ముగ్గురు మొనగాళ్లతో బాబీ సినిమా..?

Director Bobby Mega Trio: డైరెక్టర్ బాబీ ఇటీవల బాలయ్యతో డాకు మహారాజ్ అంటూ భారీ సినిమా చేశాడు. సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా సక్సెస్ సాధించింది. అయితే.. ఇంత వరకు బాబీ కొత్త సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు. ఆమధ్య కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో బాబీ సినిమా అంటూ ప్రచారం జరిగింది కానీ.. ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదని తెలిసింది. ఇప్పుడు ముగ్గురు మొనగాళ్లతో బాబీ సినిమా ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. ఎవరా ముగ్గురు మొనగాళ్లు..? ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ కానుంది..?

మెగాస్టార్ చిరంజీవితో బాబీ నెక్ట్స్ మూవీ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇటీవల చిరంజీవికి బాబీ కథ చెబితే.. చాలా బాగుంది ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. బాబీ ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడని తెలిసింది. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర సినిమాని అక్టోబర్ లో రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ వర్క్ దాదాపు కంప్లీట్ అయ్యిందని తెలిసింది. ఫైనల్ గా మరోసారి వీఎఫ్‌ఎక్స్ వర్క్ చెక్ చేసుకుని అప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారట. ఆగష్టు 22న చిరు బర్త్ డే సందర్భంగా విశ్వంభర రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని సమాచారం.

ఇక అసలు విషయానికి వస్తే.. చిరంజీవి కోసం బాబీ రెడీ చేసిన కథలో మరో ఇద్దరు హీరోలు ఉంటారట. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు.. ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అయితే.. మరొకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఏ హీరోకు అయినా అభిమానులు ఉంటారు.. పవర్ స్టార్ కు అయితే.. భక్తులు ఉంటారు. అలాంటిది మెగాస్టార్ తో కలిసి పవర్ స్టార్ నటిస్తే.. అందులో చరణ్‌ కూడా కనిపిస్తే.. ఇక ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. Director Bobby Mega Trio.

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌ కలిసి నటిస్తారా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రచారంలో ఉన్నట్టుగా కనుక ఈ క్రేజీ మూవీ నిజమైతే.. బాక్సాఫీస్ దగ్గర మామూలుగా ఉండదు. ఈ కథను చిరు, చరణ్‌ కు చెబితే ఓకే చెప్పారట. పవన్ కళ్యాణ్‌ కూడా అన్నయ్య కోసం నటిస్తానని మాట ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. మరి.. బాబీ నిజంగానే ఈ మెగా హీరోలతో సినిమా ప్లాన్ చేస్తున్నాడా..? లేదా..? అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read: https://www.mega9tv.com/cinema/he-is-a-stylish-hero-sai-dharam-tejs-comments-went-viral-on-social-media/