ఆ నియోజకవర్గానికి సెంటిమెంట్ ఎక్కువ..?!

YSRCP Singanamala Constituency Incharge: అసలే ఆ నియోజకవర్గానికి సెంటిమెంట్ ఎక్కువ. అక్కడ ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీదే రాష్ట్రంలో అధికారం. గత రెండున్నర దశాబ్దాల కాలం నుంచి ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతోంది. అలాంటి సెగ్మెంట్లో బలంగా ఉన్న వైసీపీ ఎందుకు ఇన్చార్జిలను మారుస్తోంది. ఆ సెగ్మెంట్ మీద జగన్ స్కెచ్ ఏంటి. ఇంతకు ఆ నియోజకవర్గం ఎక్కడ ఉంది. మారుతున్న ఇన్చార్జిలు ఎవరు. వాచ్ దిస్ స్టోరీ.

అనంతపురం జిల్లా సింగనమల ఎస్సీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీని రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతుందన్న సెంటిమెంట్ ఉంది. గత రెండున్నర దశాబ్దాల కాలంగా ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతూ వస్తోంది. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గంలో వైసీపీ వరుసగా ఇన్చార్జిలను మారుస్తోంది. దీంతో క్యాడర్ అయోమయ పరిస్థితిలో పడిపోయింది. తాము ఎవరి వెంట నడవాలన్న డైలమాలో ఉంది. నియోజకవర్గానికి అపాయింట్ అయ్యే ఇంచార్జి ఎన్నాళ్లు ఉంటాడన్నదీ ఎవరికీ అర్థంకాని పరిస్తితి ఏర్పడింది. YSRCP Singanamala Constituency Incharge.

ఆలూరు సాంబశివారెడ్డి.. వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్ వెంటే నడిచిన నేత. సింగనమల నియోజకవర్గంలో బలమైన పట్టున్న నేత. ఇక సింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. దీంతో సాంబశివారెడ్డి భార్య ఎస్సీ కావడంతో 2014 ఎన్నికల్లో సాంబశివారెడ్డి భార్య జొన్నలగడ్డ పద్మావతికి వైఎస్ఆర్సిపి టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యామిని బాలపై జొన్నలగడ్డ పద్మావతి ఓటమి చవిచూసింది. తర్వాత 2019 ఎన్నికల్లో మరొకసారి వైఎస్ఆర్సిపి నుంచి జొన్నలగడ్డ పద్మావతి అఖండ మెజార్టీతో గెలుపొందింది.

ఇక్కడ వరకు అంతా బాగానే జరిగింది. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ కేటాయిస్తే ఓటమి తప్పదని భావించిన జగన్, సాంబశివారెడ్డికి అత్యంత సన్నిహితుడైన టిప్పర్ డ్రైవరైన వీరాంజనేయులుకు టికెట్ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో వీరాంజనేయులు ఘోర ఓటమి చవిచూశారు. ఈ ఓటమి వెనక మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డి ఉన్నాడని అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. ఇక నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు తనకు గ్యారెంటీ అని భావించారు జొన్నగడ్డ పద్మావతి. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు జగన్. సింగనమల నియోజకవర్గంలో బలమైన నేత శైలజానాథ్. స్వయంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి శైలజానాథ్ కి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక శైలజనాథ్ కూడా జొన్నలగడ్డ పద్మావతి ఇంటికొచ్చి సహకరించాలని కోరారు.

అయితే పైకి కలిసి ఉన్నామని సంకేతాలు ఇచ్చినప్పటికీ లోలోపల మాత్రం ఎవరికి వారు నియోజకవర్గంలో సొంత రాజకీయాలు చేస్తున్నారట. కొత్తగా నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన తర్వాత శైలజనాథ్ సింగనమల నియోజకవర్గం పార్టీ కార్యాలయాన్ని కూడా ఘనంగా ప్రారంభించారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇదే ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివరెడ్డి, వీరాంజనేయులు దూరంగా ఉండడంతో విభేదాలు తారాస్థాయిలో ఉన్నట్లు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇవేవీ పట్టించుకోకుండా శైలజానాత్ మాత్రం మరో సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయేమో అంత హడావిడిగా నియోజకవర్గంలో కలియతిరుగుతూ క్యాడర్ ఏకతాటిపై తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారట. మరో పక్క జగన్ అత్యంత సన్నిహితుడైన ఆలూరు సాంబశివరెడ్డి అండ్ టీం శైలజనాథ్ కు ఎక్కడా కూడా సహకరించడం లేదన్న ప్రచారం జరుగుతోంది.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/ap-cid-targets-ycp-mp-mithun-reddy-for-liquor-case-policy-as-it-is-in-early-stage/