
US demanding Trump’s resignation: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రజలు తిరుగబాటు మొదలు పెట్టారు. సొంత దేశంలోనే ట్రంప్ నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. టారిఫ్ పెంపు వల్ల అమెరికన్ లకు కొత్త కష్టాలు తప్పడం లేదు. అమెరికా మార్కెట్లలో ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం తప్పదంటున్నారుఆర్థిక నిపుణులు.
ట్రంప్ నిర్ణయాలపై us ఆర్థిక వేత్త స్టీవ్ హాంకీ కూడా విమర్శనాస్త్రాలు వదులుతున్నారు. టారిఫ్ ల పేరుతో ట్రంప్ కడుతున్న పేక మేడలు కూలి పోతాయంటూ ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారత్ కొంత కాలం ఓపిక పట్టాలని స్టీవ్ హాంకీ హితవు పలుకుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పలు సంచలనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలు వరుస విధానాలు, వాణిజ్యం, విద్య, ఇంధనం ఇతర రంగాల్లో ప్రభావితం చేశాయి. భారత్, చైనా., బ్రిజిల్ వంటి దేశాలపై సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. భారత్ పై 25 పర్ సెంట్ అధనపు సుంకాలు విధించడంతో పాటు భారతీయ ఉత్పత్తులపై మరింత కఠిన నియంత్రణను విధించారు. ట్రంప్ టారిప్ విధానాలపై ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా సొంత దేశంలో ఆయన పై విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయన్ని బెడిసి కొడుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది.
ట్రంప్ టారిఫ్ లు పెంచడం వల్ల అమెరికాలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతుంది. ప్రపంచ దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు విధించడంతో అమెరికాలో వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇది సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపీ…ఈ టారిఫ్ లవల్ల అమెరికా కుటుంబాలపై సగటున ఏడాదికి రెండువేల 4వందల డాలర్లు ఖర్చు పడవచ్చని అంచనా వేస్తున్నారు. తక్కువ ఆదాయ వర్గాల పై 130 డాలర్లు, అధిక ఆదాయ వర్గాలపై 5వేల డాలర్ల వరకు భారం పడే అవకాశం లేకపోలేదు. US demanding Trump’s resignation.
ట్రంప్ టారిఫ్ లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆర్థికవేత్తలు అయితే హెచ్చరిస్తున్నారు. ట్రంప్ దెబ్బకు అమెరికా ఆర్థికవ్యవస్థ పేక మేడలా కూలి పోతుందని కూడా పేర్కొంటున్నారు నిపుణులు. ట్రంప్ టారిఫ్ విధానాలపై US ఆర్థికవేత్త జాన్ హాబ్ కింగ్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీల్ హాంకీ కూడా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలపై ఆర్థిక ఒత్తిడి పడుతుంది అని అంటున్నారు. ఇక భారత్ పై విధిస్తున్న సుంకాలపై స్పందించిన స్టీల్ హాంకీ కొన్ని రోజులు వేచి చూడాలీ అంటూ కూడా హితవు పలుకుతున్నారు. ఇక త్వరలోనే ట్రంప్ పై పెద్ద ఎత్తున వ్యతిరేక ఉద్యమం మొదలై రాజీనామా చేసే వరకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుందంటున్నారు.
ట్రంప్ నిర్మిస్తున్న పేక మేడ త్వరలో కూలిపోతుందని స్టీల్ హాంకీ వెల్లడించారు. సుంకాల విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా చెత్తగా ఉన్నాయని ఫైర్ అవుతున్నారు. తన పంతం నెగ్గించుకోవాలనే ఆలోచన లక్షల మందిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ప్రపంచ దేశాలతో వైరం పెట్టుకోవడం ట్రంప్ పతనం స్టార్ట్ అయ్యిందని అంటున్నారు. మరీ ఏం జరుగుతుందో వేచి చూద్దాం.
Also Read: https://www.mega9tv.com/international/us-reward-for-venezuela-president-nicolas-maduro-50-million/