
Ram Charan & Upasana konidela: సినిమా సెలబ్రిటీల జీవన శైలి ఎప్పుడూ ఒక మాయాజాలంలా అభిమానులను ఆకర్షిస్తుంది. వారు ధరించే దుస్తులు మొదలు వాడే వస్తువుల వరకు ప్రతి దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. వారు ఇళ్లలో ఎలా ఉంటారు.. రోజువారీ జీవితంలో వారి ఆహారపు అలవాట్లు ఏమిటీ…జీవిత భాగస్వామితో వాళ్లు ఎలా ఉంటారు…పలు విషయాలపై అందరికి ఆసక్తి ఉంటుంది. అందుకే పలు ఇటర్వ్యూల్లో సినీ ప్రముఖులు తమ పర్సనల్ లైఫ్ గురించి చెబుతుంటారు. తాజాగా మెగా కోడలు ఉపాసన తన భర్త రామ్ చరణ్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ బెస్ట్ కపుల్ రామ్ చరణ్-ఉపాసన ఇద్దరూ ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్ల తర్వాత రామ్ చరణ్ దంపతులకు క్లింకార జన్మించింది. ప్రసుతం క్లింకార తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు చరణ్-ఉపాసనలు దంపతులు. Ram Charan & Upasana konidela.
తాజాగా ఉపాసన రామ్ చరణ్ పేరును తన ఫోన్ లో ఎలా ఫీడ్ చేసుకుందో, అలా ఎందుకు చేసుకుందో అనేది చెప్పుకొచ్చింది. అందరూ బుజ్జి, కన్నా, హబ్బీ, శ్రీవారు అంటూ భర్తల పేర్లని ఫోన్ లో ఫీడ్ చేసుకుంటారు. కానీ ఉపాసన మాత్రం రామ్ చరణ్ 200 అంటూ ఫీడ్ చేసుకున్నట్లుగా చెప్పింది. తానెందుకు అలా ఫీడ్ చేసుకుందో అనేది కూడా ఉపాసన వివరించింది. ఇప్పటివరకు రామ్ చరణ్ 199 సిమ్ లు మార్చారని, ఇది రెండు వందలో సిమ్ అని అందుకే అలా చరణ్ ఫోన్ నెంబర్ ని ఫోన్ లో సేవ్ చేసుకున్నట్లుగా ఉపాసన అసలు సీక్రెట్ చెప్పుకొచ్చింది.
Also Read: https://www.mega9tv.com/cinema/shouryuv-prepared-a-action-story-for-hero-karthi-in-telugu-genre/