ఆ మాస్ లీడర్లు ఒక్కటయ్యారా..?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డికి మద్య బందం బలపడుతుందా.? మాస్ లీడర్లు ఇద్దరు ఒక్కటయ్యారా..?రేవంత్ రెడ్డి పైన అసమ్మతి గళం వినిపించిన జగ్గన్న కు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే సమ్మతమేనా..?ఒకరి పై ఒకరికి కోపాలు తాపాలు పోయినట్టేనా..? జగ్గరెడ్డిని ప్రత్యేకంగా నిమ్జ్ భూ నిర్వాసితులకు పక్కాఇళ్లు కట్టించేందుకు బాస్ ను చెయ్యడంలో రేవంత్ రెడ్డి అంతర్యమేంటి ? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.

కాంగ్రేస్ పార్టీలో వర్గ విభేదాలు ఒ పట్టానా ఏవ్వరికి అర్థంకావు . అర్థమయ్యోలోపే వాటి అర్దాలు
మారిపోతాయి . అప్పటి వరకు తిట్టుకున్న వాళ్ళు మరో క్షణంలో అలింగనం చెసుకోని ఒకరి గొప్పలు ఒకరు చెప్పుకుంటారు . అదేమిటో మరి కాంగ్రేస్ తీరు అంతేనేమో. గతంలో కాంగ్రేస్ లో భీకరంగా విమర్శలప చెసుకున్న వారు మరో క్షణంలో అత్మీయంగా ఒకరి నొకరు పోగిడేసుకున్న సందర్బాలు చాలానే ఉన్నాయి. ఇటీవల కాలంలో .. సీఎం పదవి ఆయన కు ఇస్తే మాకు ఇష్టంలేదని వర్గాలను తయారు చెసిన వ్యక్తులకు అండగా నిలిచి ఏన్నో పర్యాయాలు మిడియా సాక్షిగా విమర్శలు చెశారు. జగ్గారెడ్డి .తనకు అఢ్డోస్తే తోక్కేస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్స్ కూడా చాలామందికి గుర్తుండే ఉంటాయి.కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.

ఒకరినొకరు పౌరుషంగా మీడియా ముఖంగా తీవ్ర విమర్శలు చేసుకోవడంతో కాంగ్రేస్ శ్రేణులు ఆందోళన చెందాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది. వారిద్దరి మద్య బంధం బలపడుతున్నట్లు కనిపిస్తుంది. వారి మధ్య అనుబంధం చూసి కాంగ్రెస్ శ్రేణుల్లో కొందరు కుల్లుకుంటున్నారంట . బద్ధ శత్రులవుతారిని భావించిన వారు బంగపడ్డారన్న టాక్ కాంగ్రేస్ పార్టీలో వినిపిస్తోంది.

మొదటి నుండి రేవంత్ రెడ్డెని వ్యతిరేకిస్తున్న జగ్గరెడ్డి.. తెల్లారేసరికి రేవంత్ తో కనిపించడం పార్టీలలో చాలా మంది సీనియర్లకు మింగుడు పడడంలేదంట. తాను కూడా సీఎం రేసులో ఉంటానంటూ ఎన్నో సార్లు ప్రకటించిన జగ్గారెడ్డి….సీఎం ఏమి చెసినా వ్యతిరేకిస్తూ వస్తున్న జగ్గరెడ్డి..ఇప్పుడు సీఎంకు మరింత దగ్గరవ్వడం పార్టీ వర్గాల్లో కొందరికి నచ్చకపోయునా కార్యకర్తల్లో మాత్రం కొత్త జోష్ నిస్తుందన్న టాక్ నడుస్తుంది. ఎమ్మెల్యే గా జగ్గారెడ్డి ఓటమి పాలైనా ఆయన గౌరవాన్ని సీఎం తగ్గించడంలేదట . జగ్గారెడ్డి సొంత జిల్లా సొంత నియోజకవర్గం లో జరిగే ముఖ్యకార్యక్రమాలకే జగ్గరెడ్డిని పరిమితం చెయ్యడంలేదట సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలోనూ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ జగ్గారెడ్డికి ప్రాధాన్యత నిస్తురని కాంగ్రేస్ శ్రేణుల్లో చర్చజరుగుతుంది.

జగ్గారెడ్డికి దక్కాల్సింది దక్కుతుండంతో సీఎం రేవంత్ రెడ్డి పైన ఇన్నాళ్లు చేసిన అరోపణలు, విమర్శలకు తనదైన పంథాలో జగ్గారెడ్డి సమాధానమిస్తున్నారట. ఇటీవల ఈటల రాజేందర్ సీఎం పైన చెసిన వాఖ్యలకు జగ్గారెడ్డి ఇచ్చిన వార్నింగే అందుకు ఉదాహరణ అని అంటున్నారు. పార్టీ అధికారం లోకి రాగానే కాంగ్రేస్ నాయకుల అలోచనలు పూర్తిగా మారిపోవడం మంచిదేనంటున్నారు . ఎన్నికల ముందు ఒక లెక్క ఎన్నికల తరువాత మరో లెక్కగా మారిన జగ్గారెడ్డి… రేవంత్ రెడ్డిల అన్యోన్యత ఇలాగే కలకాలం ఉండాలని అటు రేవంత్ రెడ్డి అభిమానులు ఇటు జగ్గారెడ్డి క్యాడర్ కొరుకుంటోందట.