
Excitement Over Tirupati TDP In-Charge: ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి లో టిడిపి ఇన్చార్జి నియామకంపై సస్పెన్న్స్ ,రోజు రోజుకి ఇన్చార్జి నియామకంపై ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ గా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కు రాష్ట్ర క్లినింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీంతో తిరుపతి టిడిపి ఇన్చార్జి స్థానం ఖాళీ అయినట్లు అయింది. అయితే ఇప్పుడు తిరుపతి టిడిపి ఇన్చార్జి… ఎవరికి కేటాయిస్తారు అనేదానిపై తీవ్ర చర్చి జరుగుతుంది. నామినేటెడ్ పోస్టులు రాణి చాలామంది ఆశావాహులు ఇన్చార్జి పదవిపై ఆశలు పెంచుకుంటున్నారు. తిరుపతిలో కూటమిలో భాగంగా జనసేన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా తిరుపతి ఇన్చార్జి పదవి ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వయసు మీరడంతో ఆమె పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం లేదని గుసగుసలు వినపడుతున్నాయి. నేపథ్యంలోనే యువతకు తిరుపతి టిడిపి పార్టీ ఇన్చార్జి పదవి కట్టబెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తిరుపతి టిడిపి ఇన్చార్జి పదవి దక్కించుకోవాలని చాలామంది ఆశావాహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మహానాడు కన్నా ముందే తిరుపతి ఇంచార్జ్ ని ప్రకటిస్తారు అని అందరూ భావించారు. కానీ మహానాడు అయిన తర్వాత కూడా టిడిపి తిరుపతి ఇన్చార్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించకపోవడంతో తిరుపతి ఇన్చార్జి పదవి ఆశిస్తున్న ఆసవాహలలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. టిడిపి ఇన్చార్జి పదవి కోసం ప్రయత్నించిన వారిలో సీనియర్ టిడిపి నేత నరిసింహ యాదవ్ కు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడం, మరొకరు వూకా విజయ్ కుమార్ కు ఏపి అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నామినేటెడ్ పదవులు కేటాయించారు. దీంతో వీరిద్దరూ ఆ రేస్ లో నుంచి తప్పుకున్నట్ల అయ్యింది.ముఖ్యంగా తిరుపతిలో బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు.ఈ నేపథ్యంలోనే జనసేన బలిజ సామాజిక వర్గమైన ఆరని శ్రీనివాసులకు టికెట్ కేటాయించి కూటమి నాయకుల సహకారంతో తిరుపతి లో ఘన విజయం సాధించారు.ఇక తిరుపతి టిడిపి ఇన్చార్జ్ రేసులో యూత్ ఫాలోయింగ్ తోపాటు బలిజ సామాజిక వర్గానికి చెందిన డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ జె.బి.శ్రీనివాస్, ప్రముఖ విద్యావేత్త ఎడిఫై విద్యాసంస్థల అధినేత ప్రణీత్, మబ్బు దేవనారాయణరెడ్డి, కోడూరు బాలసుబ్రమణ్యం ఈ నలుగురు ప్రధానంగా ఇప్పుడు టిడిపి ఇన్చార్జి పదవి కోసం పోటీ పడుతున్నారు అని సమాచారం. ఎవరికి వారు అధినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అని టాక్.
తిరుపతిలో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ, దీంతో టిడిపి ఇన్చార్జి పదవి బలిజ సామాజక వర్గానికే కేటాయిస్తారు అని సమాచారం. ఇందులో ముఖ్యంగా యువ నాయకుడు ప్రముఖ విద్యాసంస్థల అధినేత, ప్రణీత్ ఫౌండేషన్,తిరుపతి ఏడిఫై స్కూల్ అధినేత ప్రనీత్ టిడిపి ఇన్చార్జి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సౌమ్యుడు విద్యావంతుడు కావడం బలిజ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం అన్ని కలిసి వచ్చే అంశాలుగా తెలుస్తున్నాయి. అలాగే ఈయనకు యువ నాయకుడైన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
అలాగే ప్రణీత్ ఫౌండేషన్ ద్వారా పేదలకు తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. అలాగే నారా రోహిత్ తో సన్నిహిత సంబంధం, తనకు మంచి మిత్రుడు కూడా అని తెలుస్తుంది.ఈ నేపథ్యంలోనే తిరుపతి టిడిపి ఇన్చార్జి రేసులో ఎక్కువగా ప్రణీత్ పేరు వినబడుతుంది. అలాగే మరో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా తిరుపతిలో గుర్తింపు తెచ్చుకున్న జెబి శ్రీనివాస్ కూడా బలిజ సామాజిక వర్గానికి చెందినవారే. ఈయన పేరు కూడా తిరుపతి నియోజకవర్గంలో యువత నోటిలో తిరుపతి ఇన్చార్జి అవుతారు అంటూ ప్రచారం జరుగుతుంది. జేబీ శ్రీనివాస్ కు కలిసి వచ్చే అంశాలలో మొదటిది రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడు తోపాటు తిరుపతి జిల్లా ఇంచార్జీ మంత్రి అనగాని సత్యప్రసాద్ సపోర్ట్ బలంగా ఉన్నట్లు తెలుస్తుంది… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి కార్పొరేషన్ డీప్యూటి మేయర్ ఉప ఎన్నికల్లో జేబీ శ్రీనివాస్ తనదైన శైలిలో రాజకీయ చతురతను ప్రదర్శించి వైసిపి కి సంబంధించిన అసంతృప్తి కార్పొరేట్లను తమ వైపు తీప్పుకోవడంలో ప్రధాన భూమిక పోషించారు.. దీంతో కార్పొరేషన్ డీప్యూటి మేయర్ ఎన్నిక టిడిపి ఖాతాలోకి చేరింది. ఈ మొత్తం ఎపిసోడ్ ను మంత్రి అనగాని సత్యప్రసాద్ గ్రహించి ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసులేల్లారని సమాచారం.
సుదీర్ఘ రాజకీయ అనుభవం, వంశపారంపర్యంగా రాజకీయ నేపథ్యం ఉన్న మరో సీనియర్ పొలిటీషియన్ మబ్బు దేవనారాయణ రెడ్డి.మొన్నటి వరకు తుడా చైర్మన్ పదవి ఆశించి రాకపోవడంతో ప్రస్తుతం తిరుపతిలో మిగిలిన ఉన్న ఏకైక ప్రాముఖ్యత కలిగిన పదవి టిడిపి ఇంచార్జీ పదవి పై ఆశలు పెంచుకున్నారు. తిరుపతి రాజకీయాల్లో వీళ్ళు కుటుంబం సీనియర్ మోస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు… మబ్బు దేవనారాయణరెడ్డి తండ్రి కీ.శే.మబ్బు రామిరెడ్డి గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేయడంతో అప్పట్లో మబ్బు దేవనారాయణరెడ్డి చురుకైన రాజకీయ నాయకుడుగా తన తండ్రికి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉన్నా అనుభవం ఉంది. అదే గుర్తింపు తిరుపతి ప్రజల లో కూడా ఉంది.అదే విధంగా మబ్బు దేవనారాయణరెడ్డికి మాజీ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కరరెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండడం,ప్రస్తుతం అయన కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టిడిపి పార్టీలో కోనసాగుతు ఉండడం ఈయనకు కలిసి వచ్చే అవకాశాలుగా చెపుతున్నారు. కాకపోతే
తిరుపతిలో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తిరుపతి వాసులు కోరుకుంటారు అని సమాచారం.అయితే మబ్బు దేవనారాయణరెడ్డి సీనియర్ మోస్ట్, మరియు డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ గా తిరుపతిలో పేరు ఉంది.రాష్ట్ర స్థాయి పదవి లేక కేంద్ర స్థాయి పదవితో సత్కరించాలని సియం చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం…
మీరు ముగ్గురితోపాటు మరోకరు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం ఇతని తండ్రి స్వర్గీయ కోడురు సుబ్బయ్య టిడిపి సీనియర్ పోలటిషియన్. తండ్రి కోడూరు సుబ్బయ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి చాలా సన్నిహితంగా ఉండేవారు ఈ అవకాశమే కోడూరు బాలసుబ్రమణ్యం కు కలిసి వచ్చిన అంశం ఆయన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి, నారా లోకేష్ కి అతి సన్నిహితంగా ఉంటున్నారు. అయితే టిడిపి ఇన్చార్జి రేస్ లో బలిజ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒకరు ఉండడంతో ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠత నెలకొంది. అసలు ఎవరికీ టిడిపి తిరుపతి ఇన్చార్జి పదవి దక్కనుందో అని ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. కానీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపుతో ఎవరికి తిరుపతి టిడిపి ఇన్చార్జి పదవి కట్ట పెడుతుందో అని తిరుపతి వాసులు ఎదురుచూస్తున్నారు. కడపలో జరిగిన టిడిపి మహానాడు కన్నా ముందే తిరుపతి ఇన్చార్జి పదవిని అనౌన్స్ చేస్తారు అని అందరూ భావించారు కానీ టిడిపి అధిష్టానం మాత్రం మహానాడు అయిన తర్వాత ప్రకటించాలని భావించినట్లు ఉంది. కడపలో మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది, రెండు నెలలు గడచి పోయాయి.ఇకనైనా తిరుపతికి టిడిపి ఇన్చార్జి ప్రకటిస్తే బాగుంటుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. తిరుపతిలో వైసీపీని ఎదుర్కోవాలంటే యువ నాయకులైన వారికి టిడిపి ఇన్చార్జి పదవి కట్టబెడితే బాగుంటుందని తెలుగు తమ్ముల్ల ఆలోచన ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. Excitement Over Tirupati TDP In-Charge.
అలాగే మండల, పట్టణ, నగర కమిటీల ఎన్నిక ఇంకా జరగలేదు.పలుచోట్ల ఏకాభిప్రాయం కుదరడం లేదు. చాలాచోట్ల పోటీ తీవ్రంగా ఉంది. ఆశావహుల పేర్లు అధిష్ఠానానికి చేరాయి. కొన్ని చోట్ల ఒకే పేరు సిఫారసు చేసారని సమాచారం కానీ అధికారిక ప్రకటనలు వెలువడడం లేదు. పరిశీలకులు మొదలుకుని ఎమ్మెల్యేల దాకా సంస్థాగత ఎన్నికలను సీరియ్‌సగా తీసుకోవడం లేదని టీడీపీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయా అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడుస్తున్న పూర్తిస్థాయిలో నామినేటెడ్ పదవులు ఇవ్వలేదని టిడిపి క్యాడర్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి నెలకు ఉందని సమాచారం.తిరుపతి నియోజకవర్గం 50 డివిజన్లలోనూ దాదాపు అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక పూర్తయింది. నగర కమిటీ మాత్రం ఇంకా పెండింగులోనే ఉంది. జిల్లా కేంద్రం కావడంతో ఈ కమిటీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా బలిజ, యాదవ, కమ్మ సామాజికవర్గాల నుంచీ పలువురు ఈ పదవి ఆశిస్తున్నారు. మునిశేఖర్ రాయల్, ఆనంద్ యాదవ్, మన్నెం శ్రీనివాసులు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇన్‌ఛార్జి నియామకం కూడా ఇక్కడ పెండింగులో ఉండటం తో ప్రతిపక్ష నాయకులు తిరుపతిలో రెచ్చిపోతున్నారని తిరుపతి తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుసగుసలు వినపడుతున్నాయి.
అధిష్ఠానం ముందు ఇన్‌ఛార్జిని నియమిస్తుందా లేదా నగర కమిటీని ప్రకటిస్తుందా అన్నది సస్పెన్స్ గా కొనసాగుతుంది.నియోజకవర్గ పరిశీలకుడు ఆలపాటి రాజా గత మంగళ, బుధవారాల్లో ఇక్కడే మకాం వేసి డివిజన్, క్లస్టర్ స్థాయి నేతలతో సమావేశమై వారి అభిప్రాయాలు సేకరించి అధిష్ఠానానికి అందజేశారు అని సమాచారం.కానీ టిడిపి అధిష్టానం మాత్రం సస్పెన్షన్‌కు ఎప్పుడు తేర తీస్తుందో అని వేయి కళ్ళతో తిరుపతి ప్రజలతో పాటు టిడిపి నాయకులు సైతం వేచి చూస్తున్నారు. తిరుపతిలో వైయస్సార్సీపీ నాయకులను దీటుగా ఎదుర్కోవాలంటే తిరుపతిలో టిడిపికి సరైన నాయకత్వం కలిగిన నాయకుడు అవసరం. ఇక్కడ అందరూ లీడర్లే కావడంతో ఎవరికివారు యమునా తీరే అన్నట్లుగా తిరుపతిలో టిడిపి నాయకులు ఉన్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరియైన నాయకుడు వస్తే తప్ప వైయస్సార్సీపీని ఎదుర్కోవడం కష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.