
Kingdom release on 31st July: విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా కింగ్ డమ్. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా కోసం గౌతమ్ తిన్ననూరి ఏకంగా ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు. కథ పై చాన్నాళ్లు కసరత్తు చేశాడు. మేలో రావాల్సిన కింగ్ డమ్ ఇప్పుడు ఈ నెల 31న రిలీజ్ కి రెడీ అయ్యింది. అయితే.. ఇప్పుడు కింగ్ డమ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉంది..? విజయ్ కి విజయాన్ని అందిస్తుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సూరి అనే సిన్సియర్ పోలీసాఫీసర్ గా నటించాడు. అయితే.. ఒక సీక్రెట్ మిషన్ కోసం తన ఉనికిని మార్చుకుని, ఫ్యామిలీని వదులుకుని శ్రీలంక వెళ్లాల్సి వస్తుంది. అయితే.. ఎవర్ని పట్టుకోవాలో.. ఎవరు జైల్లో కరుడగట్టిన రాక్షసుడుగా ఉన్నాడో.. అతను స్వయంగా సూరికి అన్నయ్యని తెలుస్తుంది. అయితే.. ఈ నిజాన్ని బయటపెట్టకుండా తన వర్క్ స్టార్ట్ చేస్తాడు సూరి. రాక్షసుడులాంటి మనుషులను కట్టడి చేసే ప్రయత్నంలో సూరీ లీడర్ గా మారతాడు. ఎందుకు సూరి లీడర్ గా మారాడు..? ఆతర్వాత ఏం జరిగింది అనేదే కింగ్ డమ్ స్టోరీ అనిపిస్తుంది.
ట్రైలర్ లో చూపించిన విజువల్స్, మ్యూజిక్ అంతా కూడా కేజీఎఫ్, పుష్ప రేంజ్ లో ఉన్నాయనే ఫీలింగ్ కలిగించాయి. విజయ్ దేవరకొండ ఇటీవల నటించిన లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు కూల్ గా సింపుల్ గా ఎంటర్ టైనింగ్ గా ఉన్నాయి. అయితే.. కింగ్ డమ్ మాత్రం ఎమోషనల్ జర్నీలా అనిపిస్తుంది. అలాగే ఈ కథ, కథనంలో చాలా బలం ఉందనే ఫీలింగ్ కలిగించింది. అనిరుథ్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడని ట్రైలర్ ను చూస్తుంటే తెలుస్తుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ నటించింది. అయితే.. గ్లామర్ కాకుండా ఈసారి పర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసినట్టు అనిపిస్తుంది. Kingdom release on 31st July.
ఈ సినిమాని నిర్మించిన నాగవంశీ పక్కా ప్లానింగ్ తో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఇంత వరకు ఇంటర్ వ్యూలు ఇవ్వలేదు.. రిలీజ్ ఆతర్వాత ఇవ్వచ్చు రిలీజ్ కు ముందు ఇంటర్ వ్యూలు ఇవ్వద్దు అని నాగవంశీనే కంట్రోల్ చేశాడనే టాక్ వినిపిస్తుంది. కారణం ఏంటంటే.. విజయ్ దేవరకొండ ఇంటర్ వ్యూలో ఏదైనా నమ్మకంతో కాస్త ఎక్కువుగా మాట్లాడితే.. అది నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుచేత విజయ్ ని నాగవంశీ కంట్రోల్ చేశాడని ప్రచారం జరుగుతుంది. రిలీజ్ తర్వాత విజయ్ మరింత ప్రమోట్ చేసేలా ప్లానింగ్ చేశారని సమాచారం. మరి.. విజయ్ కి కింగ్ డమ్ ఆశించిన విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.