కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు..!

ZPTC Elections in Kadapa district: కడప జిల్లాలో ఖాళీగా ఉన్న జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహించేదుకు అధికారులు రంగం సిద్ధం చేశారట. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల్లో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు కూడా జరుగుతున్నట్లు జడ్పీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటికే, ఉప ఎన్నికల కోసం సంబంధిత మండలాల్లో ఓటర్ల జాబితాలను అధికారులు సిద్ధం చేశారట. పులివెందుల మండలంలో మొత్తం 10 వేల 601 ఓట్లు నమోదు అయినట్లు తేలింది. అలాగే, ఒంటిమిట్ట మండలంలో 24 వేల 606 ఓట్లు ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాల గుర్తింపు కూడా పూర్తయిందట. పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక కడప జడ్పీలో తెలుగుదేశం పార్టీకి బలం లేదు. జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకుంటామనే ఆశ కూడా లేదట. కానీ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారట. ఉప ఎన్నిక జరగబోయే రెండు జడ్పీటీసీ స్థానాల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలంటూ జిల్లా టీడీపీ నేతలు దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. జడ్పీ పీఠాన్ని చేజిక్కించుకొని వైసీపీకి గట్టి షాక్ ఇవ్వాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది.. ఇదే జోష్ కొనసాగించి జడ్పీలో కూడా పాగా వెయ్యాలని ఆ పార్టీ భావిస్తోందట.

ఇక ఒంటిమిట్ట మండలం నుంచి జడ్పీటీసీగా గెలుపొయిందిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జడ్పీ చైర్మన్ గా కొనసాగుతూ వచ్చారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన రాజంపేట నియెజక వర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో చైర్మన్ పదవికి రాజీనామా చేసారు. చైర్మన్ పదవి రాజీనామా చేసినప్పుడు నుండి పులివెందుల జడ్పిటిసి సీటు ఖాళీగా ఉంది. అయితే ఆ సీటును ఎట్టి పరిస్థితుల్లో టిడిపి కైవసం చేసుకోవాలనే విధంగా ఇప్పటికే పూర్తిస్థాయిలో పావులు కలుగుతోందట. ZPTC Elections in Kadapa district.

మరో వైపు పులివెందుల జడ్పీటీసీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఒంటిమిట్టతో పాటు పులివెందుల జడ్పిటిసి స్థానం ఖాళీ పడింది. ఈ రెండు జెడ్పిటిసి స్థానాలపై ఇప్పటికే కూటమినేతలు కన్నేసారట. అసంతృప్తిగా ఉన్న జడ్పీటీసీలతో టీడీపీ నేతలు ఇప్పటికే మంతనాలు సైతం జరిపారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అభివృద్ధి పనుల్లో తమకు అడ్డంకి లేకుండా ఉండాలంటే పీఠాన్ని ఛేజికించుకోవడమే ఏకైక మార్గంగా టీడీపీ నేతలు భావిస్తున్నారట.అందుకోసమే జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పక్కా వ్యూహంతో అడుగులేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక తాము అప్రమత్తం కాకపోతే కడప జడ్పీ స్థానాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుందని వైఎస్ఆర్ సీపీ నేతలు భావిస్తున్నారట. ఇప్పటికే జరిగిన ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి కడప జిల్లాలో భారీ దెబ్బే తగిలింది. దీంతో రాబోయే జెడ్పిటిసి ఉప ఎన్నికలలో తమ ఉనికిని ఎక్కడ కోల్పోతామన్న భయంలో ఉన్న వైసీపీ నేతలు, కూటమి నేతలకు ధీటుగా సమాధానం చెప్పే వ్యక్తులను బరిలోకి దింపే విధంగా జగన్ ఆలోచిస్తున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/we-have-seen-a-war-of-words-but-what-is-the-point-of-destroying-properties-by-destroying-houses/