డేంజర్ ధర్మస్థల..!

Dharmasthala 3 dead bodies: ధర్మస్థలలో దొరికింది మూడు శవాలు మాత్రమే. కానీ ఆ శవాలను పాతి పెడుతుంటే చూశామని చెబుతున్న సాక్షులు మాత్రం ఏడు మంది. 50 ఏళ్ల ఒక వ్యక్తి సాక్షితో మొదలైన ధర్మస్థల శవాల వేట కథ ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఓ మహిళ ఏడవ సాక్షిగా తెరపైకి వచ్చింది. మొదటి సాక్షి కాకుండా ఒక పారిశుద్ధ్య కార్మికుడు 13వ స్పాట్ లో శవాలను పాతుతుంటే తాను కళ్లారా చూసా నంటూ ఆ మహిళా సిట్ ముందుకు వచ్చి సాక్ష్యం ఇచ్చింది.

అంతే కాదు శవాన్ని పాతిన తర్వాత ఆ పారిశుద్ధ్య కార్మికుడు నేరుగా తన ఇంటికే వచ్చాడని…ఇంక తనకి నీళ్లు కావాలని అడిగాడన్నది. తర్వాత గొయ్యి తవ్వడానికి ఉపయోగించిన గునపాలను, బకెట్లను తన ఇంటి దగ్గరనే శుభ్రం చేశాడని ఆ మహిళ సిట్ అధికారులకు వివరించింది. దీంతో ధర్మస్థల కేసు ఊహించని మలుపు తిరిగినట్టు అయ్యింది. ధర్మస్థలలో శవాలు ఉన్నాయా లేవా అనే మిస్టరీ ఇంకా తేలనే లేదు. ఇప్పటి వరకు కేవలం మూడు స్పట్స్ లో మాత్రమే రెండు చోట్ల మాత్రమే మూడు అస్థిపంజరాలను మాత్రమే కనిపెట్టారు సిట్ అధికారులు. ఒకటి స్పాట్ నెంబర్ 6లో రెండు పుర్రెలు, 30 యముకలు దొరికాయి. అలాగే స్పాట్ నెంబర్ 11 దగ్గర 11a గా కొత్త స్పాట్ ను గుర్తించారు. దానినే బంగ్ల గడ్డ గుట్ట అంటారు. ఈ గుట్ట లోపల ఒక శవాన్ని గుర్తించారు. అది మహిళ శవంగా ఐడెంటీ ఫై చేశారు. ఆ శానికి సంబంధించిన చీర, చెప్పులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు చోట్ల మూడు శవాలు, 30 ఎముకలు తప్ప ఇంత వరకు ధర్మస్థలలో ఎటువంటి శవం భయట పడలేదు. లభించలేదు.

ఇవన్ని పక్కన పెడితే 13వ స్పాట్ లో తవ్వకాలు జరగలేదు. వరుసగా 12 స్పాట్లను తవ్విన తర్వాత ఈనెల 8వ తేదీన 13వ స్పాట్ ని తవ్వాల్సిన అవసరం ఏర్పడింది. కానీ 13వ స్పాట్ దగ్గరకు రాగానే ఎవరైతే ఫిర్యాదు చేసిన సాక్షి ఉన్నారో తను మాట మార్చాడు. అక్కడ శవాలు లేవు 13వ స్పాట్ పైన తవ్వకానికి కొన్ని సాంకేతిక సమస్యలు కూడా కొన్ని అడ్డొచ్చాయి. అయితే 13వ స్పాట్ ని తవ్వే ముందు కూడా కొంత టెక్నికల్ సపోర్ట్ తీసుకోవాలి అనుకున్నారు. అది కుదరకపోవడంతో కొత్త స్పాట్ వైపు తమ దృష్టిని మళ్లీంచారు.

కొత్త స్పాట్ లో ఇప్పటి వరకు మొత్తం 16 స్పాట్ లు గుర్తించారు. ఇక మిగతా స్పాట్ లు ఎక్కడ ఉన్నాయనే చూస్తే ధర్మస్థల గేట్ కి మెయిన్ గేట్ కి దగ్గర్లో ఉన్న బాహుబలి కొండల పైకి తీసుకెళ్లాడు…ఇది మెయిన్ రోడ్డుకి దాదాపు అర కిలో మీటర్ లోపల ఉంటుంది. దానిని బొలియార్ ఏరియా, బొలియార్ ఫారెస్ట్ అంటారు. అక్కడ తవ్వకాలు జరిపినా కూడా ఒక్క అస్థిపంజరం కనిపించలేదు. మొదటి సాక్షి చెబుతున్న మాటల్లో వాస్తవం ఉందా…నిజంగా తను ఎవరినైనా దోషీగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారా. లేని హత్యలు జరిగినట్టుగా చూపించి అక్కడ ఉన్న కొందరు ప్రముఖుల పేర్లను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా అనే చర్చ అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఎందుకంటే ధర్మస్థల ఆస్తానం అనేది చాలా పరమ పవిత్రమైనది. మహాశివుడు పూజలు అందుకుంటున్నారు. మంజునాథ క్షేత్రంగా పరమపవిత్రమైన క్షేత్రంగా గుర్తింపు ఉంది. సౌత్ ఇండియా నుంచే కాకుండా దక్షిణ, నార్త్ ఇండియా నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అటువంటి ధర్మస్థల ఇప్పుడు మొదటి సాక్షి ఆరోపణలతో ఒక్క సారిగా శవాల దిబ్బగా మారిపోయింది. అక్కడ వందలాది శవాలు పాతి పెట్టారు. వందలాది మంది మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసి తన చేతనే పాతి పెట్టించారని మొదటి సాక్షి ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఒక్కసారిగా ధర్మస్థలికి విజిట్ చేసే భక్తులు సంఖ్య కూడా తగ్గిపోయింది. వారాంతంలో దాదాపు 60 వేల వరకు భక్తులు అక్కడి వచ్చి మంజునాథ స్వామిని దర్శించుకునే వారు. కానీ ఇప్పుడు కనీసం రెండు వేల మంది భక్తులు కూడా అక్కడికి రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు ఎవరైతే దేవస్థానానికి సంబంధించిన మేనేజ్ మెంట్ కమిటీ ఉందో అతను వీరేంద్ర హెగ్దే పైనా నేరుగా కొందరు వ్యక్తులు అతనిపైనా ఆరోపణలు చేస్తున్నారు.

ధర్మస్థలిలో జరిగిన మారణహోమానికి కారణం వీరేంద్ర ఫ్యామిలీ అంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొదటి సాక్షి కూడా ఆ ఆరోపణలు రుజువు చేసేందుకే వాళ్లు చెప్పడం వళ్లే తాను శవాలను పాతి పెట్టాననే మాటను రుజువు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ మొదటి సాక్షి చెప్పిన ఒక్క డెడ్ బాడీనీ కూడా అధికారికంగా తాను చెప్పిన చోట చూపించలేకపోయాడు. మొదటి నుంచి నేత్రావతి నది ఒడ్డున 8 చోట్ల తవ్వకాలు జరిపితే కేవలం 6వ ప్లేస్ లో మాత్రమే కొన్ని పుర్రెలు, కొన్ని ఎముకలు లభించాయి. అందులో ఆ ఎముకలు, పుర్రెలపైనా ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ప్రాధమికంగా కొందరి ఎముకలు మహిళలవని ప్రచారం జరిగింది కానీ అధికారికంగా ఎటువంటి ధృవీకరణ జరగలేదు. Dharmasthala 3 dead bodies.

ఇకపోతే 11వ స్పాట్ కి వచ్చే సరికి మళ్లీ స్థలాన్ని మార్చేశాడు సాక్షి. అక్కడున్న బండ్ల గుట్ట పైకి సిట్ అధికారులను తీసుకెళ్లాడు. గుట్ట పైన ఒక చోట తవ్వకం జరిగితే అక్కడ ఒక చీర, చెప్పులు, కొన్ని ఎముకలు భయటపడ్డాయి. ఆ ఎముకలు కూడా ఒక మగాడి డెడ్ బాడీకి సంబంధించినవి కొన్ని రిపోర్ట్ తెరపైకి వచ్చాయి. అయితే అందులో కూడా ఆ హత్యలు 10 ఏళ్ల క్రితం జరిగిన హత్య కాదది రెండు మూడు ఏళ్ల క్రితం జరిగిన హత్యా అనీ కూడా విచారణకు వచ్చిన ఫోరెన్సిక్ అధికారులు తేల్చారు. ఆ డెడ్ బాడీ పై ఉప్పు పోసీ డీఎన్ ఏ ను కాపాడే విధంగా బకెట్లలో సీజ్ చేసి ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ కు తరలించారు.

ఆ తర్వాత సాక్షి మళ్లీ చూపించిన మొదటి 11, 12 వ చోట్లలో తవ్వకాలు జరిపారు. అక్కడ కూడా ఎటువంటి డెడ్ బాడీ దొరకలేదు. ఇక 13వ స్పాట్ కి వచ్చే సరికి కొంత టెక్నికల్ సపోర్ట్ అవసరమైంది సిట్ కి. ఎందుకంటే 13వ స్పాట్ లో కనీసం 10 అడుగుల లోతు, 20 అడుగుల వెడల్పుతో తవ్వకాలు జరపాల్సిన అవసరం ఏర్పడింది. ఈ 13వ స్పాట్ నేత్రావతి నది స్నానాల ఘాట్ కి ఆనుకోని ఉంటుంది. అది ఒక ఆనకట్టగా ఉంటుంది. అక్కడ తవ్వకాలు జరిపితే నది ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉంది. దీని కోసం సిట్ ఒక కొత్త ఆలోచన చేసింది. గ్రౌండ్ పెరిడ్రేటిన్ రాడర్ ద్వారా కొంత ముందుగానే ఎటువంటి తవ్వకం జరగకుండానే రాడార్ సహాయంతో భూమి లోపల అస్థిపంజరాలు ఉన్నాయా లేవా అనేది గుర్తించే ఒక ప్రక్రియని చేపట్టారు. ఎందుకంటే 13వ స్పాట్ లో ఒక వేళ తవ్వకం జరిగితే నీరు ఊటగా ఊరే అవకాశం ఉంది. ఏదైతే కరకట్ట మాదిరిగా ఉందో ఆ కరకట్ట తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో 13వ స్పాట్ లో తవ్వకాలు ఆగిపోయింది. అయితే ఇక్కడికి gpr రావాల్సిన అవసరం ఉంది. అయితే ఆగిపోయిన 13వ స్పాట్ చుట్టు అయితే ఇప్పుడు కథ అంతా నడుస్తుంది.

ధర్మస్థలిలో ఒక మహిళ సిట్ దగ్గరుకు వచ్చింది. అక్కడ శవాన్ని పాతుతుంటే తానే చూసానని సిట్ అధికారులకు నివేదించింది. తాను ప్రత్యక్ష సాక్షిని అని చెబుతుంది. అదే సాక్షి ఇంకో మాట కూడా చెబుతుంది. అయితే ఈ మహిళ కంటే ముందు ఆరుగురిలో కొందరు మహిళలు ఉన్నారు. వాళ్లు కూడా సిట్ దగ్గరకు వచ్చి ఒక భయంకరమైన విషయాన్ని చెప్పారు. 13వ స్పాట్ లో డెడ్ బాడీలను పాతి పెట్టిన సంఘటనను తాము కూడా చూశామన్నారు. సో అక్కడ తవ్వకాలు జరపాల్సిందే అని సిట్ అధికారులకు చెబుతున్నారు.

ఇదంతా చూస్తుంటే ధర్మస్థలలో నిజంగా డెడ్ బాడీలు ఉన్నాయా…ఈ ఏడు మంది సాక్షులు… ఇప్పటి వరకు దొరికింది మూడు శవాలు మాత్రమే. అయితే ఇక్కడ వందల శవాలు పాతి పెట్టారని సాక్షులు చెబుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 30 స్పాట్ లను ఇప్పటి వరకు సిట్ అధికారులకు చూపించారు సాక్షులు. అందులో 13 చోట్ల అయితే తవ్వకాలు జరిగాయి. వాళ్లు గుర్తించిన 13వ స్పాట్ లో రాడార్ తో సర్చ్ చేయాల్సిన అవసరమైతే ఏర్పడింది. అయినా కూడా అక్కడ ఒక్క అస్థిపంజరం కూడా అధికారికంగా అయితే లభ్యం కాలేదు. అయితే 13వ స్పాట్ లో రాడార్ సహాయంతో తవ్వకాలు జరుగుతున్నాయి. శవాలు దొరుకుతాయా లేదా అనే టెన్షన్ కొనసాగుతోంది. మొదటి సాక్షి చెప్పింది నిజమ ఉందా లేకపోతే అబద్ధాలు చెబుతూ మొత్తం ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడా. ఎందుకంటే ధర్మస్థల శవాల కథ అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.

Also Read: https://www.mega9tv.com/national/prime-minister-modis-first-lady-bodyguard-adaso-kapesa/