ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్..?

Bumper Offers For Bhagyashri borse: ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువుగా ఉంటాయి. సినిమా ఫ్లాప్ అయితే.. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేస్తారు.. అదే వరుసగా సక్సెస్ సాధిస్తే.. ఆ హీరోయిన్ గోల్డన్ లెగ్ అనే ముద్ర వేసేస్తుంటారు. అలాగే హీరోయిన్ తొలి చిత్రం ఫ్లాప్ అయితే.. ఫ్లాప్ హీరోయిన్ అని ఇక ఆమెతో సినిమా చేయడానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపించరు. అదేంటో కానీ.. ఓ హీరోయిన్ ఫస్ట్ మూవీనే ఫ్లాప్ అయినప్పటికీ.. వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఇప్పుడు బంపర్ ఆఫర్ అందుకుందని టాక్. ఇంతకీ.. ఆ హీరోయిన్ ఎవరు..? ఆమె అందుకున్న బంపర్ ఆఫర్ ఏంటి..?

భాగ్యశ్రీ బోర్సే.. మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో రవితేజకు జంటగా నటించింది. హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. అయితే.. ఈ సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. బాక్సాపీస్ దగ్గర బోల్తాపడింది. జనరల్ గా హీరోయిన్ ఫస్ట్ మూవీ ప్లాప్ అయితే.. ఇక ఆ కథానాయికితో సినిమాలు చేయడానికి ఏ హీరో కానీ.. నిర్మాత, దర్శకుడు ముందుకు రారు. అదేంటో కానీ.. భాగ్యశ్రీ బోర్స్ వరుసగా ఆఫర్స్ అందుకుంటుంది. ఇప్పుడు ఇదే ఆడియన్స్ లోనూ, సినీ జనాల్లోనూ ఆసక్తిగా మారింది.

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. ఈ నెల 31న కింగ్ డమ్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజయ్ కు జంటగా భాగ్యశ్రీ నటించింది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే రామ్ నటిస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. Bumper Offers For Bhagyashri borse.

అంతేకాదు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ దక్కించుకుందని టాక్ వినిపిస్తుంది. మేటర్ ఏంటంటే.. నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నానికి జంటగా భాగ్యశ్రీని ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే.. హీరోయిన్ క్యారెక్టరా..? కీలక పాత్ర అనేది తెలియాల్సివుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ మూవీ ప్లాప్ అయినా వరుసగా అవకాశాలు మాత్రం సొంతం చేసుకుంటుంది. అయితే.. ఇండస్ట్రీకి కావాల్సింది సక్సెస్. ఒక్క హిట్ పడితే.. ఇక ఈ అమ్మడుకు తిరుగుండదు.

Also Read: https://www.mega9tv.com/cinema/power-star-planning-a-big-movie-who-will-direct-the-power-star-movie-with-in-2027/