
RS 1.3lakh Crore Credited: ప్రపంచంలో అప్పుడప్పుడూ ఆశ్చర్యకరమైన బ్యాంకింగ్ సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్‌కి చెందిన గ్రేటర్ నోయిడాలో జరిగింది. అదికూడా రెండు నెలల క్రితం మరణించిన ఓ మహిళ బ్యాంక్ ఖాతాలోకి ఏకంగా రూ.1.13 లక్షల కోట్లు జమ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
గ్రేటర్ నోయిడాకు చెందిన గాయత్రి దేవి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు 19 ఏళ్ల దీపక్ తన తల్లి ఖాతాను వాడుతున్నాడు. అయితే అతడి తల్లి ఖాతాకు సంబంధించి వచ్చిన ఓ మెసేజ్ చూసి మైండ్ దిమ్మతిరిగేలా అనిపించింది. ఆ మెసేజ్‌లో సుమారుగా రూ.1.13 లక్షల కోట్లు పైగా అకౌంట్ లోకి డబ్బులు క్రెడిట్ అయినట్లు చూపించింది. RS 1.3lakh Crore Credited.
మొదట దీపక్ ఇది ఏదో టెక్నికల్ గ్లిచ్ అనుకున్నాడు. కానీ, స్నేహితులు కూడా ఆ డబ్బు అకౌంట్ లో క్రెడిట్ అయ్యిందని క్లారిటీ ఇవ్వడంతో , ఖాతాలో ఉన్న మొత్తాన్ని చూసి అతడు షాక్‌కు గురయ్యాడు. దానితో కోటక్ మహీంద్రా బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి అధికారులకు సమాచారం ఇచ్చాడు. బ్యాంక్ అధికారులు అక్కడ జరిగిన విషయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దానితో వెంటనే సదరు ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఆ తర్వాత అధికారులు విషయాన్నీ Income Tax అధికారులకు ఇన్ ఫామ్ చేశారు.
Also Read: https://www.mega9tv.com/national/boycott-american-foods-hashtag-has-been-trending-in-social-media/