ధర్మస్థల మిస్టరీ ఏంటి..?

Dharmasthala Mass Burial Skeletons: కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ఆలయంలో వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. శాంతి, సేవ, సాంప్రదాయాలకు చిహ్నంగా నిలిచే ఈ ఆలయ పరిసరాల్లో మానవ అవశేషాలను పూడ్చిపెట్టినట్లు ఒక వాచ్‌మన్ ఆరోపణలు చేయడంతో కలకలం రేపింది. తాజాగా ఈ ఊరిలో మానవ అవశేషాలను గుర్తించడం మరింత హాట్ టాపిక్ గా మారింది. అసలు ధర్మస్థలంలో మిస్టరీ ఏంటి..? వాచ్‌మన్ ఈ ఆరోపణలు ఎందుకు చేశాడు? దేశవ్యాప్తంగా ఈ కేసుపై ఎలాంటి చర్చ జరుగుతోంది?

కర్ణాటకలోని ధర్మస్థలం.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మళయాల క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఆసక్తి కలుగుతున్నాయి. అసలు ధర్మస్థలలో ఏం జరుగింది..? పెద్ద సంఖ్యలో డెడ్ బాడీలను తాను పుడ్చిపెట్టానని వాచ్ మెన్ ఎందుకు చెప్పాడు..? అసలు ఈ డెడ్ బాడీలు ఎవరివి అనే చర్చ జరుగుతోంది..

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయం శాంతి, సేవ, ధర్మం, సామాజిక న్యాయానికి చిహ్నంగా నిలుస్తుంది. చంద్రవంశీయ హెగ్గడే కుటుంబం నిర్వహణలో, డి. వీరేంద్ర హెగ్గడే నేతృత్వంలో, ఈ ఆలయం అన్నదానం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి వంటి సేవల ద్వారా లక్షలాది భక్తుల విశ్వాసాన్ని పొందింది. రోజూ వేల సంఖ్యలో భక్తులు సందర్శించే ఈ ఆలయం పారదర్శకమైన నిర్వహణకు పేరుగాంచింది. అయితే, ఇటీవల ఒక వాచ్‌మన్ ఆరోపణలతో ఈ ఆలయం సంచలన వార్తల్లో నిలిచింది, దీంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. Dharmasthala Mass Burial Skeletons.

వాచ్‌మన్ ఆరోపణలు ఏంటి..?
ధర్మస్థల ఆలయంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి దక్షిణ కన్నడ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఈ కేసులో సంచలనంగా మారింది. ఆలయ ఆవరణలోని ఖాళీ స్థలంలో కొంతమంది అధికారుల ఆదేశాల మేరకు మానవ శరీరాలను పూడ్చానని… ఈ శవాలు ఎవరివి, ఎందుకు చనిపోయారో తనకు తెలియదని గతంలో ఇక్కడ పనిచేసిన వాచ్ మెన్ చెప్పాడు. ఈ ఆరోపణలు స్థానికంగా భయాందోళనలను రేకెత్తించాయి. ఈ శవాలు ఆలయంలో చనిపోయిన భక్తులవా? లేక ఇతర కారణాలతో సంబంధం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. వాచ్‌మన్ మాటలు ఆలయ నిర్వహణపై సందేహాలను లేవనెత్తాయి, దీంతో పోలీసులు దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి.. సమీపంలో తవ్వకాలు చేపట్టారు.

పోలీసుల దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. ఆలయ ఆవరణలోని కొన్ని అనుమానాస్పద ప్రాంతాల్లో త్రవ్వకాలు చేపట్టి, మానవ అవశేషాలను గుర్తించారు. ఫోరెన్సిక్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ బృందాలు ఈ అవశేషాలను సేకరించి, డిఎన్ఏ పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపాయి. ఈ అవశేషాలు ఎవరివి, ఎప్పటివి, ఎలా అక్కడ చేరాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. వాచ్‌మన్ స్టేట్‌మెంట్ ఆధారంగా, పోలీసులు ఖాళీ స్థలాల్లో త్రవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఆలయంలో గతంలో పనిచేసిన కొంతమంది కార్మికులను, భద్రతా సిబ్బందిని విచారిస్తున్నారు. వాచ్‌మన్ ఆరోపణల్లో పేర్కొన్న అధికారులు ఎవరనే దానిపై పోలీసులు దృష్టి సారించారు.

వాచ్‌మన్ ఆరోపణల వెనుక కారణాలు..
వాచ్‌మన్ ఈ ఆరోపణలు ఎందుకు చేశాడనే ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది. గతంలో ఆలయంలో రాత్రి వేళల్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినట్లు వాచ్ మెన్ చెబుతున్నాడు. కొన్ని శవాలు రాత్రిళ్లు కనిపించి, ఉదయానికి అవి అదృశ్యమయ్యాయని… ఆలయంలో ఆకస్మిక మరణాలు, గాయాలతో చనిపోయిన వారి అంత్యక్రియలు ఎక్కడ జరిగాయో కూడా తెలిసేది కాదని అతను చెప్పాడు. ఈ ఆరోపణలు ఆలయంలో సరైన రికార్డు నిర్వహణ లేకపోవడం, లేదా కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగాయా అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. వాచ్‌మన్ ఈ విషయాన్ని బయటపెట్టడానికి వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఇది ఆలయంపై జరుగుతున్న కుట్ర అని కొందరు కొట్టిపడేస్తున్నారు. ధర్మస్థల ఆలయ నిర్వాహకులు ఈ ఆరోపణలపై స్పందిస్తూ ఆలయం పారదర్శకమైన నిర్వహణకు కట్టుబడి ఉందని… ఈ ఆరోపణలు నిజమైనవైతే, వాటిని పూర్తిగా విచారిస్తామని అని పేర్కొన్నారు. డి. వీరేంద్ర హెగ్గడే ఈ విషయంపై పోలీసు దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అయితే ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆధ్యాత్మికత, ఆలయ నిర్వహణ, మరియు విశ్వాస వ్యవస్థలపై తీవ్ర చర్చకు దారితీసింది. కొందరు ఇది ఆలయ నిర్వహణలో అవకతవకల కారణంగా జరిగిన ఒక దుర్ఘటన కావచ్చు అని అంటుండగా, మరికొందరు ఇది రాజకీయ కుట్ర కావచ్చు అని అనుమానిస్తున్నారు.

Also Read: https://www.mega9tv.com/national/japans-surprise-gift-for-india-and-what-comes-next-pm-modi-to-visit-japan-next-month/