‘నువ్వేది కోరితే అదే అవుతావు..’ స్వామి వివేకానంద వర్ధంతి నేడు!

Swami Vivekananda Death Anniversary: భారతదేశ భవిష్యత్తుని మార్చగలిగేది యువతేనని.. వారికోసం ఆయన ఎంతో తపించారు. ఆయన పుట్టినరోజు జనవరి 12 కాగాను పురస్కరించుకొని “నేషనల్ యూత్ డే”గా జరుపుకుంటున్నాం. ఆయన తన ప్రసంగాలతో, సూక్తులతో పుస్తకాలతో, యువతరాన్ని ఉత్తేజపరిచి, సరైన మార్గర్దర్శనం చేశారు.

మందలో ఉండకు.. వందలో ఉండటానికి ప్రయత్నించు..
‘‘లేవండి.. మేల్కోండి, గమ్యం చేరేవరకూ విశ్రమించకండి…
బలమే జీవితం, బలహీనతే మరణం. Swami Vivekananda Death Anniversary.
ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువతే ఈ దేశానికి కావాలి” అంటూ యువతను ప్రభావితం చేసిన మహనీయుడు, యోగి, భారతీయ తత్వవేత్త, గొప్ప వక్త. అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకులు, సంఘసంస్కర్త అయిన స్వామి వివేకానందులు వారి
వర్ధంతి నేడు (1902, జులై 4). ఈ సందర్భంగా ఆయన సందేశాలు మీకోసం..

‘డబ్బులేని వాడు కాదు, జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడు అసలైన పేదవాడు’.

‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు.. కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశం స్వరూపాన్నే మార్చేస్తాను’.

‘నా దృష్టిలో ఎవరైనా తనను తాను అల్పుడని, హీనుడని భావించడమే అజ్ఞానం’.

‘లేవండి! మేల్కొండి! మిమ్మల్ని మీరు మేల్కొలుపుకొని ఇతరుల్ని మేల్కోల్పండి!
మీరు మరణించడానికి ముందే జీవిత పరమావధిని సాధించండి! లేవండి! మేల్కొండి!
గమ్యం చేరేవరకు ఎక్కడా నిలవకండి!’.

‘ఉన్నత స్థితికి చేరుకోవాలంటే…
ఈ మూడు లక్షణాలు ముఖ్యం..
మంచితనం మీదున్న విశ్వాసం,
అసూయ, అనుమానం లేకుండా ఉండటం,
మంచికి సహకరించడం’.

‘నువ్వేది కోరితే అదే అవుతావు..
దీనుడవని తలిస్తే దీనుడివే అవుతావు..
బలవంతుడని తలిస్తే బలవంతుడివవుతావు’.

‘అపార విశ్వాసం, అనంత శక్తి – ఇవే విజయసాధనకు మార్గం’.

‘మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించడమే మహాపాపం’.

‘అసత్యమైన దానికి దూరంగా ఉండు..
సత్యాన్నే అంటిపెట్టుకొని ఉంటే విజయం సాధించగలం. ఆలస్యమైనప్పటికీ విజయం సాధించే తీరతాం’.

‘ధనం కాదు..
కీర్తి ప్రతిష్టలు కాదు..
పాండిత్యం కాదు..
సౌశీల్యం ఒక్కటే ముఖ్యం’.

‘నీ ప్రతి పనిలో ఆచరణను పాటించు..
ఆచరణ కొరవడిన అనేక సిద్దాంతాల వల్లే దేశం పూర్తిగా నాశనమైంది’.

‘మనకు కావాల్సింది స్పందించే హృదయం..
ఆలోచించే మెదడు, పనిచేసే బలమైన హస్తం.
కర్మ చేసే యోగ్యతను సంపాదించు’.

‘సేవకుడిగా ఉండండి.
నిస్వార్థంగా ఉండండి.
అనంత సహనం కలిగి ఉండండి.
అప్పుడు విజయం మీదే!’.