జిల్లా పర్యటనకు ఎందుకు ఆపుతున్నారు..?

Former Chief Minister YS Jagan: ఆయన ఓ పార్టీ అధ్యక్షుడు. పైగా మాజీ ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తిని జిల్లా పర్యటనకు రానివ్వకుండా పదేపదే అడ్డుకుంటున్నారు. తమ పార్టీ నేతను పరామర్శించడానికి వెళ్లటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే దాదాపు మూడుసార్లు షెడ్యూల్ ప్రకటించి మరల క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంతకీ ఆ మాజీ ముఖ్యమంత్రిని జిల్లా పర్యటనకు ఎందుకు రానివ్వటం లేదు.

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఒకటికి మూడుసార్లు వాయిదా పడటంతో ఆ పార్టీ కార్యకర్తలు రగిలిపోతున్నారట. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పలు రకాల కేసులు పై దాదాపు 60 రోజుల నుండి రిమాండ్లో ఉన్నారు. ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి మూడుసార్లు జిల్లా నాయకులకు షెడ్యూల్ ఇచ్చారు. దీంతో ఏర్పాట్లు చేయడం, సడెన్ గా ప్రోగ్రాం క్యాన్సిల్ అనే మెసేజ్ రావటం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట కార్యకర్తలు. తమ నాయకుడిని జిల్లా పర్యటనకు రానివ్వకుండా ఎందుకు కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందో అర్థమకాటం లేదని ఆ పార్టీ నాయకులు మీడియా ముందు వాపోతున్నారట.

జగన్ హెలికాప్టర్ నెల్లూరులో ల్యాండ్ అవ్వటానికి సరైన ప్రదేశం చూపించకుండా జిల్లా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకటికి ఐదు చోట్ల హెలికాఫ్టర్ దిగడానికి స్థలం చూపిస్తే అధికారులు మాత్రం అక్కడ అనుమతి ఇవ్వడం లేదట. దట్టమైన చెట్లు, మనుషులు తిరగని చోట అనుమతులు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అక్కడ జరగరానిదే జరిగితే ఆ నింద జగన్ మీద వేసేలా అధికారుల తీరు ఉందని ఆరోపిస్తున్నారట వైసీపీ నేతలు. Former Chief Minister YS Jagan.

దీనికి తోడు ఇటీవల కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని టిడిపి నాయకులు ధ్వంసం చేశారు. ధ్వంసమైన ఇంటిని తమ నాయకుడు చూపించాలన్న ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని ఇప్పటి దాకా అలాగే ఉంచారట. తాము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రోజు ఏ జిల్లాకు వెళ్లినా అడ్డుకోలేదనీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై కక్ష సాధింపులు చర్యలకు దిగుతుందని బాధపడుతున్నారు వైసీపీ నేతలు. రాష్ట్ర చరిత్రలో ఒక ప్రతిపక్ష నాయకుడి పర్యటనను పదేపదే అడ్డుకోవడం ఎక్కడ జరగలేదని చరిత్రలో జరగలేదని చెబుతున్నారు వైసీపీ నేతలు.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/officials-have-reportedly-prepared-the-ground-for-holding-by-elections-for-the-vacant-zptc-seats-in-kadapa-district/