
Nithin Venu Yellamma Movie: నితిన్ ఈ హీరోకు ఈమధ్య టైమ్ అసలు బాలేదు. ఏ సినిమా చేసినా ఫ్లాపే. చాలా కథలు విని ఎంతో ఆలోచించి సినిమా చేస్తే.. ఆ సినిమా చేదు ఫలితాన్ని అందిస్తుంది. ఇదిలా ఉంటే.. నితిన్ ఫ్రీగా నటిస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఎంత ఫ్లాపుల్లో ఉన్నా ఇక్కడ ఎవరు ఫ్రీగా నటించడానికి ఇష్టపడరు కానీ.. నితిన్ ఫ్రీగా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఈ వార్తల వెనకున్న వాస్తవం ఏంటి..? అసలు నితిన్ ప్లాన్ ఏంటి..?
జయం సినిమాతో కెరీర్ ప్రారంభించిన నితిన్ వరుసగా సక్సెస్ సాధించి యూత్ కి బాగా దగ్గరయ్యాడు. ఆతర్వాత మాస్ ఇమేజ్ కోసం ట్రై చేయడంతో వరుస ఫ్లాపులు చూడాల్సివచ్చింది. తన తప్పు తెలుసుకుని తన నుంచి జనాలు ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారో అలాంటి సినిమాలు చేయడంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. అదే ఇష్క్. ఈ విభిన్న ప్రేమకథా చిత్రం నితిన్ కి మళ్లీ సక్సెస్ అందించి కెరీర్ ను ట్రాక్ లోకి తీసుకువచ్చింది. ఆతర్వాత గుండెజారీ గల్లంతయ్యిందే సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆతర్వాత భీష్మతో సక్సెస్ సాధించినా మళ్లీ చెక్, రంగదే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీమేన్, రాబిన్ హుడ్, తమ్ముడు అంటూ వరుసగా ఫ్లాపులు చూశాడు.
తమ్ముడు సినిమాని దిల్ రాజు నిర్మించారు. వేణు శ్రీరామ్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. అయితే.. కొత్తగా ఉంటుందని ట్రై చేసిన ఈ సినిమా ఆడియన్స్ ని ఏమాత్రం మెప్పించలేదు. కనీసం ఓపెనింగ్స్ కూడా సరిగా రాలేదు. ఈ సినిమాకి బడ్జెట్ బాగా పెరిగిపోయింది. అందుకనే రెమ్యూనరేషన్ విషయంలో బెట్టు చేయలేదట. అంకుల్ మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి అంటూ దిల్ రాజుకు కబురు పెట్టాడట. మొత్తానికి చాలా అంటే చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు నితిన్. సినిమా హిట్టయితే అతడికి మరికొంత ఇచ్చేవారు కానీ.. డిజాస్టర్ అవ్వడంతో నితిన్ కు అదే ఫైనల్ పేమెంట్ గా మారింది. Nithin Venu Yellamma Movie.
ఇప్పుడు నితిన్ దిల్ రాజు బ్యానర్ లోనే ఎల్లమ్మ అనే సినిమా చేయనున్నాడు. దీనికి బలగం వేణు డైరెక్టర్. తమ్ముడు సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమాకి ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోవడం లేదట. ఈ సినిమా కోసం తనకు డబ్బులు వద్దని చెప్పేశాడట నితిన్. తమ్ముడు సినిమాకు విడుదలకు ముందు కొంత అమౌంట్ తీసుకున్న ఈ హీరో ఎల్లమ్మ సినిమాకు మాత్రం సక్సెస్ అయిన తర్వాత పేమెంట్ తీసుకుంటానని, లేకపోతే ఒక్క పైసా కూడా వద్దని నిర్మాతకు చెప్పేశాడట. ఇప్పుడు ఈ వార్త వైరల్ అయ్యింది. ఇప్పుడు నితిన్ కు డబ్బులు కంటే విజయం ముఖ్యం. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటున్నారు సినీ జనాలు. మరి.. ఎల్లమ్మ అయినా నితిన్ కు ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.