మరోసారి తన దౌత్యంతో సత్తా చాటిన మోదీ..!

Modi once again demonstrates his diplomatic power: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్‌లో రెండు రోజుల పర్యటన సందర్భంగా భారత్-యూకే మధ్య చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేసి 120 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా చేసుకుంది. భారతదేశం ఇటీవలి కాలంలో ఓ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంతతో చేసుకున్న అత్యంత పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం ఇదే. దీనిని బట్టి దీని వల్ల భారత్ కు ఎంత లాభమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ పక్క ట్రంప్ సుంకాలతో భయపెడుతుంటే.. భారత్ బ్రిటన్ తో 99 శాతం వస్తువుల ఎగుమతులపై ఎటువంటి సుంకాలు లేకుండా ఒప్పందం చేసుకోవడం భారత విదేశీ విధానం గొప్పతనాన్ని మరోసారి రుజువు చేస్తోంది. అసలు ఈ ఫ్రీ ట్రేడ్ ఒప్పందంలో ఏమున్నాయి..? దీని వల్ల భారత్ లో ఏ వర్గాలకు ఉపయోగం..? ఈ ఒప్పందం వల్ల రెండు దేశాలకు కలిగే లాభం ఏంటి..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్‌లో రెండు రోజుల పర్యటన .. భారత వాణిజ్య రంగాన్ని ఓ మలుపు తిప్పనుంది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క. అమెరికా లాంటి దేశాల బెదిరింపులు ఇక పనిచేయవు. అలాంటి బలమైన ఒప్పందం భారత్ బ్రిటన్ తో చేసుకుంది. బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో లండన్‌లో జరిగిన సమావేశంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌పై ఇరుదేశాధినేతలు సంతకాలు చేశారు. ప్రధాని మోదీ పర్యటన రెండు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, సాంకేతికత వంటి కీలక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసింది. ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత.. ఇది భారత్, బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రక రోజు అని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా 99 శాతం భారత ఎగుమతుకు ఎటువంటి సుంకం ఉండదు. దీని వల్ల ఎగుమతులు పెరిగి. భారతలో తయారీ రంగం, వ్యవసాయ ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తోంది. దీని వల్ల ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 3వ స్థానానికి చేరుకోవడానికి భారత్ కు మార్గం సుగమం అవుతుంది. Modi once again demonstrates his diplomatic power.

భారత్-యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ 2022లో ప్రారంభమైన మూడు సంవత్సరాల సుదీర్ఘ చర్చల తర్వాత ఖరారైంది. ఈ ఒప్పందంంలో వస్తువులు, సేవలు, ప్రభుత్వ కొనుగోళ్ల వంటివి ఉంటాయి. టెక్స్‌టైల్స్, ఆభరణాలు, సీఫుడ్, ఇంజనీరింగ్ వస్తువులు ఉన్నాయి. యూకే నుంచి వచ్చే 90% వస్తువులపై సుంకాలు తగ్గించారు. ఇందులో స్కాచ్ విస్కీ, కార్లు, మెడికల్ డివైసెస్ ఉన్నాయి. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని సంవత్సరానికి 34 బిలియన్ డాలర్లు పెంచుతుందని అంచనా.

ఈ ఒప్పందం భారత ఎగుమతులకు యూకే మార్కెట్‌లో అపూర్వమైన అవకాశాలను అందిస్తుంది. టెక్స్‌టైల్స్, లెదర్, ఆభరణాలు, సీఫుడ్ వంటి శ్రమాధార రంగాలు గణనీయంగా లాభపడతాయి. భారత రైతులకు బాస్మతి బియ్యం, మామిడి పల్ప్, టీ, స్పైసెస్ వంటి ఉత్పత్తులను సుంకం లేకుండా ఎగుమతి చేయవచ్చు. దీని వల్ల భారత దేశంలోని రైతులు చాలా సులువగా తమ ఉత్పత్తులను బ్రిటన్ కు ఎగుమతి చేయవచ్చు. ఇది వారికి ఆర్థికంగా ఎంతో లాభం. 2030 నాటికి భారత వ్యవసాయ ఎగుమతులు 100 బిలియన్ డాలర్లకు చేరాలనే లక్ష్యానికి ఈ ఒప్పందం ఊతమిస్తుంది. అయితే, డైరీ, ఆపిల్స్, ఎడిబుల్ ఆయిల్స్ వంటి వాటికి సుంకాలపై రాయితీలు ఇవ్వలేదు.

అలాగే భారతదేశ సేవల రంగానికి ఈ ఒప్పందం గణనీయమైన అవకాశాలను కల్పిస్తుంది. భారతీయ ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాలు యూకేలో వృద్ధి, ఉద్యోగ అవకాశాలను సాధిస్తాయి. భారతీయ చెఫ్‌లు, యోగా ఇన్‌స్ట్రక్టర్లు, సంగీత కళాకారులు వంటి వారు యూకే సులభంగా వెళ్లొచ్చు. మూడేళ్లపాటు యూకేలో తాత్కాలికంగా పనిచేసే భారతీయ కార్మికులకు సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది, దీని వల్ల సంవత్సరానికి దాదాపు 4,000 కోట్ల రూపాయల ఆదా అవుతుంది.

ఈ ఒప్పందం వల్ల యూకేకి లభించే ప్రయోజనాలు ఏంటి?
యూకేకి ఈ ఒప్పందం ద్వారా భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో ప్రవేశించడానికి అవకాశం కల్పిస్తుంది.. స్కాచ్ విస్కీపై భారతదేశంలో విధించే 150% సుంకం తక్షణం 75%కి, ఆ తర్వాత 10 సంవత్సరాలలో 40%కి తగ్గుతుంది. అంటే రాబోయే రోజుల్లో భారత్ లో స్కాచ్ విస్కీ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. కార్లు, మెడికల్ డివైసెస్, లగ్జరీ గూడ్స్ వంటి యూకే ఉత్పత్తులపై సుంకాలు తగ్గడంతో భారతీయ వినియోగదారులకు ధరలు తక్కువగా ఉంటాయి. యూకే సంస్థలు భారతదేశంలో 200 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రభుత్వ టెండర్లలో బిడ్ చేయవచ్చు. ఈ ఒప్పందం యూకే జీడీపీకి సంవత్సరానికి 4.8 బిలియన్ పౌండ్లు జోడిస్తుందని అంచనా.

భారత వ్యవసాయ రంగం ఈ ఒప్పందంతో పెద్ద ఎత్తున లాభపడుతుంది. పసుపు, మిరియాలు, ఏలకులు, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి ఉత్పత్తులకు సుంకం ఉండదు. ష్రిమ్ప్, ట్యూనా, ఫిష్‌మీల్ వంటి సీఫుడ్ ఉత్పత్తులపై యూకేలో సుంకాలు పూర్తిగా తొలగించనున్నారు. 95% వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ టారిఫ్ లైన్లపై ఇక సుంకాలు ఉండవు. ఇది మూడు సంవత్సరాలలో ఎగుమతులను 20% పెంచుతుంది. ఈ ఒప్పందం భారతదేశాన్ని పెట్టుబడి పెట్టేందుకు ఆకర్షనీయమైన గమ్యస్థానంగా మారుస్తుంది. భారతదేశం ప్రస్తుతం ఉన్న అన్ని వాణిజ్య అడ్డంకులను దాటుకుని, ఆస్ట్రేలియా, యూఏఈ వంటి దేశాలతో చేసుకున్న ఒప్పందాల తర్వాత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంతో చేసుకున్న తొలి సమగ్ర ఒప్పందం కావడం విశేషం. యూకేకి ఈ ఒప్పందం బ్రెగ్జిట్ తర్వాత ఇండో-పసిఫిక్ టిల్ట్ వ్యూహంలో భాగంగా భారతదేశంతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తుంది.

Also Read: https://www.mega9tv.com/international/thailand-and-combodia-war-dispute-between-the-two-countries-over-temples-tensions-on-the-borders-war-atmosphere-with-land-mines-and-air-strikes/