RP పట్నాయక్ హనుమాన్ చాలీసా కోసం గణపతి సచ్చిదానంద

Hanuman Chalisa ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ స్వీయ సంగీత దర్శకత్వంలో రూపొందించిన హనుమాన్ చాలీసా వీడియోను గణపతి సచ్చిదానంద స్వామి విడుదల చేశారు. అమెరికాలోని టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో ఉన్న అతిపెద్ద హనుమాన్ టెంపుల్ మెక్కినీలో గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా విడుదల అయింది. శ్రీ గోస్వామి తులసీదాసు 16వ శతాబ్దంలో అవధి భాషలో రచించిన ఈ హనుమాన్ చాలీసా.. తెలుగు, తమిళం, కన్నడ, ,హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆయా భాషలవారు చదువుకుంటూ పాడుకునేలా వీడియో రూపొందించామని కార్యనిర్వాహక నిర్మాత రఘురామ్ బొలిశెట్టి తెలియజేశారు. హనుమంతుని అపార శక్తి గురించి వర్ణించే ఈ హనుమాన్ చాలీసా వినేటప్పుడు ఒక అద్భుతమైన అనుభూతి ఖచ్చితంగా కలుగుతుందని ఈ పాటను స్వయంగా ఆలపించిన RP పట్నాయక్ అన్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఈ పాటను విని ఇది నేటి యువతకు బాగా చేరువవుతుందని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ టెంపుల్ ఫౌండర్ ప్రకాష్ రావు కూడా పాల్గొన్నారు. ఈ పాట RP పట్నాయక్ తన స్వీయ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేశారు. Hanuman Chalisa