
Mahesh Rajamouli’s movie: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి… వీరిద్దరి కాంబోలో మూవీ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి కానీ.. మేకర్స్ నుంచి మాత్రం అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. ఎప్పుడూ తన సినిమాని పూర్తి వివరాలు ప్రకటించిన తర్వాత షూట్ స్టార్ట్ చేసే జక్కన్న ఈసారి మాత్రం రూటు మార్చి సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు. అయితే.. ఈ మూవీలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టి మరింతగా అంచనాలు పెంచేశాడు. ఇంతకీ.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఏం చెప్పాడు..? ఈ మూవీ అఫిషియల్ అప్ డేట్ ఎప్పుడు..?
మహేష్, జక్కన్న కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటే.. ఇప్పటికి సెట్ అయ్యింది. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది కానీ.. ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అయితే.. ఈ మూవీ షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చారు. మహేష్ ఈ బ్రేక్ లో శ్రీలంక వెళ్లగా.. ప్రియాంకా చోప్రా ఫ్యామిలీతో కలిసి బహ్మస్ తీరంలో రిలాక్స్ అవుతున్నారు. ఇక ఇందులో విలన్ గా నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న సర్జమీన్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. అయితే.. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్ మహేష్ తో చేస్తున్న మూవీ గురించి మాట్లాడి అంచనాలు పెంచేశాడు.
ఇంతకీ ఏం చెప్పాడంటే.. మహేష్ బాబుతో చేస్తున్న మూవీని ఇప్పటి వరకు ఎవరూ తెరకెక్కించని స్థాయిలో ఒక మాస్టర్ పీస్ లా రాజమౌళి తీస్తున్నారని చెప్పారు. అంతే కాకుండా.. ఇలాంటివి తీయడంలో ఆయన సిద్ధహస్తుడని.. ఈ సినిమా వేరే లెవల్లో ఉంటుందని చెప్పి మరింతగా అంచనాలు పెంచేశాడు. అయితే.. ఇది చెబుతున్నప్పుడు ఆయన ఎగ్జైట్ మెంట్ చూస్తే ఈ సినిమా కోసం ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ ఎక్స్ పీరియన్స్ మరచిపోలేని అనుభూతి కలిగించింది అనిపిస్తోంది. సలార్ లో విలన్ క్యారెక్టర్ చేశాడు.. మహేష్ మూవీలో కూడా విలన్ క్యారెక్టరే చేస్తున్నాడు. Mahesh Rajamouli’s movie.
దీనిని బట్టి పృథ్వీరాజ్ కథ నచ్చితే విలన్ గా నటించేందుకు రెడీ అనే సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత విలన్ గా మరిన్ని అవకాశాలు అందుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా అప్ డేట్ ఏంటంటే.. ఆగష్టులో ఆఫ్రికా వెళ్లొచ్చని టాక్. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కు సంబంధించిన సీన్స్ ను అక్కడ చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే రామోజీ ఫిలింసిటీలో వేసిన వారణాసి సెట్ లో కూడా కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఇక.. ఎప్పుడు అఫిషియల్ అప్ డేట్ ఇస్తారంటే.. ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజు. ఆ సందర్బంగా ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారని.. స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారని సమాచారం.