
Kingdom on the path of Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వీరమల్లు టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాని పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు ఎన్నడూ చేయని విధంగా ప్రమోట్ చేయడంతో జనాలకు బాగా రీచ్ అయ్యింది. ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపించాయి. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. చాలా సార్లు వాయిదాపడిన ఈ సినిమా ఈ నెల 31న రిలీజ్ కి రెడీ అయ్యింది. అయితే.. వీరమల్లు బాటలో కింగ్ డమ్ నడవబోతుందని టాక్. ఇంతకీ.. కింగ్ డమ్ ఏం చేయబోతున్నాడు..?
విజయ్ దేవరకొండ కెరీర్ ఎంత ఫాస్ట్ గా వేరే లెవల్ కి వెళ్లిందో అంతే ఫాస్ట్ గా డౌన్ అయ్యింది. దీనికి ఎవరి తోచిన విధంగా వాళ్లు వివరణ ఇస్తున్నప్పటికీ.. కాలం కలిసి రాకపోవడం వలనే ఇలా జరిగింది అనేది వాస్తవం. దీనికి తోడు సరైన కథలు ఎంచుకోవడంలో తడబడ్డాడు. అయితే.. ఇప్పుడు కింగ్ డమ్ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ అండ్ హోమ్ వర్క్ చేశాడు. కథ పై చాన్నాళ్లు కసరత్తు చేయించాడు. అలాగే ఇటీవల ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మరోసారి అంతా చూసుకుని రీషూట్ కూడా చేశారు. దీనిని బట్టి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. Kingdom on the path of Veeramallu
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచుతున్నారు. అయితే.. వీరమల్లు సినిమాకి వేసినట్టే.. ఈ సినిమాకి కూడా భారీగా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దీనిని బట్టి ఈ సినిమా పై మేకర్స్ కు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా నిర్మాత నాగవంశీ ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని గట్టి నమ్మకంతో చెబుతున్నారు. ఈ సినిమాకి యువ సంగీత సంచలనం అనిరుథ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా స్టోరీ బాగా నచ్చడంతో తను మరింత కేర్ తీసుకుని వర్క్ చేశారని టాక్ వినిపిస్తోంది.
లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అవ్వడంతో.. ఈసారి ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. అందుకనే విజయ్ ఈ సినిమాని మరింతగా ప్రమోషన్స్ చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేశాడట. ఈ మూవీ టీజర్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందివ్వడంతో మరింత బజ్ క్రియేట్ అయ్యింది. అయితే.. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ తో అసలు కథ ఏంటి అనేది బయటకు రివీల్ కాలేదు. దీంతో అసులు కథ ఏంటి..? కింగ్ డమ్ లో ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. వీరమల్లుతో థియేటర్స్ అన్నీ కళకళలాడాయి. మరి.. కింగ్ డమ్ కూడా ఆకట్టుకుని ఆ జోష్ ను కంటిన్యూ చేస్తుందేమో చూడాలి.