లెజెండ్ బాలయ్యను ఢీ కొట్టే ధమ్మెవరికుంది.?

Legend Balayya’s Hindupur Constituency: ఆయన tdpలోనే కీలక నాయకుడు. ఆయన స్టైల్ కూడా మిగితా రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంటుంది. అంతే కాదండోయ్ రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. ఇప్పటికే ఆయన హ్యాట్రిక్ విజయాలతో ఆ నియోజకవర్గంలో పాతుకుపోయారు….వైసీపీ మాత్రం ఎన్నికలకు ఒకసారి అభ్యర్థిని మార్చినా ఆయన్ని ఓడించలేకపోయారు. ఆయనకు అక్కడ ఇంత బలం ఎలా వచ్చింది. ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారిన ఆ నాయకుడు ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.

హిందూపురం నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి బలమైన కోటలా మారింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రత్యర్ది పార్టీలు టీడీపీ ఓడించలేకపోయారు.ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీనే విజయం సాధిస్తుంది. ఇక్కడ టీడీపీకి బలమైన కేడర్ విశ్వసనీయ ఓట్ బ్యాంక్ ఉండటం కూడా గెలుపునకు ప్రధాన కారణం. హిందూపురం నియోజకవర్గం నందమూరి ఫ్యామిలీకి ఓ సెంటిమెంట్ గా మారింది. ఈ ప్రాంతానికి ఆ కుటుంబానికి బంధం చాలా పాతది. 1985లో అప్పటి సీఎం ఎన్టీఆర్ మొదటి సారి ఇక్కడి నుండే పోటీ చేసి గెలుపొందారు. ఆ విజయంతోనే ఆయన హిందూపురాన్ని తన బలమైన కోటగా మార్చుకున్నారు. వరుసగా మూడ సార్లు ఎన్టీఆర్ ఇక్కడి నుండే విజయం సాధించారు.

ఆతర్వాత ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ ఒక సారి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇక మధ్యలో 1999 నుంచి 2009 వరకు మూడు సార్లు స్థానిక నేతలకు ఛాన్స్ ఇచ్చినా హిందూపురం ఓటర్లు మాత్రం ఎప్పటికి టీడీపీ వెంటనే నిలబడ్డారు. 2014లో నందమూరి బాలకృష్ణ రాజకీయాలోకి ఎంట్రి ఇచ్చి హిందూపుం నుంచి పోటీ చేశారు. 1983 నుండి ఈ నియోజకవర్గం టిడిపికి కంచుకోటగా ఉంది, ఎల్లో పార్టీ అభ్యర్థులందరూ విజయం సాధించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన బాలకృష్ణ, టిడిపి టిక్కెట్‌పై హిందూపూర్ నుండి పోటీ చేసి తన తొలి ఎన్నికల్లో విజయం సాధించారు.
అప్పటి నుంచి ఇక్కడ బాలయ్య వరుసగా విజయం సాధిస్తున్నారు.

ఇక 2014, 2019, 2024 మూడు ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. స్పెషల్ ఏంటీ అంటే ప్రతి సారి తన మెజార్టీనీ మరింత పెంచుకుంటూ వచ్చారు బాలయ్య. అయితే ఇక్కడ వైసీపీ మాత్రం టీడీపీకి బ్రేక్ లు వేయడానికి చేయని ప్రయత్నాలు లేవు. ప్రతీ ఎలక్షన్స్ లో అభ్యర్థులను మార్చి పోటీకి దింపినా ఫలితం మాత్రం మారలేదు. అందుకే హిందూపురంలో బాలయ్య పేరు అన్ స్టాపబుల్.

హిందూపురం అసెంబ్లీ నియోకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ ఒక ప్లాన్ వేసింది. బీసీ మహిళను అభ్యర్థిగా నిలబెట్టి బాలయ్యకు షాక్ ఇవ్వాలని ట్రై చేసింది. కానీ ఆ ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు. అంతేకాదు బాలయ్య మెజారిటీ 18వేల నుంచి 31వేలకు పెరిగి వైసీపీకి మరింత నిరాశే మిగిల్చింది. ఈ సారైనా హిందూపురంలో పట్టు సాధించాలని జగన్ భావించినా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యంగా వైసీపీలో వర్గ విభేదాలు తగ్గడం లేదు. అన్ స్టాపబుల్ బాలయ్యను ఎదుర్కోవాలీ అంటే అందరు ఒక్కటిగా కష్టపడాలీ. కానీ వైసీపీలో గ్రూప్ ల గోల ఎక్కువగా ఉండడంతో వైసీపీ అధినేతకు తలనొప్పిగానే మారింది. ఇంకా ఎన్నికలకు నాలుగు ఏళ్ల సమయం ఉన్నప్పటికి హిందూపురం వైసీపీ నేతల్లో అభ్యర్థి నేనే అనే పోటీ మొదలైంది. ఇప్పటి నుంచే ఎవరికి వారే ప్రకటనలు చేసేస్తున్నారు.

అసలు టీడీపీకి హిందూపురం కంచుకోటలా మారింది అంటే..1984లో ఉమ్మడి ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయ హిస్ట్రీలోనే ఒక పెద్ద మలుపు తిప్పాయి. ఇక అదే సమయంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా అప్పటి సీఎం ఎన్టీరామారావును గవర్నర్ రామ్ లాల్ పదవి నుంచి తప్పించారు. అయితే ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని భావించిన ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. ఇక ప్రజలు పెద్ద ఎత్తున ప్రతి గల్లీలోను ఆందోళనలు తీవ్రతరం చేశారు.

ఇక ఇదే సమయంలో హిందూపురం నియోజకవర్గం ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. ఇక ఇక్కడ జరిగిన హింసాత్మక ఘటనలు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం నిరసనలు రాష్ట్రంలో ఎక్కడ లేనంతగా ఉద్రితంగా జరిగాయి. ఈ ప్రాంత ప్రజలు ఎన్టీరామారావు పట్ల చూపిన ప్రేమ అభిమానాన్ని చూసి హిందూపురం నుంచే పోటీ చేయాలని బాలయ్య గతంలోనే నిర్ణయించుకున్నారని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్న మాట.

అప్పటి నుంచి ఎన్టీరామారావు హిందూపురం నుంచి వరుసగా పోటీ చేసి విజయం సాధించారు. ఆవిధంగా హిందూపురం ఎన్టీఆర్ మధ్య ఒక గాడమైన రాజకీయ భావోద్వేగ బంధం ఏర్పడింది. ఆయన తర్వాత హరికృష్ణ, బాలయ్య ఇక్కడ గెలిచారు. బాలయ్య కూడా వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టి బలంగా పాతుకు పోయారు.

వృత్తి రిత్యా నటుడు కావడంతో బాలయ్య నియోజకవర్గంలో పెద్దగా కనిపించరంటూ వైసీపీ విమర్శించింది. కానీ అభివృద్ధి పనుల్లో మాత్రం బాలయ్య తగ్గేదే లేదంటూ దూసుకుపోతారు. గతంలో హిందూ పురం నుంచి మూడు సార్లు గెలిచిన ఎన్టీరామారావు ఈ నియోజక అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయన హిందూపురంలో అనేక పరిశ్రమలు స్థాపించడమే కాకుండా మౌలిక సదుపాయాలను మెరుగు పరిచే పనులు కూడా చేశారు. ఈ కృషి వల్ల హిందూపుంరం ఆర్థికంగా, సామాజికంగా మంచి పురోగతి సాధించింది. బాలయ్య కూడా తగ్గేదే లే దంటున్నారు. సుమారు రూ. 560 కోట్లతో 120 కిలో మీటర్ల పైప్ లైన్ వేసి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి తాగు నీటిని హిందూపురానికి తరలించారు. ఈ ప్రాజెక్ట్ 2019 ఎన్నికల్లో బాలయ్య విజయానికి పెద్ద కారణం అయ్యింది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. Legend Balayya’s Hindupur Constituency.

అంతే కాదు ప్రభుత్వ ఆసుప్రతుల అభివృద్ది, అలాగే తన సొంత ఖర్చులతో అన్నా క్యాంటీన్ లను నిర్వహించిన నేత బాలయ్య. బాలయ్యను కేవలం ఒక ఎమ్మెల్యే గా కాకుండా తమ సొంత మనిషిగా చూసుకుంటారు హిందూపురంవాసులు. ఇక వైసీపీకి హిందూపురాన్ని కొట్టడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదన్న టాక్ వినిపిస్తుంది. వైసీపీ నేతలు అంతా ఏకమైనా బాలయ్యను ఢీ కొట్ట లేరని నియోజకవర్గ ప్రజల మాట. దట్ ఈజ్ ది లేజండ్ బాలయ్య.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/vidadala-rajini-scene-reverse-in-palnadu-district-check-out-the-consequences/