
Sundeep Kishan’s Power Peta: ఇండస్ట్రీలో ఒకరి కోసం కథ రాస్తే.. వేరే వాళ్లతో సెట్ అవ్వడం అనేది కామన్ గా జరుగుతుంటుంది.. ఇలా చాలా మంది హీరోలకు.. చాలా సార్లు జరిగాయి. ఇప్పుడు నితిన్ తో సినిమా చేయాలని కథ రాసుకుంటే.. అది సందీప్ కిషన్ తో సెట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. నితిన్ కోసం కథ రాసుకున్న డైరెక్టర్ ఎవరు..? ఎందుకు నితిన్ తో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది..? సందీప్ తో సెట్ అవ్వడానికికారణం ఏంటి..? ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..? తెలుసుకోవాలి అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే..
నితిన్ తో సినిమా చేయాలని.. పవర్ పేట అనే కథను రాసుకున్నాడు డైరెక్టర్ కృష్ణ చైతన్య. ఈ సినిమా కథను ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు పార్టులుగా తీయాలి అనుకున్నాడు. ప్రాజెక్టు దాదాపు ఓకే అయిపోయింది. అనౌన్స్ మెంట్ ఒకటే ఆలస్యం అనుకుంటున్న టైంలో హఠాత్తుగా ఆగిపోయింది. బడ్జెట్ ఎక్కువు అవుతుండడం.. నితిన్ కు వరస ఫ్లాపులు రావడం తదితర కారణాలు వలన ఈ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో కృష్ణ చైతన్య గ్యాంగ్స్ అఫ్ గోదావరి అనే కథతో విశ్వక్ సేన్ తో సినిమా తీసాడు. ఆ సినిమా బాగానే ఉన్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో మెప్పించలేదు.
ఇప్పుడు కృష్ణ చైతన్య నితిన్ తో చేయాలి అనుకున్న పవర్ పేట కథను సందీప్ కిషన్ తో సినిమా చేయాలి అనుకుంటున్నాడని తెలిసింది. యాత్ర, ఆనందో బ్రహ్మ తదితర సినిమాలు తీసిన 70 ఎంఎం ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే.. ఇంతకు ముందు రాసుకున్న ప్రకారం పవర్ పేట మొత్తం మూడు భాగాలుగా రావాలి కానీ.. ఇప్పుడు సింగల్ పార్ట్ గా రేసీ స్క్రీన్ ప్లేతో తీస్తారని సమాచారం. ఇది గుంటూరు నేపథ్యంతో ఒక గ్యాంగ్ స్టర్ బాల్యం నుంచి వయసు మళ్లే వయసు వరకు ఉంటుందని తెలిసింది. ఈ కాన్సెప్ట్ కమల్ హాసన్ నాయకుడు తరహాలో ఉంటుంది అనిపిస్తున్నా.. పూర్తిగా వేరే ట్రీట్ మెంట్ తో ఉంటుందట. Sundeep Kishan’s Power Peta.
అయితే.. ఈ సినిమా హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ కృష్ణ చైతన్య ఇద్దరికీ చాలా కీలకం. దీంతో ఈ డైరెక్టర్ చాలా కసరత్తు చేస్తున్నాడని.. ఖచ్చితంగా విజయం సాధించేలా కథను డిజైన్ చేశాడని తెలిసింది. ఇది కృష్ణ చైతన్య డ్రీమ్ ప్రాజెక్ట్. అందుచేత కసితో ఈ సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. పవర్ పేట మూవీని బెస్ట్ మూవీగా నిలిచేలా చేయాలని తపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని ప్రకటించనున్నారు. మరి.. నితిన్ తో చేయాల్సిన పవర్ పేట సందీప్ కిషన్ కు సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.