
Hollywood stars in Telugu movies: తెలుగు సినిమా సత్తా ఏంటి అనేది బాహుబలి సినిమాతో ప్రపంచానికి తెలియడంతో బాలీవుడ్ మాత్రమే కాదు.. హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూస్తుంది. దీంతో తెలుగు సినిమా మేకర్స్ పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాల కోసం హాలీవుడ్ స్టార్స్ ను సైతం రంగంలోకి దింపుతున్నారు. లేటెస్ట్ గా ఇప్పుడు తెలుగు సినిమాల్లోకి హాలీవుడ్ స్టార్స్ ని తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి.. ఏ ఏ తెలుగు సినిమాల్లో హాలీవుడ్ స్టార్స్ నటించబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
లైగర్ కోసం మైక్ టైసన్ ని తీసుకువచ్చాడు పూరి. అంతగా ప్రాముఖ్యత లేని రోల్ టైసన్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ.. పూరి టైసన్ ని రంగంలోకి దింపాడు. అయితే.. లైగర్ మూవీ ప్లాప్ అవ్వడంతో టైసన్ కి మళ్లీ అవకాశాలు రాలేదు. ఇదిలా ఉంటే.. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను పాన్ ఇండియాకి. ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు సినిమాను పాన్ వరల్డ్ కు తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. జక్కన్న నెక్ట్స్ మూవీ ఎలా ఉండబోతుందో చూసేందుకు హాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ సైతం వెయిట్ చేస్తున్నారు. దీనిని బట్టి రాజమౌళికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. Hollywood stars in Telugu movies.
ఆర్ఆర్ఆర్ లో మూవీలో రాజమౌళి హాలీవుడ్ యాక్టర్స్ తో వర్క్ చేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ తీస్తున్నాడు. ఇందులో విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారని టాక్ వచ్చింది కానీ.. మెయిన్ విలన్ గా హాలీవుడ్ స్టార్ ని రంగంలోకి దింపుతున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనే సినిమాని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం సందీప్ కూడా హాలీవుడ్ స్టార్స్ ని రంగంలోకి దింపుతున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ కొరియన్ స్టార్ డాన్ లీని తీసుకుంటున్నారని.. ఆల్రెడీ డాన్ లీకి కథ చెప్పారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ అట్లీతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ముంబాయిలో స్టార్ట్ అయ్యింది. ఇందులో అల్లు అర్జున్ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడనే న్యూస్ వైరల్ అయ్యింది. అయితే.. ఈ మూవీలో విలన్ పాత్ర కోసం హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ను రంగంలోకి దింపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా తెలుగు సినిమాల్లో హాలీవుడ్ స్టార్స్ ఎంట్రీ ఇవ్వబోతుండడం విశేషం. మరి.. మహేష్, ప్రభాస్, బన్నీ సినిమాల్లో నటించే హాలీవుడ్ స్టార్స్ ఎంత వరకు మెప్పిస్తారో చూడాలి.