విశ్వంభర తో డైరెక్టర్ వశిష్ట్ చేస్తుంది.. రైటా..? రాంగా..?

Vashisht is directing the movie Vishwambhara: బింబిసార సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించిన డైరెక్టర్ మల్లిడి వశిష్ట్. ఆతర్వాత రెండో సినిమాకే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే లక్కీ ఛాన్స్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ మూవీని థియేటర్స్ లోకి తీసుకువచ్చేందుకు రెడీ చేస్తున్నాడు. సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయ్యింది. అయితే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా వశిష్ట్ వరుసగా ఇంటర్ వ్యూస్ ఇస్తూ.. విశ్వంభర మూవీని ప్రమోట్ చేస్తున్నాడు. ఇంతకీ.. వశిష్ట్ చేస్తుంది రైటా..? రాంగా..?

సినిమాని కొత్త తరహాలో ప్రమోట్ చేయడంలో ముందుంటాడు అనిల్ రావిపూడి. తన సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచే ప్రమోషన్స్ పై కాన్ సన్ ట్రేషన్ చేస్తుంటాడు. సరికొత్తగా పబ్లిసిటీ చేస్తూ మూవీని బాగా జనాల్లోకి తీసుకెళుతుంటాడు. ఇప్పుడు మిగిలిన డైరెక్టర్స్ కూడా అదే రూటులో వెళుతున్నారు. విశ్వంభర డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ కూడా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్ వ్యూస్ ఇస్తూ మూవీని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా కథ గురించి పూర్తిగా చెప్పేస్తున్నాడు డైరెక్టర్ వశిష్ట్. Vashisht is directing the movie Vishwambhara.

ఇప్పుడు ఇదే మెగా ఫ్యాన్స్ ని తెగ టెన్షన్ పెడుతుంది. కారణం ఏంటంటే.. కథ గురించి పూర్తిగా చెప్పేస్తే ఆడియన్స్ కి ఇక ఇంట్రెస్ట్ ఏముంటుదంది..? థియేటర్ వచ్చి ఎందుకు థ్రిల్ ఫీలవుతారు..? అనేది మెగా ఫ్యాన్స్ ఆవేదన. ఇలా ముందుగా ప్రమోట్ చేయడం వలన సినిమా పై బజ్ పెంచకపోగా.. బజ్ ని తగ్గిస్తుంది అంటున్నారు. వశిష్ట్ మాత్రం అడిగిన వాళ్లకి ఇంటర్ వ్యూలు ఇస్తున్నారు. ఈ సినిమా కోసం పెండింగ్ ఉన్న సాంగ్ కంప్లీట్ చేసేశారు. ఇక మిగిలింది వీఎఫ్ఎక్స్ వర్కే. దీని గురించి కూడా త్వరలోనే క్లారిటీ రాబోతుందని సమాచారం.

వీఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ అయితే.. సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించేస్తారు. దసరాకి ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటంటే.. సంక్రాంతికి మెగాస్టార్, అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ కానుంది. అందుచేత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విశ్వంభర మూవీని విడుదల చేయాలని ట్రై చేస్తున్నారు. అయితే.. క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశ్యంతోనే ఎంత ఆలస్యం అయినా రిలీజ్ కోసం కంగారు పడడం లేదు. మరి.. విశ్వంభరకు మల్లిడి వశిష్ట్ ప్రమోషన్ ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/ram-in-tension-with-the-result-of-kingdom-ram-is-acting-in-the-movie-andhra-king-taluka-bhagyashree-borse-as-female-lead/