నితిన్ నెక్ట్స్ మూవీ ఎప్పుడు..? ఎవరితో..?

Nithin Next Movie Update: నితిన్ తాజాగా నటించిన మూవీ తమ్ముడు. దిల్ రాజు నిర్మాణంలో.. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. దీంతో నితిన్ నెక్ట్స్ సినిమా ఎవరితో..? ఎప్పుడు..? అనేది సస్పెన్స్ గా మారింది. ఎల్లమ్మ సినిమా ఎప్పటి నుంచో వార్తల్లో ఉంటుంది కానీ.. ఇంత వరకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు. మరి.. నితిన్ నెక్ట్స్ మూవీ ఎవరితో…? అసలు ఎల్లమ్మ సినిమా ఉందా..? లేదా..? అసలు ఏం జరుగుతోంది..?

నితిన్ తన ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమాలు చేసినప్పుడు వరుసగా సక్సెస్ సాధించాడు. అయితే.. ఇమేజ్ పక్కనపెట్టి మాస్ సినిమాల ప్రయత్నం చేసిన ప్రతిసారీ ప్లాప్ ఎదురైంది. ఈమధ్య కాలంలో వరుస ప్లాపులతో కెరీర్ లో బాగా వెనకబడ్డాడు. రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో నెక్ట్స్ మూవీ విషయంలో ఆలోచనలో పడ్డాడు. ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించాల్సిన పరిస్థితి. అందుకనే ఆచితూచి అడుగులు వేయాలని డిసైడ్ అయ్యాడట. ఇప్పుడు నితిన్ రెండు ప్రాజెక్టులు ఓకే చేసాడు. ఈ రెండు ప్రాజెక్టుల పైనే ఆశలు పెట్టుకున్నాడు.

ఇంతకీ ఆ రెండు ప్రాజెక్టులు ఏంటంటే.. ఒకటి బలగం వేణుతో ఎల్లమ్మ సినిమా కాగా రెండోది విక్రమ్ కే కుమార్ తో సినిమా. అయితే.. త‌మ్ముడు సినిమా ఎఫెక్ట్ తో ఎల్లమ్మ సినిమా కాస్త వెన‌క్కి వెళ్ళిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. నితిన్ త‌ర్వాత చేయ‌బోయే సినిమా విక్ర‌మ్ కె కుమార్ తోనే అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇష్క్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న సినిమా కావ‌డంతో దీని పై మంచి అంచ‌నాలు ఉంటాయి. ఇది స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనుందని.. ఈ సినిమాలో నితిన్ హార్స్ రైడ‌ర్ గా నెవ‌ర్ బిఫోర్ లుక్ లో క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ మూవీని నితిన్ కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని టాక్. Nithin Next Movie Update.

ఇక ఎల్లమ్మ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోకుండా వర్క్ చేస్తానని నితిన్ నిర్మాత దిల్ రాజుకు చెప్పారని తెలిసింది. సినిమా రిలీజై లాభాలు వస్తే.. అప్పుడు తనకు రెమ్యూనరేషన్ ఇవ్వమని చెప్పాడట. అయితే.. ఈ సినిమా నిర్మాణం విషయంలోనే దిల్ రాజు ఆలోచనలో పడ్డాడని.. నిర్మాణ వ్యయం ఇంకాస్త తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. బడ్జెట్ ఎంత..? అనేది క్లారిటీ వస్తే.. అప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ రెడీ చేస్తారని సమాచారం. మొత్తానికి నితిన్.. ఈ రెండు సినిమాల పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి.. ఈ రెండు సినిమాలతో అయినా ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/maheshs-movie-athadu-re-release-superstar-mahesh-sets-a-new-record/