
NTR in Kantara 3: యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్ మామూలుగా లేదు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే రెండు సినిమాలు కన్ ఫర్మ్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చిన క్రేజ్ కు తగ్గట్టుగా భారీ పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే.. ఊహించని విధంగా కాంతార 3 లో ఎన్టీఆర్ నటించబోతున్నాడనే వార్త బయటకు రావడం.. ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. ఇంతకీ.. ఇది నిజమేనా..?
కాంతార.. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. ఈ మూవీని ముందుగా కన్నడలో రిలీజ్ చేస్తే.. సంచలన విజయం సాధించింది. ఆతర్వాత తెలుగులో రిలీజ్ చేస్తే.. ఇక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆతర్వాత మిగిలిన భాషల్లో రిలీజ్ చేస్తే.. ఏ భాషలో రిలీజ్ చేసినా కాంతార అద్భుత విజయం సాధించడంతో ఈ మూవీ పార్ట్ 2 పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఈ మూవీకి ప్రీక్వెల్ గా కాంతార ఛాప్టర్ 1 అంటూ భారీ ఎత్తున ఈ సినిమాని తీస్తున్నాడు. అక్టోబర్ 2న కాంతార ప్రీక్వెల్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
ఇదిలా ఉంటే.. ఊహించని విధంగా కాంతార సినిమాకి పార్ట్ 2 మాత్రమే కాదు.. పార్ట్ 3 కూడా ఉందని.. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడనే వార్త ఆసక్తిగా మారింది. కాంతార పార్ట్ 3 ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడట రిషబ్ శెట్టి. ఈ మూవీలోకి తెలుగు స్టార్ ను అందులోనూ ఎన్టీఆర్ ను తీసుకురావాలనే ప్రయత్నిస్తున్నాడట. ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆమధ్య ఎన్టీఆర్ కర్నాటక వెళ్లినప్పుడు రిషబ్ శెట్టిని కలవడం తెలిసిందే. ఆ సమయంలోనే కాంతార 3 కి సంబంధించిన చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. కాంతార 2లోనే ఎన్టీఆర్‌కి సంబంధించిన లీడ్ కూడా ఉండొచ్చని సమాచారం. NTR in Kantara 3.
అయితే.. ఎన్టీఆర్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆగష్టు 14న వార్ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతో డ్రాగన్ సినిమాతో జూన్ 25న రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మైథలాజికల్ మూవీ చేయనున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత అంటే.. కాంతార 3 కోసం టైమ్ పట్టేలా ఉంది. అయితే.. ఎన్టీఆర్ గెస్ట్ రోలా..? ఫుల్ లెంగ్త్ క్యారెక్టరా..? అనేది క్లారిటీ లేదు. అయితే.. ప్రచారంలో ఉన్నది నిజమై ఎన్టీఆర్, రిషబ్ శెట్టి కలిసి నటిస్తే.. సినీ అభిమానులకు పండగే.
Also Read: https://www.mega9tv.com/cinema/war-2-vs-coolie-hows-the-hype/