రజినీతో వశిష్ట్ సినిమా ఎందుకు ఆగిందో తెలుసా..?

Mallidi Vassishta Rajinikanth Movie: బింబిసార సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట్. నందమూరి కళ్యాణ్ రామ్ కు బింబిసార బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో మల్లిడి వశిష్ట్ నెక్ట్స్ మూవీ ఎవరితో అనే చర్చ జరిగినప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆతర్వాత ఆ ప్రాజెక్ట్ ఏమైందో ఏమో కానీ.. మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర మూవీ సెట్ అవ్వడం.. పట్టాలెక్కడం తెలిసిందే. అయితే.. ఇప్పుడు రజినీతో మూవీ గురించి వశిష్ట్ అసలు విషయం బయటపెట్టాడు. వశిష్ట్ ఏం చెప్పాడు..? ఇంతకీ.. ఈ సినిమా ఎందుకు ఆగింది..?

బింబిసార బ్లాక్ బస్టర్ అవ్వడంతో వశిష్ట్ తో సినిమా చేయడానికి టాలీవుడ్ హీరోలు మాత్రమే కాదు.. కోలీవుడ్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. అందులో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఉండడం విశేషం. అయితే.. వశిష్ట్ తన రెండో సినిమాని రజినీకాంత్ తో చేయాలి అనుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా వశిష్ట్ తెలియచేశాడు. ఏం చెప్పాడంటే.. బింబిసార తర్వాత దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. రజినీకాంత్ కు తగ్గ కథ ఉందని.. ఆయనకు చెప్పాడట. వశిష్ట్ చెప్పిన కథ రజినీకి కూడా బాగా నచ్చిందట. సినిమా చేద్దామని చెప్పారట.

అయితే.. ఆ కథ బాషా సినిమాకు సీక్వెల్ లా ఉంటుందట.. రజినీకి కూడా కథ నచ్చిందట.. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా చేయడానికి అంతా సెట్ అయ్యిందట. అయితే.. ఎక్కడో తనకే కథ విషయంలో సంతృప్తికరంగా అనిపించలేదని.. ఏదో లోటు ఉందని అనిపించిందని.. అందుకే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదని డైరెక్టర్ వశిష్ఠ ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో తెలియచేశాడు. ఆమధ్య రజినీతో వశిష్ట్ సినిమా అంటే ఇదేదో గాసిప్ అనుకున్నారు కానీ.. వశిష్ట్ అసలు విషయం బయటపెట్టడంతో నిజమే.. సీరియస్ గానే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు జరిగాయని అర్థమైంది.

అలా రజినీతో మూవీ ముందుకు వెళ్లకపోవడంతో.. మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర కథ చెప్పడం.. ఆ కథ నచ్చడంతో ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా వర్క్ చేశారు. అయితే.. టీజర్ కు క్వాలిటీ విషయంలో మిక్సిడ్ రెస్పాన్స్ రావడంతో ఆలస్యం అయినా ఫరవాలేదని క్వాలిటీ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగా వస్తుందని.. విజువల్ వండర్ గా ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. మరి.. ఇప్పుడు రజినీతో మిస్ అయ్యింది.. ఫ్యూచర్ లో సెట్ అవుతుందేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/veeramallu-is-creating-records-before-its-release-power-star-veeramallu-movie-to-release-on-july-24th/