డూమ్ స్క్రోలింగ్ గురుంచి మీరు విన్నారా..?!

Doom Scrolling: కూర్చున్నా.. ట్రావెల్ చేస్తున్నా.. ఫ్రెండ్స్ తో ఉన్నా.. ఆఖరికి ఒకపక్క టీవీ నడుస్తున్నా.. ఫోన్‌ స్క్రోలింగ్ మాత్రం ఆగదు. రీల్ టైం దొరికినా చాలు.. అదే 30 సెకన్లు.. టైం పాస్ కోసమో.. మూడ్ బాలేనప్పుడో.. ఇలా సందర్భం ఏదైనా.. సమస్యకు పరిష్కారంగా.. ప్రతిదీ సోషల్ మీడియాలోనే వెతుకుంటున్నాం.. అందులోనే తృప్తి పడి జీవిస్తున్నాం. ఈ క్రమంలో మనకు తెలియకుండానే కొన్ని రుగ్మతలకు లోనవుతున్నామని తెలుసుకోలేకపోతున్నాం. మరీ ముఖ్యంగా డూమ్ స్క్రోలింగ్.. అంటే నెట్టింట్లో ప్రతికూల విషయాలను స్క్రోల్ చేసే అలవాటుతో స్ట్రెస్, ఆందోళన వంటివి పెరిగి మానసికంగా దెబ్బతింటున్నట్లు సైకాలజిస్టులు చెబుతున్నారు.

చాలామంది పొద్దున నిద్ర లేవగానే చేసే మొదటి పని ఫోన్ చూడటం… ఆరోజు వార్తలు, విశేషాలు, కరెంట్ అఫైర్స్ ను.. తమకు నచ్చిన అంశాలను తెలుసుకోవడం కోసం ఇలా స్క్రోల్ చేస్తుంటారు. ఇలా మనం ఏ కంటెంట్ అయితే ఎక్కువగా చూస్తామో అలాంటివే పదే పదే కనిపిస్తాయి కదా.. నిజానికి ఇదొక సర్కిల్ లాంటిది. అందులో ఇరుక్కుపోతే అక్కడనుంచి బయటకు రాలేం. Doom Scrolling.

ఈ మోడ్రన్ హైపర్‌ కనెక్టివిటీ వరల్డ్ లో ప్రజలు గతంలో కంటే మరింత ఫాస్ట్ గా ఇన్ఫోనూ పొందగలుగుతున్నారు. అంటే.. ఇది వరమే కాదు. శాపం కూడా. ఎందుకంటే, డూమ్‌స్క్రోలింగ్ బాధితుడిగా మారేందుకు ఈ అంశం మెయిన్ కాజ్ గా మారుతోంది. ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో సోషల్ మీడియాలో లేదా న్యూస్ సైట్ లలో ప్రతికూల విషయాలను (కరోనా/ విపత్తు/ సమాజంలో చోటు చేసుకునే విపరీత సంఘటనలు/ క్రైమ్ లాంటివి) స్క్రోల్ చేసే ఈ అబ్సెసివ్ బిహేవియర్ అవేర్ అయ్యేందుకు ఒక మార్గం లాంటిదనుకున్నా.. నిజానికిది సైలెంట్ గా మన మెదడు, మనస్సులను మనకీ తెలియకుండానే నాశనం చేస్తోంది.

అసలు డూమ్‌స్క్రోలింగ్ అంటే..?
ప్రతికూల వార్తలను చదవడం, బాధ కలిగిస్తుందని తెలిసినా అలాంటి వాటికోసమే గంటలు తరబడి వెతకడం, నిరాశ, నెగటివిటీ పెంచే వాటిపై ఫోకస్ పెట్టడాన్ని డూమ్‌స్క్రోలింగ్ అంటారు. డిజిటల్ ప్లాట్ ఫాంలో నాలెడ్జ్ పెంచుకోవడానికి స్క్రోల్ చేయడం మంచిదే. కానీ, చాలామంది విచారంలో మునిగి ఉండేందుకే డూమ్ స్క్రోలింగ్ చేస్తున్నారట.

  • ఇలా బాధ కలిగించే వార్తలు లేదా అటువంటి కంటెంట్‌ను ఎక్కువగా చూడడం వల్ల మన మెదడు పనితీరు, మానసిక స్థితి గణనీయంగా ఎఫెక్ట్ అవుతాయి.
  • దీనివల్ల మెదడును కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు ముంచెత్తుతాయి. ఇది మీ శరీరాన్ని లాంగ్ రన్ లో లేదా రెగ్యులర్ గా ఒత్తిడిలో ఉంచుతుంది. ఫలితంగా ఆందోళన, అలసట, చిరాకు తలెత్తుతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లోపించి రకరకాల మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి.
  • పదే పదే ఒత్తిడికి లోనవుతున్నప్పుడు హేతుబద్ధమైన ఆలోచన, నిర్ణయం తీసుకోవడానికి దారితీసే ప్రిఫ్రంటల్ కార్టెక్స్ అనేది దెబ్బతింటుంది. రిజల్ట్ గా ఏ పనిపైనా ఫోకస్ లేదా ప్లానింగ్ అనేది కుదరదు.
  • యుద్ధాలు, బీభత్సాలు, క్రైమ్ రిలేటెడ్ వార్తలను పదే పదే వినడం వల్ల మెదడు మొద్దుబారిపోయే అవకాశాలున్నాయట. ఇలాంటివి తత్వం కలిగినవారు తరచూ నిస్సహాయత వ్యక్తం చేస్తుంటారు.

నివారణ..

  • ఉదయం లేవగానే మీ ఫోన్‌ వాడొద్దు. దీనివల్ల ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది.
  • భోజనం చేసేటప్పుడూ మీ ఫోన్‌ను దూరంగా ఉంచండి. వీలైతే సైలెంట్ మోడ్‌లో పెట్టండి.
  • నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి. ఈ బీప్‌లు మిమ్మల్ని అలర్ట్ మోడ్‌లో ఉంచుతాయి. ఇది ఆన్ లో ఉంటే వార్తల ముఖ్యాంశాలు, ఇ.మెయిల్‌లు, మెసేజెస్ చూడటం మొదలుపెడతారు.
  • సానుకూల/ మనసుకు ఆహ్లాదం కలిగించే వార్తలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఇది మీ స్ట్రెస్ లెవెల్స్ ను కొద్దిగా తగ్గిస్తుంది.
  • ఎవరైనా మీకు ఎప్పుడూ విచారకరమైన లేదా హింసాత్మక వార్తలు చెబుతుంటే వద్దని వారించండి.
  • డూమ్ స్క్రోలింగ్ అలవాటును వదులుకోలేకపోతున్నా లేదా అది మీపై ఎక్కువ ఎఫెక్ట్ చూపుతున్నా వెంటనే మంచి సైక్రియాట్రిస్టును సంప్రదించడం మేలు.

Also Read: https://www.mega9tv.com/technology/whatsapp-introduces-new-feature-whatsapp-ai-chat/