సునీతరావుపై యాక్షన్?

తెలంగాణ పీసీసీ కూర్పు పై హైకమాండ్ నిర్ణయాన్ని తప్పు పడితే క్రమ శిక్షణ చర్యలు తప్పవని పార్టీ పెద్దలు కరాకండిగా చెప్తున్నారు. ఇదివరకే పార్టీ లైన్ దాటి మాట్లాడినా, పార్టీ అంతర్గత సమస్యల్ని పబ్లిక్ చేసినా కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి వార్నింగ్ ఇచ్చారు. తాజాగా పీసీసీ పదవులపై కాంగ్రెస్ మహిళా నేత సునీత రావు వర్గం ధర్నా చేయడంతో ఒక్కసారిగా గాంధీ భవన్‌లో పదవుల రచ్చ మొదలైంది. ఆ క్రమంలో పీసీసీ కమిటీని ప్రకటించనుండటంతో మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు స్టేట్‌మెంట్లు ఇస్తే సహించేదిలేదని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పార్టీ పెద్దలు హెచ్చరిస్తున్నారు.

టీపీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో కమిటీని ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. పీసీసీకి సంబంధించి పేర్ల జాబితాను అందజేయగా, ముగ్గురు కమిటీ ఎంపికపై చర్చించినట్లుగా తెలిసింది. సామాజికవర్గాలు, జిల్లాలు, మహిళలు, మైనార్టీలు, పార్టీలో పాత, కొత్త వారు, సీనియార్టీ, సిన్సియార్టీని పరిగణలోకి తీసుకొని పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే కమిటీకి ఏఐసీసీ ఆమోద ముద్ర వేసి అధికారికంగా ప్రకటిస్తుందని పార్టీ నాయకుల ద్వారా తెలిసింది.

పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ గత సెప్టెంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పటి వరకు కూడా పీసీసీ నియామకం కొలిక్కి రాలేదు. ఎప్పటికప్పుడు కమిటీ వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం 9 నెలల గ్యాప్ తర్వాత వెలువడనున్న పీసీసీ లీస్ట్‌పై చాలా మంది లీడర్లు ఆశతో ఉన్నారు. ఆ లిస్టులోనే తమ పేరు రావాలని ఎవరికి వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. కొందరు తమ సామాజిక వర్గ బలం చూపిస్తూ.. అధిష్టానంపై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో గాంధీ భవన్లో స్వయంగా పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు ధర్నా చేయడమే కాకుండా పీసీసీ కూర్పుపై మహిళా నేత సునీత రావు హాట్ కామెంట్స్ చేశారు.

ప్రభుత్వం, కార్పొరేషన్ పదవుల్లోనూ మహిళా నేతలకు సరైనా ప్రాధాన్యత దక్కడంలేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆందోళనకు దిగారు. పదవులన్నీ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ బంధువులకే ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తమకు కాంగ్రెస్ తగిన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్పొరేషన్లు,
పార్టీ కమిటీల్లో మహిళా కాంగ్రెస్ నేతలకు అవకాశం కల్పించాలని, పార్టీ అధిష్టానం ఆదేశాల
మేరకు మహిళా డిక్లరేషను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగక పోతే రాజీనామా చేయడానికి అయినా సిద్ధమేనని హెచ్చరించారు

బైట్ సునీతరావు (1505 GB MAHILA CONGRESS SUNITHA RAO F2F _F1505252928584.mxf)

మరో పక్క రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చీ రాగానే సమావేశాలు ఏర్పాటు చేసి హై కమాండ్ నిర్ణయాలను ఎవరు తప్పుపట్టొద్దని.. పార్టీ కోసం కష్ట పడ్డ వారికి తప్పకుండా పదవులు వస్తాయని, పార్టీ గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. ఆ క్రమంలోనే అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ ఎమ్మెల్సీ తీన్నార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేయించారు. సామాజిక కూర్పుతోనే పార్టీ పరంగా పోస్టులు వస్తాయని, కష్టపడిన వారి విషయంలో హై కమాండ్ అన్ని బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. హై కమాండ్ నుండి ఎలాంటి నిర్ణయం వచ్చినా దాన్ని స్వాగతించాలని, ఓపికతో ఉండాలని పార్టీ పెద్దలు నాయకులకు స్పష్టంగా చెప్తున్నారు.

అయినా ధిక్కారస్వరం వినిపిస్తూ, ఏకంగా పీసీసీ చీఫ్‌నే టార్గెట్ చేయడంతో రేపో మాపో సునీతరావుపై సైతం యాక్షన్ ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది. మహేష్‌కుమార్‌గౌడ్ బంధువులకే పోస్టులంటూ, కులాన్ని అపాదించి సునీతరావు ప్రతి పక్ష నేత మాదిరి కామెంట్స్ చేయడాన్ని పార్టీ పెద్దలు సీరియస్‌గా తీసుకున్నారంట. సునీతరావుకి పార్టీ ఎప్పడు తక్కువ చేయలేదని, ఆమెకి గోషామహల్ టికెట్తో పాటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చినప్పటికీ, పార్టీకోసం పని చేయకుండా ఈ విధంగా పార్టీకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు ఊతమిచ్చేలా ఆమె చేసిన కామెంట్స్‌పై హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం

త్వరలో వచ్చే పీసీసీ జాబితాపై చాలా మంది ఆశావహులు ఆశతో ఉన్నారు. వారందరికీ పార్టీ పెద్దలు హైకమాండ్ నిర్ణయం ఎలా వచ్చినా నాలుగు గోడల మధ్య చర్చించుకోవాలి తప్ప, బయట ఇష్టం వచ్చినట్లు చేస్తాం అంటే ఉపేక్షించేది లేదని గట్గిగానే చెప్తున్నారంట . చూడాలి మరి పీసీసీ కమిటీ రచ్చ ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో?