అభివృద్ధి వైపు దూసుకుపోతున్న మంగళగిరి నియోజకవర్గం..!

Nara Lokesh Mangalagiri constituency MLA: ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందట. ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విభజన తర్వాత కానీ అక్కడ జనం ఈ రేంజిలో అభివృద్ధి చూడలేదట. పేదలకు పక్కా ఇళ్లే కాదు, ప్రతిఒక్క అంశంలో డెవలప్మెంట్ అనేది స్పష్టంగా కనపిస్తోందన్న ప్రచారం అక్కడ జరుగుతోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం… అక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది ఎవరు. వాచ్ దిస్ స్టోరీ.

ఇది గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం. చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటే ఇక్కడ మధ్యతరగతి ప్రజలే ఎక్కువ. పలు పార్టీల నుంచి చాలా మంది నేతలు ఇక్కడ నుంచి ఎంఎల్ఏలు అయ్యారు. కానీ మంగళగిరి జనం ఆశించినంత స్థాయిలో అభివృద్ధి జగరలేదు. 2019 ఎన్నికల్లో గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మొదట్లో కొంచెం హడావుడి చేశారు. సొంత పార్టీ అధికారంలో ఉన్నా, అభివృద్ధి విషయంలో ముందుచూపు లేకుండా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో రాజధాని మార్పు అంశం కూడా అభివృద్ధికి ఆటంకంగా మారింది. అంతేకాదు, అభివృద్ధి కోరుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను జైళ్లకు పంపారు. అడ్డగోలు కేసులు పెట్టి ఎవరి నోట అభివృద్ధి అనే మాట రాకుండా చేశారు.

ఇక గత ఎన్నికల ముందు గెలిచిన నారా లోకేష్, పూర్తిస్తాయిలో మంగళగిరి నియోజకవర్గం మీదే ధ్యాస పెట్టారు. యువగళం యాత్రలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టిన లోకేష్, సమస్యల పరిష్కారం దిశగా ప్రణాళిక చేశారు. అధికారులను పరుగులు పెట్టించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలల్లోనే మంగళగిరి నియోజకవర్గంలో సొంత ఇల్లులేని పేదలకు ఇళ్ల కట్టించారు. ఇది యువగళం యాత్రలో లోకేష్ చెప్పిన ప్రధాన హామీ. మంగళగిరిలో పెద్ద ఎత్తున నాలుగు రోజులపాటు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు లోకేష్. Nara Lokesh Mangalagiri constituency MLA.

దాదాపు ఐదు వేల మంది పేదలకు పక్కా ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు లోకేష్. తాతకుతగ్గ మనవడగా, తండ్రిని మించిన సేవకుడిగా జనంలో నిలిచిపోయారన్న ప్రచారం ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతోంది. ఇప్పటికే తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విద్యాశాఖలో చంద్రబాబు ఆశీర్వాదం, పవన్ కళ్యాణ్ చొరవతో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు నారా లోకేష్. ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి దాకా ప్రతి ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి 13 వేల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన కూడా లోకేష్ బాబుదే అన్న టాక్ కూడా పార్టీలో నడుస్తోంది. మొత్తానికి మంగళగిరి అంటే కేరాఫ్ అభివృద్ధి అన్న చందంగా మార్చేశారట నారా వారి వారసుడు.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/the-ruling-partys-constituency-in-charge-is-almost-equivalent-to-an-mla-but-there-is-no-leader-to-led-ruling-party/