
Power Star As Producer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా మీడియా ముందుకు రావడం తెలిసిందే. అయితే.. ఈ సినిమా కోసం ఇచ్చిన ఇంటర్ వ్యూలో.. నెక్ట్స్ సినిమాల్లో నటిస్తారా..? లేక సినిమాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేస్తారా అని అడిగితే.. హీరోగా నటించడం కుదరకపోవచ్చు.. నిర్మాతగా సినిమాలు నిర్మిస్తానని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ ఇలా చెప్పినప్పటి నుంచి నిర్మాతగా సినిమాలు తీయడం అనేది కుదురుతుందా..? ఆయన హీరోగా సినిమాలు చేయడం కరెక్టా..? నిర్మాతగా సినిమాలు చేయడం కరెక్టా..? అనే చర్చ నడుస్తుంది. ఇంతకీ.. ఏది కరెక్ట్..?
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినప్పటికీ.. తనకు ఆదాయం సినిమాల ద్వారానే వస్తుందని.. తనకు వేరే వ్యాపారాలు లేవని.. అందుకని సినిమాల్లో నటిస్తానని చెప్పారు. తన అవసరాలకు.. అలాగే పార్టీ నడపడానికి డబ్బులు కావాలి కాబట్టి సినిమాల్లో నటిస్తానని చాలా సార్లు చెప్పడం జరిగింది. అయితే.. వీరమల్లు రిలీజ్ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్ వ్యూల్లో.. హీరోగా నటించడం కుదరకపోవచ్చు కానీ.. నిర్మాతగా సినిమాలు నిర్మిస్తాను అన్నారు. పవర్ స్టార్ ఇలా చెప్పడమే కొందర్నీ ఆలోచనలో పడేసింది. Power Star As Producer
ఇంతకీ మేటర్ ఏంటంటే.. నిర్మాతగా సినిమా తీయడం అంతే అంత ఈజీ కాదు. ఆయన సినిమాలు చేస్తుంది డబ్బులు కోసం. డబ్బులు రావాలంటే సినిమా సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వాలంటే.. మంచి కథను ఎంచుకోవాలి.. దానికి తగ్గ డైరెక్టర్ ను ఎంచుకోవాలి. ప్రీ ప్రొడక్షన్ వర్క్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా పెద్ద తతంగమే ఉంటుంది. ఇదంతా ఎంతో జాగ్రత్తగా చేసిన సినిమా హిట్ అవుతుందనే గ్యారెంటీ లేదు.. అందుచేత ఇంత రిస్క్ చేసి సినిమా తీయడం కంటే.. హీరోగా నటిస్తే హిట్ అండ్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా డబ్బులు వస్తాయి. అందుకని పవన్ కళ్యాణ్ కు హీరోగా నటించడమే కరెక్ట్ అని కొంత మంది సినీ పండితుల వాదన.
పవన్ కళ్యాణ్ ఏమో నటించడం అంటే.. డేట్స్ ఇవ్వాలి.. పొలిటికల్ గా బిజీగా ఉండడడం వలన ఎప్పుడు ఫ్రీగా ఉంటామో చెప్పలేని పరిస్థితి. అందుచేత హీరగా కాకుండా నిర్మాతగా సినిమాలు చేయాలి అనుకుంటున్నారు. గతంలో పవర్ కళ్యాణ్ క్రియేటీవ్ టీమ్ వర్క్ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మించాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. త్రివిక్రమ్ తో కలిసి చల్ మోహన్ రంగ అనే సినిమా తీసారు. ఇందులో నితిన్ హీరోగా నటించాడు. ఆ సినిమా ఆడలేదు. ఇప్పుడేమో నిర్మాతగా సినిమాలు తీస్తాను అంటున్నారు. మరి.. నిర్మాతగా కూడా సినిమాలు తీసి సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.