
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, ఆయన బెస్ట్ హాఫ్ అమల ఇద్దరూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో నాగార్జున దంపతులు సీఎం ను కలిసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే నాగార్జున తన ఫ్యామిలీతో కలిసి సడన్ గా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం వెనుక మ్యాటర్ ఏంటి అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.దీనిపై క్లారిటీ వచ్చేసింది..అదేంటంటే త్వరలో నాగ్ చిన్న కొడుకు అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడు.
ప్రముఖ బిజినెస్ మెన్ కూతురు జైనబ్ తో అఖిల్ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. జూన్ 6న వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అఖిల్ వెడ్డింగ్ కార్డుని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశాడు నాగార్జున దంపతులు. చిన్న కొడుకు పెళ్లికి ఇలా ఒక్కొక్కరిని దగ్గరుండి మరీ ఆహ్వానిస్తున్నారట నాగార్జున దంపతులు. అందులో భాగంగానే తమ ఇంటి జరిగే ఈ వేడుకకు మొదటి పత్రికను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అందించినట్లు సమాచారం