కడపజిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఆ వైసిపీ నేత తిరే వేరట.!

Nityananda Reddy in Kamalapuram constituency: కడపజిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఆ వైసిపీ నేత తిరే వేరట. కబ్జాలకు కేర్ అఫ్ అయ్యారట ఆయన. కడప కార్పొరేషన్ పరిధిలో ఆయనకు పెద్ద పీఠం కూడా వేశారట. జగన్ హయాంలో తనదైన శైలిలో కడప నగర శివారులలో భారీగానే భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయట. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు మేయర్ ను సైతం విమర్శలు చేసి లబ్ది పొందాలని ప్రయత్నాలు డిప్యూటీ మేయర్ బినామీ ల పేరిట కోట్ల రూపాయల స్థలాలు కబ్జా చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయట.అయితే గత ప్రభుత్వంలో అధికార పార్టీ నేతలు వందలకోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్నప్పటికీ గత రెవెన్యూ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించని ఆరోపణలు విపిస్తున్నాయి.

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం సికే దీన్నేలో డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి భారీగానే భూ కబ్జాలు చేశారట. ఈ విషయాన్ని అధికారులు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. మామిళ్లపల్లె గ్రామంలో సర్వే నెంబర్ 727,738/1,738/3,739/1,740/2,740/3,749,748/2 ప్రభుత్వ భూమిని ఆక్రమించారట. మామిళ్ళపల్లెలో సర్వే నెంబర్ 727లో 308.18 ఎకరాల భూమిలో 30 ఎకరాలను తన చిన్నాన్న ఆదినారాయణరెడ్డి పేరు మీద అక్రమంగ రిజిస్ట్రేషన్ చేయించారన్న అభియోగం ఎదుర్కొంటున్నారట నిత్యానందరెడ్డి. Nityananda Reddy in Kamalapuram constituency.

జగన్ ప్రభుత్వ హయాంలో అధికారం అడ్డుపెట్టుకొని డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి తప్పుడు పత్రాలు సృష్టించి దాదాపు 308 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని గుర్తించినట్లు అధికారిక వర్గాల్లో టాక్ నడుస్తోందట. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ భూకబ్జాలకు పాల్పడ్డారు అనే విషయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె మండలంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతానికి గురైందో గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారట. ఇప్పటికే చింతకొమ్మదిన్నె మండలంలో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కబ్జా చేసిన 50 ఎకరాల భూమిని ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నారట.

కొద్దిరోజుల క్రితం రీ సర్వేలో భాగంగా చింతకొమ్మదిన్నె మండలంలోని బుగ్గవంక ప్రాజెక్ట్ సమీపంలో దాదాపు 308 ఎకరాల భూమిని కడప డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి బినామీ పేర్లతో కబ్జాకు పాల్పడినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గడిచిన ఐదేళ్ల జగన్ పాలనలో వందల ఎకరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కబ్జాలకు పాల్పడుతుంటే నిమ్మకు నీరు ఎత్తినట్లు ప్రవర్తించారంటూ అప్పట్లో అధికారులపై విమర్శలు వెళ్లి వచ్చాయట. కేవలం కార్పొరేటర్ స్థాయిలో ఉన్న డిప్యూటీ మేయర్ వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా చేస్తుంటే ఏమీ ఎరగనట్లు రెవెన్యూ అధికారులు ఎందుకు వ్యవహరించారన్న అనుమానాలు కూడా కడప జిల్లా ప్రజల్లో వినిపిస్తోందట.

ఇదే డిప్యూటీ మేయర్ ఒక్క కమలాపురం నియోజకవర్గంలోని చింతకొమ్మదిన్నె మండలంలోని 308 ఎకరాలు భూమిని కబ్జా చేస్తే ఇప్పటివరకు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇదే సమయంలో రెవెున్యూ అధికారుల్లో ఓ టాక్ వినిపిస్తోంట. నిత్యానంద రెడ్డి కబ్జా చేసిన భూముల్లో, ఇవి ప్రభుత్వ భూములు అంటూ బో్డ్ పెడతారట. అయితే బోర్డులు పెట్టి చేతులు దులుపుకుంటారా, అన్ని భూములను స్వాధీనం చేసుకుని, నిత్యానందరెడ్డిపై కేసులు పెడతారా అన్నది చూడాల్సి ఉంది.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/srikakulam-kurmagram-vedic-village-is-like-no-phone-no-electricity-no-one-works-its-like-another-world/