
WhatsApp Feature Quick Recap: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది యూజర్ల కోసం మెటా కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ను పరిచయం చేస్తూ.. యూజర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ క్రమంలో రోజు వాట్సాప్ లో వచ్చే ఎడతెరిపి లేని సందేశాలను చదవడం అంటే కాస్త విసుగు పనే. అలాగని చదవకుండా వదిలేయలేం. అటువంటప్పుడు యూజర్లు చదవలేని మల్టిపుల్ మెస్సేజెస్ లను ముఖ్యాంశాల రూపంలో తెలుసుకునే వెసులుబాటును కల్పించేందుకు వాట్సాప్ కు ‘క్విక్ రీక్యాప్’ పేరుతో కొత్త ఏఐ ఎనేబుల్ ఫీచర్ ను తీసుకొచ్చింది. అంటే ఒక్కో మెసేజ్ ను చదవాల్సినవసరం లేకుండా అన్నింటిని కలిపి ఒకేసారి హెడ్ లైన్స్ రూపంలో అందిస్తుందన్నమాట. దీంతో ముఖ్యమైన వాటికి ఈజీగా బదులు ఇవ్వొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.25.21.12లో బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
క్విక్ రీక్యాప్ ఫీచర్ అంటే..
వాట్సాప్ ను చాలాకాలంపాటు యూస్ చేయని వారికి.. మల్టిపుల్ చాట్స్ లో వచ్చిన అన్ రీడ్ మెసేజ్ లను చదవాల్సిన యూజర్లకు ఈ ఫీచర్ హెల్ప్ ఫుల్ గా ఉండనుంది. ఇది వాట్సాప్ లో ఇప్పటికే ఉన్న ‘మెస్సేజెస్ సమరీస్’ ఫీచర్ పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం యూఎస్ లో చాట్ హిస్టరీని చూపించే ఫీచర్ అందుబాటులో ఉంది. కానీ, క్విక్ రీక్యాప్ ఫీచర్ దానికంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. అంటే.. యూజర్లు ఒకేసారి ఐదు చాట్ లను ఎంచుకొని ఏఐ ద్వారా ప్రతి చాట్ సంక్షిప్త సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది. వాటి మెస్సేజ్ థ్రెడ్ల ద్వారా మళ్లీ మళ్లీ స్క్రోల్ చేయాల్సిన పని లేకుండా ఉంటుంది.
WABetaInfo షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం, యూజర్లు ‘చాట్స్’ ట్యాబ్ లోకి వెళ్లి ఒకేసారి ఎన్నో చాట్స్ ను సెలెక్ట్ చేయొచ్చు. పైన రైట్ సైడ్ లో ఉన్న త్రీ డాట్ మెనూను టాప్ రైట్ టాప్ చేస్తే.. అక్కడ “Quick Recap’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే, మెటా రూపొందించిన Al unread మెసేజెస్ ను విశ్లేషించి, ప్రతి చాట్ కి చిన్న సమరీని చూపిస్తుంది. అలానే యూజర్లకు మెసేజ్ కంటెంట్ త్వరగా అర్థమయ్యేలా చేసి, అవసరమైన సమాచారం త్వరగా అందించడమే ఈ ఫీచర్ ఉద్దేశం. WhatsApp Feature Quick Recap.
ఈ ఫీచర్ మెటా ‘ప్రైవేట్ ప్రాసెసింగ్’ టెక్నాలజీనీ బేస్ చేసుకొని పని చేస్తుంది. యూజర్ల ప్రైవసీకి పూర్తి భద్రతను అందిస్తుంది. ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్రెప్షన్, సెక్యూర్ ఎంక్లేవ్, ఐసోలేటెడ్ కంప్యూటేషన్ వంటి టెక్నాలజీలతో మెసేజెస్ ను పూర్తిగా సురక్షితంగా ఉండేలా చూసుకుంటారు. అంటే మీ ఒరిజినల్ మెసేజ్ కానీ, AI రూపొందించిన సమరీ కానీ ఏ పరిస్థితుల్లోనూ మెటా, వాట్సాప్ వంటివి చూడలేవు. ఇది యూజర్ల గోప్యత కోసం తీసుకున్న జాగ్రత్తల్లో ప్రధానమైనదని చెప్పవచ్చు. కొత్త ఫీచర్ డిఫాల్ట్ గా ఉండదు. సెట్టింగ్స్ లోకి వెళ్లి యూజర్లు మాన్యువల్ గానే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ‘అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ’ సెట్టింగ్ వర్తించే చాట్లను ఈ ఫీచర్ ఆటోమేటిక్ గా మినహాయిస్తుంది. అంటే ప్రైవసీ ఎక్కువగా అవసరమైన చాట్ లపై ఈ ఫీచర్ పనిచేయదు. యూజర్ల కంట్రోల్, గోప్యత, సెక్యూరిటీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది.
Also Read: https://www.mega9tv.com/technology/250-crore-prompts-per-day-this-is-a-google-chat-gpt-record/