
Telangana government Pension Scheme: తెలంగాణ ప్రభుత్వంలో అర్హులకు అందాల్సిన పెన్షన్లు ఆత్మలకు ఇస్తున్నారు…ఏంటి నమ్మడం లేదా అవునండి ఇది నిజం.. ప్రతినెల నెల క్రమ తప్పకుండా మృతి చెందిన వారి అకౌంట్లో అధికారులు డబ్బులు జమ చేస్తున్నారు… ఇదేంటండి బతికున్న వాళ్లకు కదా పెన్షన్ ఇచ్చేది.. మృతులకు కూడ పెన్షన్ ఇస్తారా అది ఎక్కడ అని ఆశ్చర్యపోతున్నారా…? అది ఎక్కడో కాదండి మన తెలంగాణ రాష్ట్రాల్లోనే… మొద్దు నిద్ర వీడని అధికారులు మృతి చెందిన వారి ఖాతాల్లో ప్రతి నెల చేయూత పథకం ద్వారా అందించే పెన్షన్ డబ్బులు మృతి చెందిన వారి ఖాతాల్లో వేస్తున్నారు. ఒక్కరు ఇద్దరికి కాదు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.50 లక్షల మంది మృతుల ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా…? మృతుల ఖాతాల్లో పెన్షన్ డబ్బులు ఎలా జమ అవుతున్నాయి. రూ. కోట్లలో ప్రజా ధనం వృధా అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారానేదానిపై మెగా 9 స్పెషల్ స్టోరీ….
ఏ ఆసరా లేని నిరుపేదలకు ఆర్థిక చేయూత నిచ్చేందుకు ప్రభుత్వాలు నెల నెల పెన్షన్ ఇచ్చి ఆదుకోవడం మామూలు విషయమే. కానీ చేసే పనిపట్ల చిత్త శుద్ధి లేని తెలంగాణ ప్రభుత్వ అధికారుల నిర్వాకం వల్ల ఏకంగా మృతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. తప్పిపోయి ఒక నెల రెండు నెలలు అనుకుందాము అంటే అది లేదు ఏకంగా 5 సంవత్సరాల క్రితం మృతి చెందిన వారి ఖాతాహల్లోనూ డబ్బులు జమ చేస్తున్నారు. అంటే అధికారులు, అధికార యంత్రాంగం ఎంత మొద్దు నిద్రలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రతినెల వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, భర్త వదిలేసిన ఒంటరి మహిళలకు, గీత, నేతకార్మి కులు, బీడీ కార్మికులకు, హెచ్ఐవి బాధితులకు గత ప్రభుత్వం ఆసరా పథకం పేరుతో పెన్షన్ ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకం పేరుతో పెన్షన్ అందిస్తుంది. రాష్ట్రంలో చేయూత పథకం కింద సుమారు 42.7 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే వీరిలో గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 1.50 లక్షలకు పైగా లబ్ధిదారులు మృతి చెందారు. ఇందులో ఎక్కువమంది వృద్ధులే ఉన్నారు అనే అంచనా. వారు మృతి చెందిన వారి ఖాతాల్లో మాత్రం యధాతథంగా పెన్షన్ డబ్బులు పడుతున్నాయి. Telangana government Pension Scheme.
ఒకవైపు లోటు బడ్జెట్ తో ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రభుత్వ పెద్దలు అనేక అపసోపాలు పడుతుండగా అధికారులు మాత్రం నిర్లక్ష్యంతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మృతుల ఖాతాల్లో వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.50 లక్షల మంది ఖాతాల్లో నెలకు రూ.32 కోట్ల డబ్బులు జమ చేస్తున్నారు. సంవత్సరానికి రూ.384 కోట్లు సగటున నాలుగు సంవత్సరాల లెక్క చూస్తే 1,536 కోట్ల రూపాయలు మృతుల ఖాతాలో జమ అయినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదంతా అధికారుల నిర్లక్ష్యం మూలంగానే జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పెన్షన్ పొందిన వారు మృతి చెందినప్పుడు వారి పేర్లు పెన్షన్ జాబితా నుంచి తీసివేయాలని ప్రతిపాదించాల్సిన అధికారులు వారి విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో సంవత్సరాల కాలంగా మృతుల ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయి. ఈ క్రమంలో మృతుల పేరుమీద ఏటీఎం ఉంటే వారి బంధువులు పెన్షన్ డబ్బులు దర్జాగా విత్ డ్రా చేసుకుంటున్నారు. ఏటిఎం లేని వారు కొందరు తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి, మరికొందరు బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నారు. ఇవి ఏమి చేయలేని వారు డబ్బులు తియ్యక పోవడానికి మృతుల ఖాతాల్లో కోట్ల రూపాయల పెన్షన్ డబ్బులు మూలుగుతున్నాయి.
మృతుల పేర్లు జాబితాలో భద్రంగా ఉంచిన అధికారులు నెల నెల కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా చేస్తున్నారు. 2016 లో ఆసరా పెన్షన్ తీసుకునే వారి సంఖ్య అన్ని విభాగాల వారు కలిసి 38.42 లక్షల మంది ఉండగా ప్రస్తుతం చేయూత పెన్షన్ తీసుకునే వారి సంఖ్య 42.7 లక్షలకు పెరిగింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధులకు వయో పరిమితి 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు కుదించి దరఖాస్తులు తీసుకుని కొత్త పేషన్స్ మాత్రం మంజూరు చేయలేదు. ఇప్పుడు కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు 20 లక్షల వరకు ఉన్నారు. గత ఐదు సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు మంజూరు లేకపోవడంతో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూపులు చేస్తున్నారు. మరో వైపు కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొని వ్యద పడుతున్న కొత్త పెన్షన్ మంజూరు ఇవ్వడం లేదని దరఖాసిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైన ప్రభుత్వం సంధించి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర విచారణ చేపట్టి పెన్షన్ డబ్బుల వృథాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. అర్హులైన వారికి కొత్త పెన్షన్ మంజూరి చేసి గత ఐదు సంవత్సరాలుగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసి పడిగాపులు పడుతున్న వారి తిప్పలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: https://www.mega9tv.com/telangana/today-telangana-freedom-fighter-doddi-komaraiah-death-anniversary/