యుద్ధాలు తానే ఆపుతున్నాననే బిల్డపులు..!

Trump’s Nobel Prize pranks: మొన్న భారత్- పాకిస్థాన్, నిన్న ఇజ్రాయెల్ -ఇరాన్, ఇవాళ థాయిలాండ్-కంబోడియా..
కొద్ది రోజులు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల మధ్య యుద్ధం జరిగినా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యలో ఎంటరైపోతున్నారు. లేనిపోని పెద్దరికం తీసుకుని తాను శాంతిదూతనని.. యుద్ధాన్ని ఆపేస్తానని గొప్పలు చెప్పుకుంటున్నారు. అదృష్టవశాత్తు యుద్ధం ఆగిపోతే అతి తనవల్లే అనే క్రెడిట్ కూడా వేసుకుంటున్నారు.. అసలు ట్రంప్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు..? ట్రంప్ ఆత్రుత దేని కోసం ..? రోజురోజుకు ట్రంప్ కేఏ పాల్ లా ఎందుకు మారిపోతున్నారు..?

ఏ దేశమైన ఇతర దేశాలకు సంబంధించి కీలక ప్రకటన చేయాలంటే.. విదేశాంగా శాఖ ప్రతినిధి అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడమో.. లేదా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమో చేస్తారు. కాని అమెరికాలో ట్రంప్ రెండో సారి అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఏవీ చెయడం లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏం చెప్పాలనుకున్నా ఓ ప్రొటోకాల్ అంటూ పాటించుకుండా పిచ్చాపాటిగా సోషల్ మీడియా అయిన ట్రూత్ పోస్టులో ప్రకటిస్తున్నారు. చాలా కీలకమైన దేశాలకు సంబంధించి రహస్య అంశాలను సైతం ఏదో సరదాగా మాట్లాడినట్టు సోషల్ మీడియాలో పెట్టడం పరిపాటిగా మారిపోయింది. చివరికి దేశాల మధ్య యుద్ధాలకు సంబంధించిన అంశాలను సైతం సోషల్ మీడియాలో పోస్టుల ద్వారానే ట్రంప్ ప్రకటిస్తున్నారు. అయితే ఈ తీరుపై ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచ దేశాలకు నమ్మకం రోజురోజుకు పోతోంది. రోజుకో నిర్ణయం.. గంటకో మాటతో ట్రంప్ లో ఓ నిలకడ అంటూ ఉండటం లేదు. ముఖ్యంగా యుద్ధాల విషయంలో ఏదైనా రెండు దేశాల మధ్య ఘర్షణలు జరిగినప్పుడు వాటి కంటే ముందే ట్రంప్ ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఇటీవల భారత్-పాకిస్థాన్, ఇరాన్- ఇజ్రాయెల్, ఇవాళ థాయిలాండ్–కంబోడియా మధ్య యుద్ధం తానే ఆపానని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నారు.

అసలు థాయిలాండ్–కంబోడియా ఘర్షణపై ట్రంప్ ఏం వ్యాఖ్యలు చేశారు..?
ఇటీవల థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు వివాదం, నీటి వనరులు, ఆస్తి హక్కులపై ఓ మినీ యుద్ధం నడిచింది. ఇరు దేశాలు సరిహద్దులో సైనికులను మోహరించినప్పటికీ, పెద్ద యుద్ధం జరగలేదు. అంతే ఈ విషయం ట్రంప్ వరకు చేరడంతో ఎప్పటిలానే రంగంలోకి దిగిపోయారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ పోస్టులో తానే థాయిలాండ్, కంబోడియా నాయకులతో ఫోన్‌లో మాట్లాడానని.. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని, ఉద్రిక్తతలను తగ్గించుకోవలని చెప్పానని.. ఈ చర్చల వల్లే ఈ వివాదం త్వరగా సద్దుమణిగిందని డొనాల్డ్ ట్రంప్ పోస్టు చేశారు. అయితే, థాయిలాండ్, కంబోడియా ప్రభుత్వాలు ట్రంప్ ప్రమేయాన్ని అధికారికంగా ఖండించాయి. ఈ ఘర్షణ తగ్గడానికి ఆసియాన్ దేశాల దౌత్యపరమైన చర్చలు, ఐక్యరాష్ట్ర సమితి జోక్యం ప్రధాన కారణాలని అంతర్జాతీయ వర్గాలు తెలిపాయి. Trump’s Nobel Prize pranks.

ఇటీవల భారత్, పాకిస్థాన్ మధ్య ఘర్షణలు చెలరేగిన సమయంలో కూడా ట్రంప్ తానే రెండు దేశాల మధ్య శాంతికి కారణమని ప్రకటించుకున్నారు. భారత్ కంటే ముందే సోషల్ మీడియాలో సీజ్ ఫైర్ పై పోస్టు పెట్టారు. దీనిని భారత్ కూడా ఖండించింది. అయినా పదేపదే ట్రంప్ తన వల్లే భారత్, పాకిస్థాన్ మధ్య అణుయుద్ధం ఆగిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణల విషయంలో కూడా ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇన్ని గొప్పులు చెప్పుకుంటున్న ట్రంప్.. రష్యా, ఉక్రెయిల్ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. పుతిన్ ట్రంప్ చెప్పే మాటలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆగిపోతే ఆ క్రెడిట్ కూడా తన ఖాతాలో వేసుకోవడానికి ట్రంప్ చూస్తున్నారు. అయితే అది కుదరడం లేదు.

అసలు ట్రంప్ ఈ సొంత డబ్బా దేని కోసం..?
అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఇప్పుడు తనకు కూడా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుకుంటున్నారు. అనేకల దేశాల మధ్య యుద్ధాలు ఆపినందుకు ఈ అవార్డుకు తాను అర్హుడినని .. అమెరికాకు బాకా ఊదే దేశాలతో చెప్పించుకుంటున్నారు. దీని కోసమే నార్వేలోని కొంతమంది రాజకీయ నాయకులు, అమెరికాలోని రిపబ్లికన్ శాసనసభ్యులు, పాకిస్తాన్ నుంచి కొందరు ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. వారు భారత్-పాకిస్తాన్, ఇజ్రాయిల్-ఇరాన్ ఘర్షణలలో ట్రంప్ పాత్రను ప్రస్తావించారు. అయితే, నోబెల్ కమిటీ ఈ నామినేషన్లను స్వీకరించినప్పటికీ, వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.

నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ఇస్తారు?
నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా రెండు దేశాల మధ్య యుద్ధం ఆపడానికి కీలకంగా వ్యవహరించిన వారికి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చే అవకాశం ఉంది. కాని ట్రంప్ ఇరాన్ పై నేరుగా దాడులు చేయించారు. అలాగే యుద్ధ సమయంలో మానవతా సహాయం అందించిన వ్యక్తులు లేదా సంస్థలకు కూడా ఈ బహుమతి అందిస్తారు. అయితే ట్రంప్ ఇజ్రాయెల్, ఉక్రెయిన్ కు పరోక్షంగా యుద్ధం చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారు. అంతర్జాతీయంగా శాంతి, సామాజిక సామరస్యం కోసం కృషి చేసినవారికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తారు. కాని ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రకరకాలుగా ప్రపంచ దేశాల్లో శాంతి లేకుండా చేస్తున్నారు. దేశాల మధ్య స్నేహం, నిరాయుధీకరణ, బాలలు, మహిళల హక్కుల కోసం గణనీయమైన పనిచేసినవారికి నోబెల్ బహుమతి ఇస్తారు. ప్రస్తుతం అమెరికాలో ఎప్ స్టైన్ సెక్స్ స్కాండల్ ఆరోపణలు ట్రంప్ తటకు చుట్టుకున్నాయి. బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన వ్యక్తితో ట్రంప్ కు గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ ఎంత గింజుకున్నా నోబెల్ బహుమతి వచ్చే అవకాశం లేదంటున్నారు.

Also Read: https://www.mega9tv.com/international/severe-food-crisis-in-gaza-children-starving-for-food-risk-of-death-the-world-is-watching-silently/