ఎన్టీఆర్ కోసం స్టోరీ రెడీ చేస్తోన్న చిరు డైరెక్టర్..?

Director Bobby & NTR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడం.. ఈ ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తుండడం తెలిసిందే. ఆగష్టు 14న వార్ 2 మూవీ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్.. తన క్రేజ్ కు తగ్గట్టుగా భారీగా పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. తాజాగా ఎన్టీఆర్ కోసం చిరు డైరెక్టర్ ఓ భారీ పాన్ ఇండియా స్టోరీ రెడీ చేస్తున్నాడని తెలిసింది. ఇంతకీ.. ఎన్టీఆర్ కోసం స్టోరీ రెడీ చేస్తున్న చిరు డైరెక్టర్ ఎవరు..? ఈ ప్రాజెక్ట్ వార్తలకే పరిమితం అవుతుందా..? నిజంగా ఉంటుందా..?

ఎన్టీఆర్ కోసం స్టోరీ రెడీ చేస్తున్న చిరు డైరెక్టర్ ఎవరంటే.. బాబీ. అవును.. బాబీ ఇటీవల బాలయ్యతో డాకు మహారాజ్ అనే సినిమా చేయడం.. సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా సక్సెస్ అవ్వడం తెలిసిందే. ఆతర్వాత బాబీ సినిమా ఎవరితో అంటే.. మెగాస్టార్ చిరంజీవితో అని వార్తలు వచ్చాయి. చిరంజీవితో బాబీ వాల్తేరు వీరయ్య అనే సినిమా చేయడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఆతర్వాత చిరు, బాబీ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యిందట కానీ.. సెట్స్ పైకి రావడానికి టైమ్ పడుతుందని సమాచారం. Director Bobby & NTR Movie.

అందుకనే.. ఈ గ్యాప్ లో బాబీ మరో సినిమా చేయాలి అనుకుంటున్నాడట. అందుకనే ఎన్టీఆర్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. దీనికి ప్రశాంత్ నీల్ డైరెక్టర్. ఈ సినిమా జూన్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మైథలాజికల్ మూవీ చేయాలి. అలాగే కొరటాలతో దేవర 2 చేయాలి. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ముందుగా చేస్తాడు..? రెండు సినిమాలను ఒకేసారి చేస్తాడా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

అయితే.. ఎన్టీఆర్ కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుచేత బాబీ కథ రెడీ చేసినా.. ఆ కథ ఓకే చేసినా స్టార్ట్ కావాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయకతప్పదు. మరో వైపు బాబీ.. బాలయ్య కోసం మరో కథ రెడీ చేస్తున్నట్టుగా ఇటీవల ప్రచారం జరిగింది. బాలయ్యతో చేయాలన్నా.. వెయిటింగ్ తప్పదు. సో.. బాబీ వాల్తేరు వీరయ్య, డాకు మహారాజ్ అంటూ సినిమాలు చేసి సక్సెస్ సాధించినా.. హీరోలు ఖాళీగా లేకపోవడంతో ఇంత వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. మరి.. బాబీ కొత్త సినిమా ఏ హీరోతో సెట్ అవుతుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/vijay-devarakonda-and-sandeep-reddy-vanga-talks-about-spirit-movie-in-an-interview/