
F-35 finally flies from Kerala: ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన, శక్తివంతమైన F-35 స్టెల్త్ యుద్ధ విమానం ఎట్టకేలకు కేరళ నుంచి స్వదేశానికి తిరిగి వెళ్లింది. సుమారు 40 రోజుల తర్వాత ఇది గాల్లోకి ఎగిరింది. బ్రిటిష్ నేవీకి చెందిన ఈ F-35 యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో దాదాపు నెల రోజులపాటు నిలిచిపోవడం హాట్ టాపిగా మారింది. దీని సాంకేతిక సమస్యలను పరిష్కరించి.. మళ్లీ ఎగిరేలా చేసే వరకు బ్రిటన్ తలప్రాణం తొకకు వచ్చింది. అసలు ఈ F-35 గురించి బ్రిటన్ ఎందుకు అంతలా భయపడింది? ఈ F-35 ఎందుకంత ప్రత్యేకమైనది? భారత్ ఇలాంటి విమానాలను తయారు చెయ్యగలదా?
F-35B.. ప్రపంచంలోనే శక్తివంతమైన ఫైటర్ జెట్లలో ఒకటి. కాని సాంకేతిక సమస్యతో భారత్ లో ల్యాండ్ అయ్యింది. జూన్ 14న బ్రిటిష్ నేవీకి చెందిన ఈ F-35B స్టెల్త్ యుద్ధ విమానం ఆస్ట్రేలియాకు బయలుదేరినప్పుడు, హైడ్రాలిక్ సమస్య, ప్రతికూల వాతావరణం, ఇంధన కొరత వల్ల కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. సుమారు 40 రోజులపాటు విమానం రన్‌వేలోనే నిలిచిపోయింది. బ్రిటిష్ నేవీ, రాయల్ ఎయిర్ ఫోర్స్, లాక్‌హీడ్ మార్టిన్ ఇంజనీర్లతో కూడిన 24 మంది బృందం కేరళకు చేరుకుని, ప్రత్యేకమైన టూల్స్, విడిభాగాలతో మరమ్మతులు చేపట్టారు. చివరికి తనిఖీలు పూర్తయ్యాక, విమానం క్షేమంగా ఆస్ట్రేలియాకు బయలుదేరింది. అయితే ఇది భారత్ లో ఉన్న 40 రోజులు బ్రిటన్ కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. దీనికి ఒక కారణం ఉంది.
F-35 ప్రపంచంలోనే అత్యంత ఆధునిక, సీక్రెట్ స్టెల్త్ యుద్ధ విమానం. ఈ విమానం సాంకేతిక సమస్యతో కేరళలో నిలిచిపోవడంతో బ్రిటన్‌కు F-35 సాంకేతిక రహస్యాలు బయటపడతాయనే భయం కలిగింది. F-35లో అత్యాధునిక సెన్సర్ ఫ్యూజన్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్, రాడార్‌ను గుర్తించలేని స్టెల్త్ టెక్నాలజీ ఉన్నాయి. ఈ సాంకేతికత ఇతర దేశాలకు చేరితే, బ్రిటన్, అమెరికా రక్షణ వ్యూహాలు బలహీనపడతాయనే ఆందోళన ఉంది. కొద్ది రోజులైతే రన్ వే నుంచి హ్యాంగర్ కు తరలించడానికి కూడా బ్రిటన్ ఒప్పుకోలేదు. అయితే వర్షానికి తడిచి కొత్త సమస్యలు వచ్చేలా ఉండటంతో ఈ హ్యాంగర్ కు తరలించడానికి అంగీకరించింది. అప్పుడు కూడా బ్రిటన్ సైనికులతో సెక్యూరిటీ ఏర్పాటు చేయించారు. ఈ విమానానికి బ్రిటిష్ బృందమే మరమ్మతులు చేసింది. భారత టెక్నీషియన్లు, ఇంజనీర్లు విమానం లోపలి సాంకేతికతను చూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. F-35 finally flies from Kerala.
F-35, అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసిన మల్టీ యాక్టివిటీ యుద్ధ విమానం, ప్రపంచంలో అత్యంత అధునాతనమైన యుద్ధ సాంకేతికతగా దీని సొంతం. దీని రాడార్‌లకు కనిపించని స్టెల్త్ సాంకేతికత వల్ల ఈ విమానాన్ని శత్రువు గుర్తించడం దాదాపు అసాధ్యం. ఇందులోని వివిధ సెన్సర్ల నుంచి సమాచారాన్ని ఏకీకృతం చేసి, పైలట్‌కు రియల్-టైమ్ యుద్ధ సమాచారం అందిస్తుంది. శత్రు రాడార్‌లను జామ్ చేయడం, సైబర్ దాడులను నిర్వహించడం వంటి సామర్థ్యం దీని సొంతం. ఎయిర్ వార్ ఫేర్, గ్రౌండ్ అటాక్స్, నీటిపై ఆపరేషన్లు నిర్వహించగలదు. ఇతర విమానాలు, డ్రోన్‌లు, నౌకలతో నిరంతరం సమాచార బదిలీ చేసుకోగలదు. ఒక్కో విమానం ధర సుమారు 900 వందల కోట్ల రూపాయలు ఉంటుంది.
అయితే ఈ F-35 సాంకేతికత భారత్‌కు అందితే, భారత వైమానిక దళం సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. చైనా J-20, పాకిస్థాన్ J-31 వంటి దేశాల స్టెల్త్ విమానాలకు సమానమైన సామర్థ్యం భారత్‌కు లభిస్తుంది. శత్రు రాడార్‌లను ఎదుర్కొనే సామర్థ్యం, సైబర్ దాడుల సామర్థ్యం బలపడుతుంది. భారత్ రక్షణ వ్యూహంలో ఆధిపత్యం పెరిగి, ప్రాంతీయ శక్తిగా మరింత బలపడుతుంది. F-35 లాంటి సాంకేతికత భారత్‌లోని అమ్కా ప్రాజెక్ట్‌లో భాగంగా తయారు చేసే విమానంలో ఉంటుందని అంటున్నారు. అయితే, అమెరికా F-35 సాంకేతికతను NATO మిత్ర దేశాలు, ఇజ్రాయెల్, జపాన్ వంటి దేశాలకు మాత్రమే అందిస్తోంది.
ప్రస్తుతం భారత్ స్వదేశీ స్టెల్త్ యుద్ధ విమాన తయారీలో ముందడుగు వేస్తోంది. అమ్కా ప్రాజెక్ట్ ద్వారా భారత్ తన సొంత 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని తయారు చేస్తోంది. స్టెల్త్ సామర్థ్యం, సెన్సర్ ఫ్యూజన్, సూపర్‌క్రూయిజ్ ఇంజన్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యం వీటి ప్రత్యేక. DRDO, హాల్ సంయుక్తంగా 2035 నాటికి అమ్కా మొదటి ప్రోటోటైప్‌ను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే దీనికి సాంకేతిక జ్ఞానం, భారీ ఖర్చు, అంతర్జాతీయ సహకారం అవసరం ఉంది. అలాగే దీని ఇంజన్ డెవలప్‌మెంట్‌లో కూడా ఆలస్యం అవుతోంది. భారత్ ఇప్పటికే తేజస్ వంటి 4వ తరం విమానాలను తయారు చేస్తోంది, కానీ F-35 స్థాయి 5వ తరం సాంకేతికతకు ఇంకా 10-15 సంవత్సరాలు పట్టవచ్చు.
F-35 ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నార్వే వంటి NATO మిత్ర దేశాల వద్ద మాత్రమే ఉంది. అమెరికా ఈ సాంకేతికతను పూర్తిగా బదిలీ చేయదు, కానీ కొన్ని దేశాలకు కొద్ది వరకు పరిమితులతో యాక్సెస్ ఇస్తుంది. ఈ దేశాలు కూడా F-35 మెయింటెనెన్స్, ఆపరేషన్ కోసం అమెరికా సప్లయర్లపై ఆధారపడతాయి. భారత్‌లో ఈ విమానం నిలిచిపోవడం, అంతర్జాతీయ స్థాయిలో స్టెల్త్ సాంకేతికత గోప్యతపై చర్చను రేకెత్తించింది.