
Tesla’s first autonomous car: డ్రైవర్ అవసరం లేదు.. రిమోటో కూడా అక్కర్లేదు.. మీరు కారు ఆర్డర్ ఇస్తే చాలు.. ఫ్యాక్టరీ నుంచి స్వయంగా కారు మీ ఇంటికి దాని కదే వచ్చేస్తుంది. ఇది ఎలా సాధ్యం..? దీనిని టెస్లా నిరూపించింది..? భవిష్యత్తులో కార్లు ఎలా ఉండబోతున్నాయో టెస్లా ఇప్పుడే చూపించింది. ఇంతకీ ఈ కొత్త కారు స్పెషాలిటీ ఏంటి..? ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంది..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
టెస్లా కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ కారు డెలివరీ చేసి చరిత్ర సృష్టించింది. టెస్లా మోడల్ Y కారు టెక్సాస్‌లోని గిగాఫ్యాక్టరీ నుంచి కస్టమర్ ఇంటికి డ్రైవర్ లేకుండా, రిమోట్ కంట్రోల్ లేకుండా స్వయంగా వెళ్లింది. ఈ సంఘటన టెస్లా సెల్ఫ్-డ్రైవింగ్ టెక్నాలజీలో కొత్త మైలురాయి. సుమారు 24 కిలోమీటర్లు ప్రయాణించడానికి 30 నిమిషాలు పట్టింది. కారు గిగాఫ్యాక్టరీ పార్కింగ్ నుంచి బయలుదేరి, హైవేలు, సిటీ రోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, ఇంటర్‌సెక్షన్లను దాటుకుంటూ కస్టమర్ ఇంటి డ్రైవ్‌వేలో ఆగింది. ఈ సమయంలో కారు గంటకు 116 కిలోమీటర్ల వేగంతో వెళ్లింది. టెస్లా ఈ డెలివరీ వీడియోను Xలో పోస్ట్ చేసింది, అది ఇప్పుడు వైరల్ అయింది. ఈ కారు టెస్లా ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌తో నడిచింది. కెమెరాలు, సెన్సార్లు, AI ఆధారంగా రోడ్డు పరిస్థితులను ఈ సాఫ్ట్‌వేర్ అర్థం చేసుకుని, స్టాప్ సైన్‌లు, ట్రాఫిక్ లైట్లు, ఇతర వాహనాలను గుర్తించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ వీడియోను షేర్ చేసిన టెస్లా CEO ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ కారు డెలివరీ అని కొనియాడారు.
టెస్లా Y మోడల్ కారులో ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్ కీలకంగా పనిచేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ కారులోని కెమెరాలు, రాడార్, అల్ట్రాసోనిక్ సెన్సార్లను ఉపయోగించి రోడ్డును స్కాన్ చేస్తుంది. టెస్లా AI చిప్‌లు, న్యూరల్ నెట్‌వర్క్‌లు రోడ్డు పరిస్థితులను విశ్లేషించి, డ్రైవింగ్ ఎలా చేయాలో నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ టెక్నాలజీని టెస్లా గత పదేళ్లుగా అభివృద్ధి చేస్తోంది. 2016 నుంచి టెస్లా కార్లలో FSD హార్డ్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తోంది, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో దీన్ని మెరుగుపరుస్తోంది. ఈ డెలివరీకి ముందు, టెస్లా ఏప్రిల్ లో తన గిగాఫ్యాక్టరీలో కార్లను షిప్పింగ్ యార్డ్‌కు అటానమస్‌గా తరలించే వీడియో చూపించింది. ఈ డెలివరీలో కారు హైవేలు, సిటీ రోడ్లు, ట్రాఫిక్‌ను దాటుకుని వెళ్లింది. టెస్లా లైడార్ టెక్నాలజీని ఉపయోగించకుండా, కేవలం కెమెరా-ఆధారిత విజన్ సిస్టమ్‌తో ఈ ఘనత సాధించింది. ఎలాన్ మస్క్ ఈ లైడార్‌ను అనవసరం అని చెప్పుకొచ్చారు. టెస్లా కార్లకు కెమెరాలే చాలని నమ్ముతున్నారు. అయితే, కొందరు నిపుణులు ఈ విధానం వల్ల రాత్రి, కొన్ని వాతావరణాల్లో పనిచేయకపోవచ్చని చెబుతున్నారు. Tesla’s first autonomous car.
అయితే .. టెస్లా ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ టెక్నాలజీ ప్రస్తుతం బాగానే ఉన్నా.. ఇంకా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. Y మోడల్ కారు హైవేలు, సిటీ రోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను స్పెల్ఫ్ డ్రైవింగ్ లో దాటుకుంటూ వెళ్లింది. టెస్లా FSD సాఫ్ట్‌వేర్ SAE లెవెల్ 4 అటానమీ స్థాయికి దగ్గరగా ఉందని నిపుణులు అంటున్నారు. అయితే, ఇది ఇంకా లెవెల్ 5 కాదు. గూగుల్ వేమో ఇప్పటికే ఫీనిక్స్, లాస్ ఏంజిల్స్‌లో రోబోటాక్సీ సర్వీస్‌లను నడుపుతోంది. ఇప్పుడు టెస్లా ఈ డెలివరీతో కొత్త మైలురాయిని సృష్టించింది. కేవలం కెమెరాలు, AIపై టెస్లా టెక్నాలజీ ఆధారపడుతోంది. ఇది ఖర్చును తగ్గించిన చీకటి, కొన్ని వాతావరణాల్లో సమస్యలు ఎదురవుతాయని కొందరు అంటున్నారు. గతంలో టెస్లా సెల్ఫ్-డ్రైవింగ్ టెక్నాలజీ ఉపయోగించిన కార్లు ప్రమాదానికి గురయ్యాయి. దీని వల్ల వీటి భద్రతపై అనేక సందేహాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సమస్యలను అదిగమిస్తామని టెస్లా చెబుతోంది.
టెస్లా అటానమస్ కారు డెలివరీ ఆటోమొబైల్ పరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని అంటున్నారు. ఈ టెక్నాలజీ కారు డెలివరీ ప్రక్రియను సులభతరం చేస్తుంది. సాంప్రదాయకంగా కార్లను ట్రక్కుల్లో లేదా డ్రైవర్లతో డెలివరీ చేస్తారు, ఇది ఖర్చును పెంచుతుంది. టెస్లా లాంటి అటానమస్ డెలివరీ ఈ ఖర్చును తగ్గిస్తుంది. ఈ ఘనత రోబోటాక్సీ సర్వీస్‌లకు మార్గం సుగమం చేస్తుంది. టెస్లా ఇప్పటికే ఆస్టిన్‌లో రోబోటాక్సీ పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. టెస్లా కొత్త టెక్నాలజీ ఇతర కంపెనీలను అటానమస్ డ్రైవింగ్‌పై దృష్టి పెట్టేలా చేస్తోంది. లెక్కల ప్రకారం, 2035 నాటికి అటానమస్ కార్ల మార్కెట్ 400 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. టెస్లా ఈ రంగంలో ముందంజలో ఉంది. కొత్త కారు మంచి మార్కులు కొట్టేయడంతో టెస్లా మార్కెట్ విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ టెక్నాలజీకి ఇంకా రెగ్యులేటరీ అనుమతులు, భద్రతా పరీక్షలు అవసరం.
Also Read: https://www.mega9tv.com/technology/unlock-your-english-potential-with-ai-powered-english-coach-app/