
నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉందా… తాను చేసిన వ్యాఖ్యలకు ఆమె మూల్యం చెల్లించక తప్పదా… ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొండా సురేఖ ఫెయిల్యూర్ అయ్యారా ఇంచార్జ్ మంత్రిగా కొండా సురేఖను పక్కనపెట్టి నియమించడంలో సీఎం రేవంత్ రెడ్డి అంతర్యమేంటి
టిఆర్ఎస్ పార్టీకి బాగా పట్టిన జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండ సురేఖ ఆ పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయలేకపోయారు అన్న అపవాదులు మూట కట్టుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో బిజీగా ఉండే కొండ సురేఖ ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ గ్రూపులను నియంత్రణ చేయడంలో ఫెయిల్యూర్ అయ్యాడని టాక్ పార్టీ శ్రేణులు బలంగా వినిపిస్తోంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జిగా బాధ్యతలు కట్టబెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె పనితీరు ఏమాత్రం నచ్చలేదని కాంగ్రెస్ క్యాడర్ లో వినిపిస్తోంది.
పార్టీలో అసమ్మతిగా ఉన్న వర్గాన్ని సమర్థవంతంగా హ్యాండిల్ చేయలేకపోయారని పార్టీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి భావించడంతో ఆమెను జిల్లా ఇన్చార్జి మంత్రిగా తొలగించారు. ప్రభుత్వ కార్యక్రమాలను సైతం ఆమె ప్రజల్లోకి తీసుకపోలేకపోయారన్న విమర్శలను సైతం ఆమె సొంతం చేసుకున్నారు.
వర్గ పోరు బలంగా ఉన్న పటాన్చెరువు నియోజకవర్గంలో ఒక వర్గానికి కొండా సురేఖ సపోర్ట్ చేసినట్టుగా కాంగ్రెస్ శ్రేణుల్లో వినికిడి. కొండ సురేఖ జిల్లాలో నెలకొన్న పార్టీ పరమైనటువంటి సమస్యలను పరిష్కరించడంలో తగినంత సమయం కేటాయించలేకపోయారన్న విమర్శలు సైతం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి.
ఇంచార్జ్ మంత్రిగా ప్రభుత్వ అధికారులతో సైతం కొండ సురేఖ సమన్వయం చేయలేకపోయారని ప్రభుత్వ పథకాలను ప్రజల ముందుకు తీసుకుపోలేకపోయారని మొత్తం మీద ఆమె పని తీరు నచ్చకనే సీఎం రేవంత్ రెడ్డి ఇన్చార్జి మంత్రిగా కొండ సురేఖ పక్కన పెట్టారన్న టాక్ ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది.
ఉమ్మడి మెదక్ జిల్లా చెందిన దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ లను యధావిధిగా ఆయా జిల్లాల ఇన్చార్జిగా కొనసాగిస్తూనే తాజాగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామి ని ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. రాబోయే రోజుల్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి పని తీరు ఎలా ఉంటుందో కానీ కొండ సురేఖకు ఫెయిల్యూర్స్ ఒక కనువిప్పు.