
NTR Two Films With The Same Banner: యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పీడు మామూలుగా లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత నుంచి మరింత దూకుడుతో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం వార్ 2 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆగష్టు 14న రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్.. ఒకే బ్యానర్ లో రెండు సినిమాలు చేస్తున్నాడని.. ఈ రెండు సినిమాలను వరుసగా చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. ఆ రెండు సినిమాలు ఏంటి..? ఆ బ్యానర్ ఏంటి..?
ఎన్టీఆర్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఇటీవల రామోజీ ఫిలింసిటీలో ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 ప్రమోషన్స్ లో ఉండడం వలన డ్రాగన్ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు. వార్ 2 రిలీజ్ తర్వాత నుంచి మరింత స్పీడుగా డ్రాగన్ షూట్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఈ సినిమాని జనవరిలో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. నెక్ట్స్ ఇయర్ జూన్ 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఒకే బ్యానర్ లో రెండు సినిమాలు చేసేందుకు ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఆ బ్యానర్ ఏంటంటే.. సితార ఎంటర్ టైన్మెంట్. ఈ సినిమాలో రెండు సినిమాలు చేయడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పాడని తెలిసింది. ఆ సినిమాలు ఏంటంటే.. ఒకటి ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో మూవీ కాగా, రెండోది ఎన్టీఆర్, నెల్సన్ దిలీప్ కుమార్ మూవీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేసే సినిమా మైథలాజికల్ మూవీ. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. NTR Two Films With The Same Banner.
ఎన్టీఆర్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబో మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందని సమాచారం. ఈ సినిమాని వేరే బ్యానర్ లో చేస్తాడేమో అనుకున్నారు కానీ.. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లోనే చేయనున్నాడని తెలిసింది. బీస్ట్, జైలర్ సినిమాలతో తన సత్తా చాటిన నెల్సన్ ఎన్టీఆర్ కి ఒక అదిరిపోయే కథ చెప్పాడట. ఆ సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీ తర్వాత ఉంటుందని టాక్ వినిపిస్తుంది. దీని గురించి నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇవ్వడంతో ఈ రెండు ప్రాజెక్టులు కన్ ఫర్మ్ అనే క్లారిటీ వచ్చేసింది. అయితే.. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది పక్కాగా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.