత బావ మాజీ మంత్రి హరీష్ రావును పల్లేత్తుమాట అనకపోవడంలో అంతర్యమేంటి ? బిఆర్ఏస్ లో కవిత సృష్టించిన సునామీ తీరం దాటేదేప్పుడు లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ అలుముకున్న పరిణామాలు, ఆమె రాసిన లేఖ..చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
తన అన్న కేటీఆర్ టార్గెట్ గా సంచలన పరోక్ష వ్యాఖ్యలు చేశారు కవిత. తండ్రి కేసీఆర్ తప్ప ఎవరి నాయకత్వం అంగీకరించేది లేదన్నారు. కేటీఆర్ కు బీఆర్ఎస్ పగ్గాలు అప్పగిస్తే తాను సహకరిస్తానని ఇటీవల మాజీ హరీష్ రావ్ ప్రకటించారు. ఆపై హరీష్ రావ్ ఇంటికి కేటీఆర్ కూడా వెళ్ళి మాట్లాడారు.. దీన్ని బట్టి కేటీఆర్ కు పగ్గాలు అప్పగిస్తే ఒప్పుకునేది లేదనే సంకేతం కవిత ఇచ్చారా అంటే అవుననే విధంగానే ఆమె వ్యాఖులున్నాయంటున్నారు నిపుణులు. కవిత చేసిన మరో ప్రధాన ఆరోపణ విలీనం అంశం. బీ ఆర్ ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేశారు. అయితే తాను అడ్డుకున్నానని ఇప్పుడు అందుకే తనను తండ్రి కేసీఆర్ కు పార్టీకి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
చాలా కాలంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ఇతర పార్టీలు ఆరోపిస్తున్నా ఇప్పుడు ఏకంగా కేసీఆర్ కుటుంబం లోని సభ్యురాలే కుండ బద్దలు కొట్టడంతో పార్టీ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దూమారం లేపాయి. కవిత మాటల ప్రభావం పార్టీ క్యాడర్ మిద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయనే టాక్ రాజకీయవర్గాల్లో జోరందుకుంది. ఇంతకాలం అంతర్గతంగా ఉన్న వర్గ విభేదాలు భహిర్గతమయ్యో అవకాలు ఉన్నాయని కార్యకర్తల మద్య చర్చ జరుగుతుంది. తాము పలానా నాయకుడి వర్గమని చెప్పుకునేందుకు కార్యకర్తలు ఉత్సాహపడుతున్నారట. బిఆర్ఏస్ పార్టీ క్యాడర్ లో కోందరు కవిత కామెంట్స్ ను లైట్ గా తీసుకుంటుంటే మరికోందరు కవిత వెనకాల ఏవరున్నారన్న దానిపై అరాతీస్తున్నారంట. కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లో కవిత కామెంట్స్ పై బిన్న అబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రత్యర్ధులకు ఇది ఒక అస్త్రం గా మారిందన్న టాక్ లేకపోలేదు. హరీష్ రావుతో అంటీ ముట్టనట్టు ఉండే కవిత ఆయనపై ఏలాంటి కామెంట్స్ చెయ్యకపోడంలో అంతర్యమేంటన్నది బీఆర్ఎస్ శ్రేణులకు అంతుచిక్కడంలేదంట.
తెలంగాణా జాగృతి కార్యకర్తలు తమ కవితక్క చెస్తున్న కామెంట్స్ ను ఏంజాయ్ చెస్తున్నారంట. కవిత వెసే ప్రతి అడుగును నిశితంగా పరిశీస్తున్నారంట.అక్క వెంట ఉన్న జాగృతి తమ్ముళ్లు భవిష్యత్తులో తాము రాజకీయంగా ఏదగోచ్చని ఆశపడుతున్నారంట. కేటీఆర్ పైన హరీష్ రావు పైన వ్యతిరేకంగా ఉన్న బిఆర్ఏస్ లోని కొందరు కవిత కు మద్దతుగా నిలుస్తున్నారని జాగృతి తమ్ములు చర్చించుకుంటున్నారట. మొన్నటి కవిత లేఖలు ,తాజా కామెంట్స్ కేసీఆర్ కుటుంబాన్ని బిఆర్ఏస్ పార్టీ అందోళనకు గురిచెస్తున్నాయి. ఒక పక్క కవిత పార్టీ పెడతారంటూ ప్రచారం జోరుగా సాగుతుంటే మరో వైపు బిఆర్ఏస్ లో కేసీఆర్ ఒక్కడే నాయకుడు అన్న కవిత కమెంట్స్ మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.