
Nara Lokesh tweet on Coolie Movie: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. ఈ సినిమాకి లోకేష్ కనకరాజ్ డైరెక్టర్. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కూడా నటించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆగష్టు 14న కూలీ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. ప్రమోషన్స్ లో ఈ క్రేజీ మూవీ దూసుకెళుతుండడంతో ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. ఏపీ మంత్రి నారా లోకేష్ కూలీ సినిమా గురించి ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్ కూడా తగిలింది. ఇంతకీ లోకేష్ ఏమని ట్వీట్ చేశాడు..? ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ అవ్వడానికి కారణం ఏంటి..?
రజినీకాంత్, నారా చంద్రబాబు నాయుడు.. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధం నేపథ్యంలో.. నారా లోకేష్ రజినీకాంత్ కు సంబంధించిన స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆల్ ది బెస్ట్ తెలియచేశారు. కూలీ మూవీ టీమ్ మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా.. రజినీకాంత్ ఎరాలో జీవించడం మన అందరి అదృష్టమని తెలిపారు. రజినీకాంత్ సినిమాల్లోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న విషయాన్ని తన పోస్ట్ ద్వారా గుర్తుచేశారు. తమ ఫ్యామిలీ డార్క్ హర్స్ లో మద్దతుగా నిలిచినందుకు రజినీకాంత్ కు నారా లోకేష్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేశారు.
నారా లోకేష్.. ఇలా కూలీ సినిమా గురించి ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే హాట్ టాపిక్ గా నిలిచింది. కారణం ఏంటంటే.. టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేయడం తెలిసిందే. ఈ సినిమా కూడా ఆగష్టు 14నే కూలీ రిలీజ్ రోజునే రిలీజ్ కాబోతుంది. అయితే.. వార్ 2 గురించి స్పందించకపోవడం పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఒక వర్గం నారా లోకేష్ పై ఫైర్ అవుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకే రోజున రిలీజ్ అవుతున్న రెండు సినిమాల్లో ఒక సినిమాకి మద్దతు తెలియచేసి రెండో సినిమాకి అది కూడా బావమరిది మూవీకి మద్దతు తెలియచేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. Nara Lokesh tweet on Coolie Movie.
ఆగష్టు 14న కూలీ, వార్ 2 విడుదల అవుతుండడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కూలీ మూవీ ప్రమోషన్స్ లో దూసుకెళుతుంటే.. వార్ 2 మూవీ ప్రమోషన్స్ లో వెనకబడింది. ఇప్పుడు వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించి ప్రమోషన్స్ లో స్పీడు పెంచింది. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజున రిలీజ్ కావడం అనేది అందరిలో ఆసక్తి కలిగిస్తుంది. మరి.. ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధిస్తుందో చూడాలి.