
Charan and NTR’s Movie Updates: మెగా హీరో రామ్ చరణ్, నందమూరి హీరో ఎన్టీఆర్.. వీరిద్దరూ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించడం.. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం తెలిసిందే. ఆతర్వాత ఇద్దరు వేరే సినిమాల్లో బిజీ అయ్యారు. ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ చేస్తుంటే.. చరణ్ పెద్ది సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. చరణ్, ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి యంగ్ ప్రొడ్యూసర్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఇంతకీ.. అప్ డేట్ ఇచ్చిన యంగ్ ప్రొడ్యూసర్ ఎవరు..? వీరిద్దరి సినిమాల గురించి అదిరిపోయే అప్ డేట్ ఏంటి..?
రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల గురించి అప్ డేటి్ ఇచ్చని ప్రొడ్యూసర్ నాగవంశీ. తాజాగా నాగవంశీ విజయ్ దేవరకొండతో కింగ్ డమ్ అనే సినిమాను నిర్మించాడు. గౌతమ్ తిన్ననూరి ఈ మూవీకి డైరెక్టర్. సమ్మర్ లో రావాల్సిన ఈ సినిమాను ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో నాగవంశీ చరణ్ తో సినిమా గురించి అప్ డేట్ ఇచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. చరణ్ కోసం ఓ కథ రాసారట. ఆ కథను చరణ్ కు చెప్పారని.. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని.. ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అయ్యేలా ఉందని తెలియచేశారు. Charan and NTR’s Movie Updates.
ఇక ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్ తో చేసే సినిమాకి సంబంధించిన వర్క్ చేస్తూనే.. మరో వైపు ఎన్టీఆర్ తో చేసే సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారని చెప్పారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ మూవీని రూపొందించేందుకు ప్లానింగ్ జరుగుతుందన్నారు. ఈ క్రేజీ మూవీ ఎలా ఉండబోతుందో తెలియచేసేందుకు ఓ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. దీనికి సంబంధించిన వర్క్ జరుగుతుందని.. అంతా పూర్తైన తర్వాత మంచి ముహుర్తం చూసి ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తామన్నారు నాగవంశీ.
ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చిన క్రేజ్ కు తగ్గట్టుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ వార్ 2 మూవీతో ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న డ్రాగన్ సినిమాని నెక్ట్స్ ఇయర్ జూన్ 25న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత త్రివిక్రమ్ తో మూవీ, దేవర 2 ఈ రెండు సినిమాలను ఒకేసారి చేస్తారా..? లేకపోతే ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తారా అనేది తెలియాల్సివుంది. ఇక చరణ్ పెద్ది తర్వాత సుకుమార్ తో సినిమా చేయాలి కానీ.. అంతకంటే ముందు బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇక త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడు అనేది క్లారిటీ రావాల్సివుంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ హీరోలు.. పక్కా ప్లానింగ్ తో దూసుకెళుతున్నారు. మరి.. ఈ సినిమాలతో ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.