వీరమల్లు విమర్శల పై క్లారిటీ ఇచ్చిన పవర్ స్టార్!

Power Star Next Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకులు క్రిష్‌, జ్యోతికృష్ణ తెరకెక్కించిన భారీ పీరియాడిక్ మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమాని కరోనా ముందు స్టార్ట్ చేశారు. ఇటీవల విడుదలైంది. అయితే.. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి స్పందన వచ్చిందో తెలిసిందే. ముఖ్యంగా హిందు వెర్సెస్ ముస్లిం అనే విధంగా సినిమా తీసారంటూ విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల పై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ.. పవన్ ఏం చెప్పారు..? నెక్ట్స్ మూవీ అప్ డేట్ ఏంటి..?

వీరమల్లు సినిమాని హిందు వెర్సెస్ ముస్లిం అనే విధంగా తీసారనే విమర్శలను పవన్ కళ్యాణ్‌ ఖండించారు. ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో మాట్లాడుతూ.. క్రిష్‌ కరోనా ముందు ఈ సినిమా కథను చెప్పారని.. అప్పుడు కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పానని అన్నారు. అలాగే అప్పటి చరిత్రను తెలియచేయాలి.. వీరమల్లు వారసత్వాన్ని తెలియచేయాలి అనుకున్నాం తప్పా.. హిందూ వెర్సెస్ ముస్లిం అనే కోణంలో సినిమా తీయాలని అనుకోలేదన్నారు. ఒక నిరంకుశుడి కూరత్వాన్ని ఈ సమాజానికి చెప్పాలనే ప్రయత్నం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్‌.

ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పుడు ఒక పార్ట్ గానే తీయాలి అనుకున్నారు. అయితే.. ఈ మూవీ ఆలస్యం అవుతుండడంతో రెండు పార్టులుగా తీయాలని ఫిక్స్ అయ్యారు. దీనికి తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు చేశారు. సెకండ్ పార్ట్ 25 శాతం కంప్లీట్ అయ్యిందని స్వయంగా పవన్ కళ్యాణ్‌ చెప్పారు. ఫస్ట్ పార్ట్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్ ను బట్టి సెకండ్ పార్ట్ లో మరింత కేర్ తీసుకుంటామని.. మంచి క్వాలిటీతో వీరమల్లు సెకండ్ పార్ట్ ఉంటుంది అన్నారు. అయితే.. పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో ఎప్పుడు డేట్స్ ఇస్తారు..? ఎప్పుడు వీరమల్లు సెకండ్ పార్ట్ ఉంటుంది అనేది తెలియాల్సివుంది. Power Star Next Movie.

ఇక పవన్ నెక్ట్స్ సినిమాల విషయానికి వస్తే.. ఓజీ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజీ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. మరి.. వీరమల్లుతో ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ సాధించలేకపోయిన పవర్ స్టార్ ఓజీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/anushka-vs-rashmika-movie-clashes-for-ghaati-and-the-girlfriend/