
Rajamouli And Mahesh Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. ఈ క్రేజీ కాంబోలో భారీ పాన్ వరల్డ్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం జక్కన్న తన రూటు మార్చి సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. అయితే.. జక్కన్న ఎంత గొప్పగా సినిమా తీసినా… ఆర్ఆర్ఆర్ సినిమాని ఆస్కార్ నామినేషన్లకు పంపించడానికి ఫారిన్ క్యాటగిరీలోనే అప్లై చేయాల్సి వచ్చింది. అందుకనే ఈసారి రూటు మార్చి సరికొత్త ప్లాన్ రెడీ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. జక్కన్న ఆస్కార్ ప్లాన్ ఏంటి..?
ఆస్కార్ అవార్డ్ కు అప్లై చేయాలంటే ఫారిన్ క్యాటగిరీలోనే అప్లై చేయాల్సి వస్తోంది. దీని వలన అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ కారణం వలనే ఆర్ఆర్ఆర్ మూవీ ఇంకో రెండు మూడు అవార్డులు గెలుచుకోవాల్సి ఉన్నా.. అలా కుదరలేదు. అదే హాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మిస్తే.. వేరేలే ఉండేది. అందుకనే ఇప్పుడు మహేష్ తో చేస్తోన్న మూవీని హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీతో టైఅప్ చేయించి నిర్మిస్తే దానికి ఇంగ్లీషు మూవీ అర్హత వస్తుందని ఆలోచనలో ఉన్నాడని తెలిసింది. కాకపోతే ఇంగ్లీషు వెర్షెన్ ను స్ట్రైయిట్ గా షూట్ చేయాల్సివుంటుంది. ఇందుకోసమే హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ తో చర్చలు జరుపుతున్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.
హాలీవుడ్ కంపెనీతో పార్టనర్ షిప్ విషయమై ఎస్ఎస్ కార్తికేయ చూసుకుంటున్నాడని తెలిసింది. అంతా ఓ కొలిక్కి వచ్చిన తర్వాత అఫిషియల్ గా పూర్తి వివరాలతో ప్రకటిస్తారని సమాచారం. ముందుగా రెండు పార్టులుగా తీయాలి అనుకున్నప్పటికీ ఇప్పుడు ఒక పార్ట్ గానే ఈ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారట. అలాగే తన గత చిత్రాలతో పోలీస్తే.. చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేశారట. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ కంప్లీట చేశారు. ఇందులో మహేష్, ప్రియాంకా చోప్రా, పృధ్వీ రాజ్ సుకుమారన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. Rajamouli And Mahesh Movie.
ఈ సినిమాని 2027లో రిలీజ్ చేయాలి అనేది జక్కన్న ప్లాన్. హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీ, రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ లు వేశారు. అందులో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నారు. ఈ అడ్వెంచరస్ యాక్షన్ మూవీలో పురాణాలకు సంబంధించిన టచ్ కూడా ఉంటుందని.. ఆడియన్స్ కి థ్రిల్ కలించేలా.. ఇప్పటి వరకు ఎప్పుడూ తెర పై చూడని విధంగా ఉంటుందని టాక్. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ బడ్జెట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందట. బడ్జెట్టే 1000 కోట్లు అయితే.. కలెక్షన్ టార్గెట్ 2000 కోట్ల పై మాటే. మరి.. జక్కన్న ఈ సినిమాతో చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.