
Freelance Visa Germany And Portugal: మీరు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా..? నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారా..? జీతం పోకుండా.. మనం పని మనం చేసుకుంటూనే విదేశాలు చుట్టొద్దామని ఆలోచనలో ఉన్నారా..? అయితే ఈ ఆఫర్ మీ కోసమే..? వర్క్ ఫ్రం హోం, ఫ్రీలాన్సర్ల కోసం ప్రపంచంలోని కొన్ని దేశాలు తక్కువ ఖర్చుతో వీసాలను ఆఫర్ చేస్తున్నాయి. వీటి సహాయంతో మంచి టూరిస్ట్ ప్లేసుల్లో .. తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చేస్తూ.. రెండు చేతులా కూడా సంపాదించవచ్చు.. ఇంతకీ ఆ దేశాలు ఏంటి..? ఎలాంటి వీసాలు ఆఫర్ చేస్తున్నాయి..? సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఇవి ఎలా ఉపయోగం? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..
ఇటీవల కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ వర్కింగ్ విధానం బాగా పెరిగింది. ఆఫీస్ కు వెళ్లకుండా.. జాబ్ చేస్తూనే నచ్చిన చోటుకు వెళ్లి ఎంజాయ్ చేయాలని చాలా మంది అనుకుంటున్నారు. ఈ కల కొంతమందికి సాధ్యమవుతోన్న మరికొంత మంది మాత్రం విదేశీ ఖర్చులు, వీసా సమస్యలతో వారి ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం కొన్ని దేశాలు ప్రత్యేకమైన వీసాలను అందిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో అందించే ఈ వీసాల ద్వారా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ డ్రీమ్ టూర్లను నెరవేర్చుకోవచ్చు. ఈ విధంగానే పోర్చుగల్ కేవలం రూ.9 వేల రూపాయలతో డిజిటల్ నోమాడ్ వీసా ఇస్తుండగా.. అలాగే జర్మనీ కేవలం 7 వేల రూపాయలకే జర్మన్ ఫ్రీలాన్స్ వీసాను జారీ చేస్తోంది. ఐరోపాయేతర దేశాల పౌరులు ఎవరైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. Freelance Visa Germany And Portugal.
ముందగా పోర్చుగల్ విషయానికి వస్తే… ఇది రెండు విధాలుగా వీసాలను జారీ చేస్తోంది. పోర్చుగల్ D8 డిజిటల్ నోమాడ్ వీసా ప్రస్తుతం ఎంతో పాపులర్ గా మారింది. 2022 అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన D8 వీసా, ఐరోపాయేతర దేశాల రిమోట్ వర్కర్లు, ఫ్రీలాన్సర్ల కోసం రూపొందించబడింది. ఇది రెండు రకాలుగా అందుబాటులో ఉంది. తాత్కాలిక స్టే వీసా, లాంగ్-టర్మ్ రెసిడెన్సీ వీసా. తాత్కాలిక స్టే వీసా అంటే ఒక సంవత్సరం చెల్లుబాటు, నాలుగు సార్లు రెన్యూవల్ చేసుకోవచ్చు. లాంగ్-టర్మ్ రెసిడెన్సీ వీసా అంటే తొలుత 4 నెలలు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత 2 సంవత్సరాల రెసిడెన్స్ పర్మిట్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు, దీనిని మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత పౌరసత్వం లేదా శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేయవచ్చు. ఈ వీసాల కోసం 18 ఏళ్లు పైబడి ఉండాలి, ఐరోపాయేతర దేశ పౌరుడై ఉండాలి. నెలవారీ ఆదాయం కనీసం సుమారు రూ. 4 లక్షల వరకు ఉండాలి. విదేశీ కంపెనీల్లో వర్క్ ఫ్రం హోం చేసే వారు దీనికి అర్హులు.
పోర్చుగల్ లానే జర్మనీ కూడా తక్కువ ఖర్చుతో వీసాలను అందిస్తారు. ఇందులో ఒకటి జర్మనీ ఫ్రీలాన్స్ వీసా. జర్మనీ ఫ్రీలాన్స్ వీసా ఫ్రీలాన్సర్ల కోసం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హెల్త్‌కేర్, లా, టెక్, కన్సల్టింగ్ వంటి రంగాల్లో పనిచేసేవారి కోసం రూపొందించబడింది. ఐరోపాయేతర దేశ పౌరులు, 18 ఏళ్లు పైబడిన వారు దీనిక అర్హులు. స్థానిక జర్మన్ క్లయింట్లతో కాంట్రాక్ట్ లేదా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఉండాలి. నెలవారీ ఆదాయం కనీసం 90 వేలు ఉండాలి. జర్మన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. కేవలం 7 వేల 500 రూపాయలకే ఈ వీసా దక్కించుకోవచ్చు. జర్మనీ పాటు స్పెయిన్ కూడా డిజిటల్ నోమాడ్ వీసాలు జారీ చేస్తోంది. మీకు నెలవారీ ఆదాయం రెండున్నరల లక్షలు ఉంటే ఈ వీసా వస్తుంది. 1 సంవత్సరం చెల్లుబాటుతో, 3 సంవత్సరాల రెసిడెన్సీ పర్మిట్‌కి కూడా దరఖాస్తు చేయవచ్చు. అలాగే ఎస్టోనియా, గ్రీస్, మారిషస్ దేశాలు కూడా ఇలాంటి వీసాలను జారీ చేస్తున్నాయి..
అసలు ఈ వీసాలను ఆ దేశాలు ఎందుకు ఇస్తున్నాయి..?
రిమోట్ వర్క్ పెరగడంతో, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఖర్చులను తగ్గించడం, ఉద్యోగులు పని-జీవన సమతుల్యత కోసం ఈ వీసాలను ఎంచుకుంటున్నారు. అయితే ఎప్పుడూ ఇంటి దగ్గర కూర్చుని పని చేసుకుంటే బోర్ కొట్టదు. అలాంటి వారు విదేశాల్లో అందమైన ప్రదేశాలను చూసుకుంటూ.. పనిచేసుకోవాలని అనుకుంటున్నారు. వీటికి తగ్గటే పోర్చుగల్‌లో లిస్బన్, పోర్టో వంటి నగరాలు హై-స్పీడ్ ఇంటర్నెట్, కో-వర్కింగ్ స్పేస్‌లతో డిజిటల్ నోమాడ్‌లకు అనుకూలంగా ఉన్నాయి. జర్మనీలో బెర్లిన్, మ్యూనిచ్‌లు టెక్ హబ్‌లుగా పేరుగాంచాయి. అయితే ఇలా వీసాలు ఇవ్వడం వల్ల ఆ దేశాలకు మంచి ఆదాయం వస్తోంది. వీరి నుంచి విదేశీ ఆదాయం పెద్ద మొత్తంలో వస్తోంది. వీరు దేశాల సంపాదన .. తమ దేశంలో ఖర్చు పెట్టడం వల్ల.. ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అంటే టూరిస్ట్ వీసాల మాదిరగా.. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వీసాలు. అయితే టూరిస్టు వీసాలే తీసుకునే ఆ దేశాలకు వెళ్లొచ్చు కదా అని అనుమానం కలగక మానదు. అయితే వర్క్ ఫ్రం హోం ఉద్యోగం చేసే వారికి హైస్పీడ్ ఇంటర్నెట్, వర్క్ ఇన్విరాన్ మెంట్ ఎంతో అవసరం. పర్యాటక ప్రాంతాల్లో ఎంజాయ్ మెంట్ కు అవకాశం ఉంటుంది కానీ.. ఇంటర్నెట్ సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. అయితే పోర్చుగల్, జర్మనీ, స్పెయిన్ వంటి దేశాలు.. ఈ సమస్యలను గమనించి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా తమ దేశాలను ఎంచుకునేలా వారి టూరిస్ట్ ప్రాంతాలను మార్చాయి.. అలాగే వీసా విధానంలో మార్పులు చేశాయి. టూరిస్టులు వస్తే మహా అయితే పది పదిహేను రోజులు ఉంటారు. అదే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు నచ్చితే సంవత్సరాల కొద్ది ఉంటారు. వారి వల్ల తమ దేశ ఆదాయం పెరుగుతందని వారి నమ్మకం. అందుకే ఇలాంటి వీసా విధానాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.