
India manufacturing 6th generation fighter jets: రెక్కలు, పైలెట్ లేకుండా ఎగిరే యుద్ధ విమానం. శత్రువకు చిక్కకుండా దూసుకుపోవడం. డ్రోన్లను తన కృత్రిమ మేధస్సుతో సమన్యం చేసుకుని .. దానికదే శత్రువుపై దాడి చేయడం. ఇదేదో హాలీవుడ్ సినిమాలో భవిష్యత్తు తరం ఫైటర్ జెట్ గురించి చెబుతున్న స్టోరీ కాదు. భారత్ త్వరలో తయారు చేయబోతున్న 6వ తరం ఫైటర్ జెట్ గురించిన వివరాలు. అదేంటి భారత్ అసలు 5వ తరం ఫైటర్ జెట్ నే ఇప్పటి వరకు తయారు చేయలేదు.. అలాంటిది 6వ తరం ఫైటర్ జెట్ గురించి ఆలోచించడం కాస్త అతిశయోక్తిగా లేదు. కాని DRDOలోని శాస్త్రవేత్తలు ఇలా ఆలోచించడం తప్పు కాదని అంటున్నారు. ఇవాళ్టి విత్తనమే రేపు మహా వృక్షమవుతుంది. అలాగే ఇవాళ్టి ఆలోచనే రేపు కార్యరూపం దాల్చుతుంది. అదే విధంగా ప్రపంచంలోని ఇతర దేశాలు ఇప్పటి వరకు తయారు చేయని ఫైటర్ జెట్లను భారత్ తయారుచేయడానికి సిద్ధమవుతోంది. దీని కోసం ఇప్పటి నుంచి ప్లానింగ్ మొదలు పెట్టింది. అసలు ఈ అరవతరం ఫైటర్ జెట్ల ఎలా ఉంటాయి. ? భారత్ తయారు చేయబోతున్న ఈ కొత్త ఫైటర్ జెట్ రఫెల్, F35 కంటే ఎన్ని రెట్లు అడ్వాన్స్ డ్..? ఆరవతరం ఫైటర్ జెట్లు ఓకే.. మరి 5వ తరం ఫైటర్ల జెట్ల పని ఎంత వరకు వచ్చింది..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
భారత్ ఇప్పటివరకూ ఐదో తరం యుద్ధ విమానాలను కూడా తయారు చేయలేదు, కానీ ఇప్పుడు నేరుగా ఆరో తరం విమానాలపై దృష్టి పెట్టింది. వినడానికి కాస్త ఓవర్ గా ఉన్న ఇది నిజం. భారత్ తయార చేయనున్న ఈ 6వ తరం యుద్ధ విమానాలు ప్రస్తుతం ఉన్న రాఫెల్, ఎఫ్-35 కంటే చాలా అధునాతనమైనవి. భారత రక్షణ పరిశోధన సంస్థ-DRDO, అలాగే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ADA కలిసి ఈ ఆరో తరం ఫైటర్ జెట్‌ను రూపొందించనున్నాయి. దీని రూపానికి సంబంధించి విషయాలు కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విమానం ఫ్లైయింగ్ వింగ్ డిజైన్‌లో ఉంటుంది, అంటే సాంప్రదాయ రెక్కలు, తోక లేకుండా వజ్రం లాంటి ఆకారంలో ఈ యుద్ధ విమానం ఉంటుంది. దీనివల్ల దీనిని పట్టుకోవాలంటే శత్రురాడర్లు జేజమ్మలు దిగిరావాలి. పైలట్ లేకుండా, పూర్తిగా కృత్రిమ మేధస్సు ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ విమానం స్వయంగా శత్రువు లక్ష్యాలను గుర్తించి, దాడులు చేసి, యుద్ధ వ్యూహాలను రూపొందించగలదు. అయితే ఇది ప్రస్తుతం ఆలోచనల స్థాయిలోనే ఉంది. కార్యాచరణ జరిగి.. చేతికి వచ్చే సరికి సంవత్సరాల సమయం పట్టొచ్చు. అంతరిక్ష రంగంలో భారత్ ప్రస్తుతం దూసుకుపోతోంది. అయితే ఓ 30 ఏళ్లు వెనక్కి చూసుకుంటే అప్పటికీ ఇప్పటికీ ఎంతో ప్రగతి సాధించాం. అప్పుడ వేసిన విత్తనాలే.. ఇప్పుడు ఇస్రో రూపంలో మహా వృక్షమే ఫలితాలు ఇస్తోంది. ఇది భారత్ స్వయం ప్రగతి. అలానే 6వ తరం ఫైటర్ జెట్ల విషయంలోనే ఇప్పటి ఆలోచన భవిష్యత్తులో సాకారం అవుతుందని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. India manufacturing 6th generation fighter jets.
ప్రస్తుతం ఈ ఆరో తరం యుద్ధ విమానం భారత్‌లో ఘాతక్ ప్రోగ్రాం కింద అభివృద్ధి చేస్తున్నారు. ఘాతక్ అంటే ఒక పైలట్ లేని కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఇది కృత్రిమ మేధస్సు నడిపిస్తుంది. ఈ విమానం ఒకే సమయంలో డ్రోన్ల బృందాన్ని నియంత్రించగలదు. అంటే ఒక విమానం పది డ్రోన్లను నడిపించి, యుద్ధ రంగంలో ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ పై దాడి చేయగలదు. ఇది లేజర్, మైక్రోవేవ్ ఆయుధాలను కూడా ఉపయోగించగలదు. ఇవి సాంప్రదాయ మిసైళ్ల కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో శత్రువువులను నాశనం చేయగలవు.
ఈ ఆరో తరం యుద్ధ విమానం పూర్తిగా కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో ఉపయోగించే ఫ్లైయింగ్ వింగ్ డిజైన్ వల్ల రాడార్‌లో కనిపించే అవకాశం చాలా తక్కువ. ఈ విమానం యుద్ధంలో సమాచారాన్ని అప్పటికప్పుడు విశ్లేషించి, తక్షణ నిర్ణయాలు తీసుకోగలదు. ఉదాహరణకు శత్రువు మిసైల్ దాడి చేస్తే, ఈ విమానం ఆటోమేటిక్‌గా దాన్ని గుర్తించి, ప్రతిదాడి చేయగలదు. ఇది హైపర్సోనిక్ మిసైళ్లను, లేజర్ ఆయుధాలను ఉపయోగించగలదు. ఇది స్వయంగా నిర్ణయాలు తీసుకోగలదు, అంటే భూమి నుంచి ఎవరూ నియంత్రించకపోయినా, యుద్ధంలో ఏం చేయాలో ఈ విమానమే నిర్ణయించుకుంటుంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న రాబోయే రోజుల్లో ఏఐ అభివృద్ధితో ఇది సాధ్యపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆరవ తరం ఫైటర్ జెట్ కల బాగానే ఉంది .. మరి ఐదవ తరం ఫైటర్ జెట్ల పనులు ఎక్కడి వరకు వచ్చాయి..?
భారత్ ఐదవ తరం ఫైటర్ జెట్ తయారీ – అమ్కా పరిస్థితి ఏంటి..?
అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్- అమ్కా.. అనేది భారత్‌లో ఐదో తరం యుద్ధ విమానంగా అభివృద్ధి చేయబడుతోంది. కానీ ఇది ఆరో తరం ఫైటర్ జెట్‌కు మార్గం సుగమం చేస్తోంది. అమ్కా ప్రాజెక్ట్ రెండు దశల్లో ఉంది. మార్క్-1, మార్క్-2. మార్క్-1 ఐదో తరం విమానంగా 2030 నాటికి సిద్ధం కావచ్చు, ఇది రాఫెల్‌తో సమానమైన సామర్థ్యం కలిగి ఉంటుంది. మార్క్-2లో ఆరో తరం టెక్నాలజీలైన AI, లేజర్ ఆయుధాలు, హైపర్సోనిక్ మిసైళ్లు జోడించబడతాయి. ప్రస్తుతం అమ్కా మార్క్-1 డిజైన్ పూర్తయింది. ప్రోటోటైప్ విమానం తయారీ ప్రక్రియలో ఉంది. ఘాతక్ ప్రోగ్రాం కింద ఆరో తరం విమానం డిజైన్ దశలో ఉంది. 2040 నాటికి ఇది యుద్ధ రంగంలో సిద్ధంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే మరో 15 ఏళ్లకు భారత్ దగ్గర మేడిన్ ఇండియ అరవ తరం ఫైటర్ జెట్లు అందుబాటులో ఉంటాయన్న మాట.
ఈ ఆరో తరం యుద్ధ విమానం రాఫెల్, ఎఫ్-35 కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది 3,000 కిమీ దూరం వరకు ఎగరగలదు. 13 టన్నుల ఆయుధాలను మోసుకెళ్లగలదు. దీనిలో స్టెల్త్ టెక్నాలజీ ఉంటుంది, అంటే రాడార్‌లో కనిపించడం దాదాపు అసాధ్యం. ఇది చైనా జె-20 వంటి విమానాలతో పోటీపడి, అమెరికా, బ్రిటన్, యూరోప్‌లోని ఆరో తరం విమానాలతో సమానంగా నిలుస్తుంది. అయితే
ఈ ఆరో తరం యుద్ధ విమానం అభివృద్ధిలో జెట్ ఇంజిన్ తయారీ ప్రధాన సవాలుగా మారింది. భారత్ ఇంకా స్వంతంగా అధునాతన జెట్ ఇంజిన్‌ను అభివృద్ధి చేయలేదు, దీనివల్ల విదేశీ సహకారంపై ఆధారపడుతోంది. అమెరికాకు చెందిన GE, ఫ్రాన్స్ కు చెందిన సఫ్రాన్, బ్రిటన్ కు చెందిన రోల్స్-రాయిస్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ సహకారంతో 2040 నాటికి అధునాతన ఇంజిన్లు, స్టెల్త్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ టెక్నాలజీ అభివృద్ధికి భారీ ఖర్చుతో పాటు ఎక్కువ సమయం పడుతుంది. అయినప్పటికీ, DRDO, ADA ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేస్తున్నాయి, దీనివల్ల భారత్ చైనా, పాకిస్థాన్లతో పోలిస్తే రక్షణ రంగంలో గణనీయమైన ఆధిక్యత సాధిస్తుంది.
భారత్‌కు ఈ విమానం ఎందుకు ముఖ్యం?
ఈ ఆరో తరం యుద్ధ విమానం భారత వాయుసేనను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బలగాల్లో ఒకటిగా మారుస్తుంది. ప్రస్తుతం భారత్ రాఫెల్, సుఖోయ్ వంటి విమానాలను ఉపయోగిస్తోంది, కానీ ఈ కొత్త యుద్ధ విమానం చైనా జె-20, అమెరికా ఎన్జీఏడీ వంటి విమానాలతో సమానంగా పోటీపడుతుంది. ఇది 3,000 కిమీ దూరం వరకు ఎగరగలిగే సామర్థ్యం, 13 టన్నుల ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యంతో శత్రు సరిహద్దులను సులభంగా దాటగలదు. ఇది స్వదేశీ టెక్నాలజీతో తయారవుతుండటం వల్ల భారత్‌కు ఖర్చు తగ్గుతుంది, విదేశీ దిగుమతులపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. ఈ విమానం భారత్‌ను రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా నడిపిస్తుంది.
ఈ ఆరో తరం యుద్ధ విమానం భారత్‌ను రక్షణ రంగంలో ప్రపంచ శక్తిగా నిలబెడుతుంది. ఇప్పటికే ఐటీ, కృత్రిమ మేధస్సు రంగాల్లో భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది, ఇప్పుడు ఈ విమానంతో రక్షణ రంగంలో కూడా ముందంజలో ఉంటుంది. 2040 నాటికి ఈ విమానం పూర్తిగా సిద్ధమై, భారత వాయుసేనలో చేరుతుందని అంచనా. ఇది చైనా, పాకిస్థాన్లతో జరిగే ఏ యుద్ధ పరిస్థితుల్లోనైనా భారత్‌కు ఆధిక్యతను ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, భారత్ తన స్వదేశీ టెక్నాలజీని ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంది. ఈ విమానం భారత్‌ను గ్లోబల్ డిఫెన్స్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలబెడుతుందని నిపుణులు చెబుతున్నారు.