నోరు ఉన్నవాడిదే ఊరు..? రెవెన్యూ శాఖ..!

Annavaram EO allegedly harassing the Temple & People: నోరు ఉన్నవాడిదే ఊరు.. ఈ సామెత అందరూ వినే ఉంటారు. ఈ సామెతకు దృశ్య రూపం కావాలంటే అన్నవరం సత్యదేవుని దేవస్థానానికి వెళ్ళాల్సిందే. ఈ సామెతకు అన్నవరం దేవస్థానానికి ఏమిటి సంభంధం అనుకుంటున్నారా. అన్నవరంలో క్రింది స్థాయి అర్చకులు సైతం దేవస్థానం ఈవోని గడగడ లాడిస్తున్నారట. ఇక ఈవో కూడా చక్కగా పనిచేసే ఉద్యోగులను నోటికొచ్చినట్టు తిడుతూ, అక్రమార్కుల వైపు కన్నెత్తి చూడటం లేదట.

దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని దేవస్థానంలో అనేక మంది దేవాదాయ శాఖ నుంచి, కొంతమంది రెవెన్యూ శాఖ నుంచి కార్యనిర్వాహణాధికారులుగా పనిచేశారు. వీరిలో ఎక్కువ మంది దేవాలయం అభివృద్ధి కోసం, సత్య దేవుని మహిమలు దేశావ్యాప్తంగానే కాకుండా ఖండంతరాలు దాటించి ప్రచారం చేశారు. రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన అధికారులు ఆలయానికి ఆదాయ వనరులు పెంచే విధంగా పనిచేశారు.

ఇక రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన వీర్ల సుబ్బారావు గత సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన జిల్లాకు చెందిన ఒక ప్రజా ప్రతినిధి సిఫార్సుతో అన్నవరం ఈవోగా భాద్యతలు స్వీకరించారు. ఒక సంవత్సరం మాత్రమే ఆయనకు భాధ్యతలు అప్పగించారు దేవాదాయశాఖ అధికారులు. ఆయన వచ్చినప్పటి నుంచీ అన్నవరం ప్రధాన వార్తల్లో నిలుస్తూ, సామాన్యులు సైతం విమర్శలు చేస్తూ వేలెత్తి చూపే విధానాలకు తెర తీశారు. అన్నవరంలో తనకున్న స్నేహితులు ఇచ్చిన తప్పుడు సమాచారాలను ముందు పెట్టుకుని, గతాలను తవ్వుతూ అన్నవరం దేవస్థానం అభివృద్ధిని పక్కన పెట్టి, భక్తుల సౌకర్యలకు తీసుకోవలసిన చర్యలను గాలికొదిలేశారనే విమర్శలు వినిపించాయి. Annavaram EO allegedly harassing the Temple & People.

ఇక ఈవో సుబ్బారావు కుమారుడి వ్యవహారం దేవస్థాన సిబ్బందికి తలనొప్పిగా మారిందట. దేవస్థానం వ్యవహారాల్లో కల్పిచుకోవడమే కాదు దేవస్థానం వాహనాన్ని సొంత పనులకు వాడుతున్నారట. అంతేకాదు, ఆలయ సీసీ కెమెరాలను తన సెల్ ఫోన్ నుంచే పర్యవేక్షించడంతో పాటు దేవస్థానంలో కీలకమైన కొనుగోళ్లకు సంభందించిన సమావేశాల్లో సిబ్బందిపై ఆజమాయిషీ చేస్తున్నారట. అలాగే సిబ్బందిని నోటికి వచ్చినట్లు తిట్టడం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొంత మంది వీఆర్ఎస్ తీసుకుంటే, మరికొందరు డిప్యుటేషన్ పేరుతో ఇతర ఆలయాలకు వెళ్తుంటే, ఇంకొందరు మెడికల్ లీవ్ తీసుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంతో అన్నవరం దేవస్థానం పరువు బజారుకు ఎక్కిందని తెల్సుకున్న ఉన్నతధికారులు ఒక ప్రత్యేకధికారితో విచారణ జరిపించి జరిగిన సంఘటనలు అన్నీ వాస్తవం అని నిర్దారించుకున్నారు. ఏ క్షణంలో నైనా ఈవో సుబ్బారావుపై వేటు పడుతుందని అనుకున్న సమయంలో కొంతమంది ప్రజాప్రతినిధుల సహకారంతో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనడంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కూడా ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక్కడితో సమస్య తీరి ఈవోలో మార్పు వచ్చిందనుకుంటే పొరపాటే అంటున్నారు ఆలయ సిబ్బంది. తన కార్యాలయంలో పనిచేసే వ్యక్తులపై నోటి దురుసుగా ప్రవర్తించి వారు తిరగబడేలా చేసుకున్నారంట. ఒక్క ఈవోనే కాదు, కొందరు సిబ్బంది, అర్చకులు కూడా అలానే తయారైనట్లు తెలుస్తోంది. సత్యదేవుని ఉపఆలయాలకు కొంతమంది సిబ్బందిని ఈవో బదిలీ చేస్తే, వాళ్లు స్థానిక నేతల సాయంతో మళ్లీ అన్నవరం ఆలయంలోనే ఉద్యోగాలు చేస్తున్నారట. ఇక కొందరు అర్చకులు దేవస్థానానికి చెందిన నెయ్యి డబ్బాలను బహిరంగంగానే తీసుకెళ్లి బయట అమ్ముతుంటే ఈవో ఏం చేయలేని పరిస్తితి దాపరించినట్లు ప్రచారం జరుగుతోంది. మరీదారుణం ఏంటంటే, ఆలయ ఇంజినీరింగ్ విభాగంలో ఓ కాంట్రాక్టర్ చేసిన పనికి బిల్లులు మొత్తాన్నీ తమ ఖాతాలో వేసుకున్న ప్రభుద్దులు, నకిలీ చలానాలతో పారిశుద్ధ్య కార్మికుల పీఎం సొమ్మును కాజేసిన వారు దేవస్థానంలో బయటపడ్డారు. ఇంత జరుగుతున్నా ఈవో సుబ్బారావు ఏం చేయలేని పరిస్తితిలో ఉండటం దారుమంటున్నారు ప్రజలు. అరాచకాలు చేస్తున్న వారిని ఏం చేయలేక, అమాయకులపై నోరు పారేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Also Read: